
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| చిరుగాలీ చిరుగాలీ
చెలియ జాడ చూపాలి
నాకు నీవు తోడు కావాలీ….
చిరుగాలీ చిరుగాలీ
చెలియ జాడ చూపాలి
నాకు నీవు తోడు కావాలీ….
ఒకసారి దరిచేరి
ఊసు తెలుపరావా
కడదాకా చెలితోనే
చేయికలపవా నాతోడై
చిరుగాలీ చిరుగాలీ
చెలియ జాడ చూపాలి
నాకు నీవు తోడు కావాలీ….
కంటిపాప జంట చూపు చుక్క నీవు కావా
ఎండమావి వెంటపడ్డ బాటసారి కానా
గూడులేని గువ్వ పిట్ట నీడలేని దోవ
గోరువంక సాగరాన ఈదుతున్న నావ
చెప్పలేను ఈ బాదా ఎక్కడుందో నారాధ
వేణువుండి నా చేత వేదనాయె నారాత
ఎంత తీపి ప్రేమ రాలుపూలవోలె
అంతులేని శోకం మనసా..
చిరుగాలీ చిరుగాలీ
చెలియ జాడ చూపాలి
నాకు నీవు తోడు కావాలీ….
ఒకసారి దరిచేరి
ఊసు తెలుపరావా
కడదాకా చెలితోనే
చేయికలపవా నాతోడై
చిరుగాలీ చిరుగాలీ
చెలియ జాడ చూపాలి
నాకు నీవు తోడు కావాలీ….
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:27:15 PM IST ఏమండోయ్ ammay gOrO !
ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట
ఏ ఊరూ వెళతారూ ఏదీకానీ వేళ
ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట
ఏ ఊరూ వెళతారూ ఏదీకానీ వేళ
ఏమండోయ్ ఓయ్
పసివానిచూచుటకీ తొందర
మైమరచి ముద్దాడి లాలింతురా
ళొళోలాయీ ళొళోలాయీ
ఊహు ఊహు ఊహు ఊహు
పసివానిచూచుటకీ తొందర
మైమరచి ముద్దాడి లాలింతురా
శ్రీమతికి బహుమతిగా ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గర
ఏమండోయ్
ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట
ఏ ఊరూ వెళతారూ ఏదీకానీ వేళ
ఏమండోయ్ ఓయ్
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
ఒహ్ హోహో ఒహ్
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ది రానీకు భగవంతుడా
ఏమండోయ్
ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట
ఏ ఊరూ వెళతారూ ఏదీకానీ వేళ
ఏమండోయ్ ఓయ్
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైనలేదే
అయ్యో పాపం
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైనలేదే
కపటాలు మానేసి నామదిలోనా
కపటాలు మానేసి నామదిలోనా
కాపురము చేయండి కలకాలమూ
ఏమండోయ్
ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట
ఏ ఊరూ వెళతారూ ఏదీకానీ వేళ
ఏమండోయ్ ఓయ్ ఓ హోయ్
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:25:40 PM IST ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
నాదికాని నా మనస్సే బదులు కోరావు
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
నాదికాని నా మనస్సే బదులు కోరావు
అలా అలా నా దారిలో హటాత్తుగా చేరి
తుఫానులే నువు రేపినావు తెలియకుండానే
ఓ ప్రేమా ఓ ఓ ఓ.. ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ఓ ఓ.. ఓ ప్రేమా
అలా అలా నా దారిలో హటాత్తుగా చేరి
తుఫానులే నువు రేపినావు తెలియకుండానే
ఆశ పడుతూ ఆశ పడుతూ అలసి పోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయి
నువే నువే కావాలని అడిగినదే ప్రాణం
తనూ నువూ ఒకటే అనేది తెలియదే పాపం
నా ప్రేమా….నా ప్రేమా
నా ప్రేమా….నా ప్రేమా
నువే నువే కావాలని అడిగినదే ప్రాణం
తనూ నువూ ఒకటే అనేది తెలియదే పాపం
ఆశ పడుతూ ఆశ పడుతూ అలసి పోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయి
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:24:42 PM IST తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఇసుక తిన్నెలెదురైనా ఏ గిరులు తిరిగి పొమ్మన్నా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
ఆగిపోదు నీ నడక ఆ..
ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
గుండె ముక్కలైపోయి సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా ఆ…
కల్లోలం విషమించినా కాలమే వంచించినా
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా ఆ…
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఎదలోని రాపిడిలోన కదలాడు నురగలపైన
కలకలనవ్వులున్నాయో ఓ….
కలకలనవ్వులున్నాయో కన్నీళ్ళు పొంగుతున్నాయో
తెలిసేదెవరికి.. ఆ దైవానికి
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలితో నీ పయనం
తరంగిణీ ఓ ఓ… ఓ తరంగిణి
ఓ తరంగిణి ఓ తరంగిణి
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:23:58 PM IST నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
ఎందుకంటా?
యుగయుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడూ లేదంటా
అలాగా..
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
ఎందుకంటా?
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదంట
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నదికీ కడలికి పొంగంట
ప్రతి రేయి మనకొక తొలిరేయంట
ఆ…..
తొలిముద్దు పెదవులు విడిపోవంట
ఆ….
జగతికంతటికీ మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట
ఆ.. నా కంట నిను చూసుకుంటా
ఆ.. నీ చూపు నా రేపు పంట
ఆ…ఆ…
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
మన కోర్క్ లన్నీ పసిపాపలంట
ఆ..ఆ…
చిగురాకు మనసుల చిరునవ్వులంట
ఆ..ఆ…
వయసు లేనిది మన వలపేనంట
మనజీవితము ఆటాపాటెనంట
ఆ..నాలోన నిను దాచుకుంటా
ఆ..నీ ఊపిరై కాచుగుంట
ఆ..ఆ…
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:23:12 PM IST ఎంతవరకూ .. ఎందుకొరకూ .. వింతపరుగూ .. అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే .. బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే .. గుర్తుపట్టే గుండెనడుగూ
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా !
తెలిస్తే ప్రతీ చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా !!
ఎంతవరకూ .. ఎందుకొరకూ .. వింతపరుగూ .. అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే .. బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే .. గుర్తుపట్టే గుండెనడుగూ
కనపడేవెన్నెన్ని కెరటాలూ .. కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరూ
మనకిలా ఎదురైన ప్రతివారూ .. మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా .. నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో .. విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలీ .. వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్నూ మిన్నూ నీరూ అన్నీ కలిపితే నువ్వే కదా కాదా !
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా !
తెలిస్తే ప్రతీ చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా !!
మనసులో నీవైన భావాలే .. బయటకనిపిస్తాయి దృశ్యాలై
నీడలూ నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే .. స్నేహితులు నీకున్న ఇష్ఠాలే
ఋతువులూ నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం .. నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం .. నీ మకిలి మదికి భాష్యం
పుటకా చావూ .. రెండే రెండూ .. నీకవి సొంతం కావూ .. పోనీ !
జీవితకాలం .. నీదే నేస్తం .. రంగులు ఏంవేస్తావో .. కానీ !
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:20:42 PM IST నీ నవ్వు చెప్పింది నాతో .. నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో .. ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ లా ల లా ల .. ఓ లా ల లా లా ల ..
నీ నవ్వు చెప్పింది నాతో .. నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో .. ఇన్నాళ్ళ లోటేమిటో
నాకై చాచిన నీ చేతిలో .. చదివాను నా నిన్ననీ
హో .. నాకై చాచిన నీ చేతిలో .. చదివాను నా నిన్ననీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపునీ
పంచేందుకే ఒకరు లేని .. బ్రతుకెంత బరువో అనీ
ఏ తోడుకీ నోచుకోని .. నడకెంత అలుపో అనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ .. నడిరేయి కరిగించనీ
నా పెదవిలో ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితానా తొలిముగ్గు పెడుతుందనీ
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
హా .. ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువూ మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం .. సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం .. పొందేటి బంధాలకు
హా .. లా ల లా ల .. ఓ లా ల లా లా ల ..
నీ నవ్వు చెప్పింది నాతో .. నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో .. ఇన్నాళ్ళ లోటేమిటో
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:18:44 PM IST ఎదుటా నీవే యెదలోన నీవే
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావేప్రేమకింత బలముందా
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
గాయాన్నైనా మాన నీవు
హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు
ఎదుటా నీవే యెదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైనా కావే
ఎదుటా నీవే యెదలోన నీవే
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నం అయ్యేదుందా
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:17:04 PM IST రామా కనవెమిరా
రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామాకనవేమిరా
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసధులందరూపదే పదే చూడగా శ్రీ రామచంద్ర మూర్తి
కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
ముసిముసి నగవుల రసిక శిఖామనులు
ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు సగారిదా మని దా మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామనులు థా థకిట థక జణుథ
ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు
థకజణు థకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ దా మ ప మ స రీ గా
మా సారి ఎవరను మత్త గుణోల్వణులు ఆహా
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మనసు కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా
ముందుకేగి విల్లన్దబొయి ముచ్చెమటలు పట్టిన దొరలుభూవరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నర పున్గవులు
తమ ఒళ్ళు వొరిగి రెన్డు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాఘ్రనులు
ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహా ఎత్తే వారు లేరా ఆ విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
అహా ఎత్తే వారు లేరా ఆ విల్లు ఎక్కు పెట్టె వారు లేరా
తాకిట తైయ్యకు తా దిమి తా..
అంతలోరామయ్య లేచినాడు ఆవింటిమీదచెయ్యివేసినాడు
సీతవంకఓరకంటచూసినాడుఒక్కచిటికెలోవిల్లుఎక్కుపెట్టినా డు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
పెళపెళవిరిగెను శివధనువు
కళలోలికెను సీతానవవధువు
జయ జయ రామా జానకి రామా
జయజయరామాజానకిరామా
సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే
తయ్యకుతాధిమిథ
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:15:12 PM IST పట్టుసీర తెస్తననీ ఈ…….
పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
గట్టు సేరేదాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా
పట్టపగలల్లే ఓ సందమామా…
తన్ననానె నానా తానానెనానా
తన్ననానా…
తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా
తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా
ఆలినయ్యేదాకా వెల్లిపోమాకా ఎన్నెలమ్మతోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ ఓయ్ తోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ ఆ అబ్బా.
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:14:15 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|