
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| యీ యేపునో యావు ఆ యేపునో యావు
జోడావులకు నడుమ నా యెంకి
యూడు
జోడుగా నిలుసుంటె నా యెంకి
ఆట
లాడతా కలిసుంటె నా యెంకి
నన్నె
సూడుమన్నట్లుండు నా యెంకి!
యీ యేపునో యేరు ఆ యేపునో యేరు
యేళ్ళ రెంటికి నడుమ నా యెంకి
తలను
పాలకడ వెత్తుకొని నా యెంకి
సేత
పూలు పుణుకుకొంట నా యెంకి
నన్నె
పోలుండుమంటాది నా యెంకి
యీ కాడనో కొండ ఆ కాడనో కొండ
కొండ కోనల నడుమ నా యెంకి
పాల
కుండ దించుకొని నా యెంకి
గుడికి
దండ మెడతా వుంటె నా యెంకి
సూడ
రెండేళ్ళ కనుపించు నా యెంకి!
యీ సాయనో సేను ఆ సాయనో సేను
సేల రెంటికి నడుమ నా యెంకి
పాలు
పూలు నా కందిచ్చి నా యెంకి
సొమ్ము
లేన మన కంటాది నా యెంకి
గుండె
జాలి పుట్టిస్తాది నా యెంకి!
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:38:59 PM IST "యెనక జల్మములోన
యెవరమో" నంటి
సిగ్గొచ్చి నవ్వింది
సిలక...నా యెంకి!
"ముందు మనకే జల్మ
ముందోలే" యంటి
తెల్ల తెల్ల బోయింది
పిల్ల ...నా యెంకి!
"యెన్నాళ్ళో మనకోలె
యీ సుకము" లంటి
కంట నీరెట్టింది
జంట ...నా యెంకి!
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:37:28 PM IST పదిమందిలో యెంకి
"పాట" నే పాడంగ
గోడ సాటున యెంకి గుటక లేసే యేళ
సూడాలి నా యెంకి సూపులా యేళ!
సూడాలి నా యెంకి సోద్దే మా యేళ!
"నా పాటె పా"టంట
"నా మాటె మా"టంట
నలుగురమ్మలు సేరి నను మెచ్చుతావుంటె,
సూడాలి నా యెంకి సూపులా యేళ!
సూడాలి నా యెంకి సోద్దే మా యేళ!
పొరుగమ్మతో నేను
వొరస లాడే యేళ
పొలమెల్లి నే పొద్దు పోయి వచ్చే యేళ,
సూడాలి నా యెంకి సూపులా యేళ!
సూడాలి నా యెంకి సోద్దే మా యేళ!
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:35:56 PM IST యెంకి వస్తాదాని
యెదురు తెన్నులు కాసి
దిగులుట్టి, తలదించి
తిరిగి సూసెతలికి...
యెంకి రావాలి నా యెదర నిలవాలి!
కులుకుతా నన్నేటో పలకరించాలి!
పిల్ల పొరుగూ రెల్లి
మల్లి రాలేదని
వొల్లంత వుడుకెత్తి
వొక్కణ్ణి పొడుకుంటే....
ఘల్లుమంటా యెంకి కాలు పెట్టాలి!
’యెల్లి వొచ్చా’ నంట యెంకి నవ్వాలి!
యెంకి కోపా లొచ్చి
యే దేశమో పోయి
కల్లోనా కాపడితె
కళ్ళూ తెరిసేతలికి
తళుకుమని యెంకి నా దరికి రావాలి!
’నిదర కాబో’ నంటు నింద నాడాలి!
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:34:13 PM IST తోట వూసంటే సీకాకూ
యెంకి......
తోటి యెల్లే దాని సోకూ!
బంతి సేమంతట్ల
పరువంతా సూసింది
మల్లెంటు మెల్లంగ
మారుమొగ్గ మేసింది
తోట వూసంటే సీకాకూ
యెంకి......
తూర్పేపు మళ్ళేటి
దుబ్బు దుట్రా యేటి
అంటు మామిళ్ళేటి
ఆ వొరస పళ్ళేటి!
తోట వూసంటే సీకాకూ
యెంకి......
గొడ్డూ గోదా బెంగ
గొని సిక్కి పోనాయి!
గడ్డిమేటిని సూత్తె
కడుపె సెరువౌతాది!
తోట వూసంటె సీకాకూ
యెంకి.......
నూతికాడే సోకు
యేతాముదే సోకు!
పోయి "పాడో"యంటె
"వో" యంట పలికేని!
తోట వూసంటే సీకాకూ
యెంకి
బలము సీదాపోయి
బడుగునై పోనాను!
కృష్ణా రామా యంట
కూకోవాలి సొచ్చింది
తోట వూసంటే సీకాకూ
యెంకి.......
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:32:46 PM IST నీ వెల్లిప్యినావంటే
పచ్చినై
నేనెటో కొట్లాడుతుంటే
యిరుగమ్మలక్కలతో నీవా
నా యెంకి,
యెకసక్కె మాడుతున్నావా!
నిన్ను రచ్చించమంటానే
పద్దాక,
యెన్నో దణ్ణాలు పెట్టేనే!
వొన్నె సీరలు గట్టి నీవా
నా యెంకి,
వోసుగా తిరుగుతున్నావా!
పొద్దత్తమానాలు కాదే
నీ వూసె,
వొద్దన్ననూ మరపురాదే!
అమ్మలక్కలతోటి నీవా
నా యెంకి,
సెమ్మ సెక్కలాడుతునావా!
రేతిర్లో మన తోటకాడా
వొక్కణ్ణి,
నా తిప్ప లీశ్వరుడు లేడా!
సీకు సింతా లేక నీవా,
నా యెంకి,
పోకల్లె పొండు తున్నావా!
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:31:01 PM IST యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
సెక్కిట సిన్నీ మచ్చ
సెపితే సాలదు లచ్చ!
వొక్క నవ్వే యేలు
వొజ్జిర మయిడూరాలు!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
పదమూ పాడిందంటె
పాపాలు పోవాల
కతలు సెప్పిందంటె
కలకాల ముండాల!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
తోటంత సీకట్లె
దొడ్డి సీకటిమయమె!
కూటి కెళితే గుండె
గుబగుబమంట బయిమె!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
రాసోరింటికైన
రంగు తెచ్చే పిల్ల!
నా సొమ్ము _ నా గుండె
నమిలి మింగిన పిల్ల!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:28:51 PM IST "నీతోటే వుంటాను నాయుడుబావా!
నీ మాటే యింటాను నాయుడుబావా!
సరుకులేమి కావాలె సంతన పిల్లా?"
"నువ్వు
మరమమిడిసి మనసియ్యి, నాయుడుబావా!
సక్కదనమున కేమిత్తు సంతన పిల్లా?"
"నువ్వు
సల్లగుండు పద్దాక నాయుడు బావా!
యేడనే నీకాపురమో యెల్తురుపిల్లా?"
"నీ
నీడలోనే మేడ కడతా నాయుడు బావా!"
"నీ తోటే వుంటాను నాయుడు బావా!
నీ మాటే యింటాను నాయుడు బావ !"
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:27:12 PM IST సూర్యుడొచ్చాడమ్మా సూర్యుడొచ్చాడూ
సొగసైన కిరణాల మాలతెచ్చాడూ (సూ)
చ. తోటలన్నీ తిరిగి తొంగిచూశాడూ
పేటలన్నీ నడచి పలకరించాడూ
వాడిపోయిన పేద లతలనే కదిపి
పసిడి రేకుల పూలు పూయించినాడు
చ. పూరింటిలో గడప పొదిగిటను నిలచి
పొంగు ఆకటికంటి నీరు తుడిచాడు
అలకలల్లన రేగి ధూళిలో దోగి
పిల్లగాళ్లకే కొత్త కలలనిచ్చాడు
చ. మిన్ను మిన్నంతట కనుల పండువుగా
మేళాలు తాళాలు మ్రోగుతున్నాయి
పుట్టు సిరివారల మాలలే కోరగా
మట్టి మనిషికి తానె అందించినాడు
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:18:48 PM IST దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా
షా్‌జహాన్ తిరిగొచ్చినా
తాజ్‌మహల్ రాసిచ్చినా
ఇప్పుడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే - 2
వెన్నెలా చూడు నన్నిలా
ఎంత హాయిగా ఉంది ఈ దినం
నమ్మవా నన్ను నమ్మవా
చేతికందుతూ ఉంది ఆకసం
ఇప్పుడే పుట్టినట్టుగా
ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు
చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో
వంగి వంగి ఈలోకం
కోయిలా నేర్చుకో ఇలా
ఆమె నవ్వులో తేనే సంతకం
హాయిగా పీల్చుకో ఇలా
చల్లగాలిలో ఆమె పరిమళం
నీతిపై చందమామలా
నేడు తేలుతూ ఉంది నా మది
చీటికి మాటి మాటికి
కొత్త కొత్తగా ఉంది ఏమది
అణువంతే ఉంటుందమ్మా ప్రేమ
అణచాలి అనుకున్నామా
చేస్తుందమ్మ హంగామా
సంతోషం
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:15:20 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|