
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి
నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి
నా వయసుకి వంతెన వేసీ
నా వళపుల వాకిలి తీసీ
మది తెర తెరిచీ పకే పరిచీ ఉన్నావే లోకం మరిచీ
నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి
నీ చూపుకి సూర్యుడు చలువాయె
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయే మాయే
నీ అడుగుకి ఆకులు పువులాయె
నీ కులుకుకి కాకులు కవులాయె
నీ కలలకి నీ కథలకి
కదలాడె హాయెఏ హాయే
అందంగా నన్నే పొగిడీ
అటుపైనా ఏదో అడిగీ
నా మనసనే ఒక సరసులో అలజడులే సృష్టించావే
నా మనసుకి ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావె ప్రెమను పంచి
ఒక మాటా ప్రేమగ పలకాలె
ఒక అడుగూ జతపడి నడవాలె
ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలె
యద పైనా నిదరే పోవాలె
తీయ తీయనీ నీ స్మృతులతో బతికేస్త నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలే
నీ ఆత్రుత గుర్తించలే
ఎటు తేలకా బదులీయకా మౌనంగా చూస్తున్నాలే
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:11:37 PM IST ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
సొగసులై బృందావనీ .. విరెసెనా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
నీ ప్రణయ భావం .. నా జీవ రాగం (2)
రాగాలూ తెలిపే .. భావాలు నిజమైనవి
లోకాలూ మురిసే .. స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
నా పేద హృదయం .. నీ ప్రేమ నిలయం (2)
నాదైన బ్రతుకే .. ఏ నాడో నీదైనది
నీవన్న మనిషే .. ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికీ బ్రతుకైనదీ
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
సొగసులై బృందావనీ .. విరెసెనా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
చిత్రం : అభిలాష
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:06:52 PM IST మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము..
II మనసు II
ఆశలు తీరని ఆవేశములో..
ఆశయాలలో.. ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము.
అదే స్వర్గము
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కనీరు నింపుటకు -2
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము
చెలిమియె కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయై పోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము
II మనసున II
చిత్రం : డాక్టర్ చక్రవర్తి
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:01:49 PM IST
aa gOdaarammaa,
gOdaari oDDuna unna aa puNyakshetraaluu..
(raajamandaram ,kOTipalli appanapalli,daachhaaram ,bhadraachalam ..
ilaa ennennO ..!)
gOdaarOlla aa bhaashaa .aa yaasaa,
aa maryaadaa..
aay ! ani buTTalO paDEsE aa telivitETaluu ..
aa choravaa ..
aa ulukuu ..
aa kulukuu ..
aa pilla kaaluvaluu ..
aa pachhani polaaluu ..
namO venkaTESaa ... namO tirumalESaa .. ani saayantram 5 ganTalaku guDilO paaTaa ..
ivannee gOdaarOlla jeevitamlO viDadeeyalEni oka bhaagam !
andarilee gOdaarOlla darupuna
nuutana samvatsara
mariyu anniTikannaa gOdaarOlla pedda panDuga
sankraanti Subhaakaankshalu !**
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 12:57:36 PM IST ఓలియొ ఓలియొ హొరెత్తాలే గోదారి
ఎల్లువై తుల్లాబిలా గట్టుజారి
ఓలియొ ఓలియొ ఊరేగాలే సింగారి
ఇంతకి యాడుందే అత్తింటి దారి..
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హొయ్‍నా యేం చాందినిరా హొయ్‍నా యేం చమక్కిదిరా
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నావెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా కులికెనురా కన్నెధారా...
ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా..
హొయ్‍నా యేం చాందినిరా హొయ్‍నా యేం చమక్కిదిరా
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నా వెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేం కులికెనురా కన్నెతారా...
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హో....వగలమారి నావ హొయలు మీరినావా
అలల ఊయలూగినావా...
తళుకు చూపినావా తలపు రేపినావా
కలలవెంట లాగినావా...
సరదా మది నీవే అడుగే ఏమారి
సుడిలో పడదోసి అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి
పడవ పోదాం పద ఆగకే మరి..
హొయ్‍నా యేం చాందినిరో హొయ్‍నా యేం చమక్కిదిరో
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నావెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేంకులికెనురా కన్నతారా...
నీటిలోని నీడ చేతికందుతుందా
తాకి చూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడి కాదా
తరిమిచూడు దొరుకుతుందా...
చక్కని దానా చుక్కాని కానా
నీ చిక్కులన్నీ దాటగా
వద్దు అనుకున్నా వదలదు నెఱజాన
నేనే నీ జంట అని రాసి ఉందిగా...
హొయ్‍నా యేం చాందినిరో హొయ్‍నా యేం చమక్కిదిరో
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నా వెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేంకులికెనురా కన్నెతారా...
చిత్రం ; ఆట
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 12:35:47 PM IST తెలవారదేమో స్వామీ
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. (2)
తెలవారదేమో స్వామీ
చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ..
తెలవారదేమో స్వామీ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తు నే మది మరి మరి తలచగా..
మరి మరి తలచిగ..
అలసిన దేవేరి .. అలమేలు మంగకూ..
తెలవారదేమో స్వామీ..
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 12:33:25 PM IST హూ ముక్కుమీద కోపం నీ ముకానికే అందం నా
బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం
అలకతీరి కలిసేదే అందమైన బంధం
సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం
ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం
తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం
చిత్రం : మూగమనసులు
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 12:31:03 PM IST ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ
పసివాని చూచుట కీ తొందరా?
మైమరచి ముద్దాడి లాలింతురా?
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా?
అపురూపమైన ఆ తల్లిదా?
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా..
ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కాపురం చేయండి కలకాలము
చిత్రం : మంచి మనసులు
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 12:28:49 PM IST పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారో అనుకున్నది
జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడె చేసుకుంటాడని
విన్నదీ ఒళ్లంతా ఝల్లన్నదీ
నవ మన్మధుని వంటి నాధుని కనులారా
ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది
తుమ్మెదా వుబలాటపడ్డది
పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది
కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది
ఓయమ్మా బుగ్గలకుపాకింది
నీ గుండెలోన నేనుండిపోవాలి
నీ అండనే నేను పండిపోవాలి
నా నోముపంట పండాలి
రాముడే రాముడు .. జానకే జానకని
ముందు వెనకందరూ .. మురిసిపోవాలని
జానకి మొక్కుతూ మొక్కుకుంది...
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 12:27:28 PM IST ఓ రంగయో పూలరంగయో
ఓరచూపు చాలించి సాగిపోవయో - 2
పొద్దు వాలి పోతున్నదోయి
ఇంత మొద్దు నడక నీకెందుకోయి
II ఓ రంగయో II
పగలనక రేయనక పడుతున్న శ్రమనంత
పరులకొరకు ధారపోయు మూగజీవులు -2
ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు
II ఓ రంగయో II
కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో - 2
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే
II ఓ రంగయో II
Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 12:25:03 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|