
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| యే దేశ మేగినా,
యెందుగాలిడిన
యే పీఠ మెక్కినా, యెవ్వరెదురైన
పొగడరా, నీ తల్లి భూమి భారతిని
నిలుపరా, నీ జాతి నిండు గర్వమ్ము
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరు లింకెందు-
యే పూర్వపుణ్యమో, యే
యోగబలమొ,
జనీంచినాడ వీస్వర్గలోకమున
యే మంచిపూవులన్
బ్రేమించినావొ
నిను మోచె, నీ తల్లి
కనకగర్భమున
సూర్యుని వెలుతురు
సోకునందాక
ఓడలజెండాలు ఆడునందాక
నరుడు ప్రాణాలతో నడచునందాక
అందాక గల ఈ యనంతభూతలిని
మనభూమి వంటి కమ్మని
భూమిలేదు-
తమ తపస్సులు ౠషుల్
ధారబోయంగ
చండవీర్యము
శూరచంద్రులర్పింప,
రాగదుగ్ధము భక్తరాజు లీయంగ
భావసూత్రము కవిభంధవు లల్ల,
దిక్కుల కెగదన్ను తేజంబు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ,
రాలు పూవులు సేయు రాగాలు
సాగ సౌందర్య మెగబోయు సాహిత్య
మొప్ప-
వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర;
అవమాన మేలరా, అనుమాన మేల
భరతపుత్రుడ నంచు భక్తితో బలుక-
—రాయప్రోలు సుబ్బారావు
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:12:55 PM IST వెండి గిన్నెలొన పాలబువ్వ కలిపి తినిపించా నాన్నా…
లాలి లాలి అంటూ జోలలెన్నొ పాడి వినిపించా కన్నా….
ఇలా నీకొసమే తపించే తల్లిని, ప్రపంచం అన్నది నువ్వే నా కళ్ళకి…
ఈ మమతకి ఎల్లలే లేవురా.. నా దీవెనే నీకు నా కానుక….
||వెండి గిన్నె||
వేసంగి ఎండలో రగిలేటి ఘాళ్పులో జ్వరంటు పడుకుంటే నా చిట్టి తండ్రికి…
ఏ మందు మాకులూ కొనలేనురా అని నిలువెల్లా కుమిలాను ఏందుకు కన్నానని..
ముద్దుగా నినుపెంచే యోగం లెదురా నా కన్నా…
ఇదేనా తెలరాతంటూ కలబడనా విధి నాకెదురైతే….
నువ్వైనా నమ్మరా అమ్మంటే ప్రేమరా…
||వెండి గిన్నె||
ఏ మనిషి జీవితం పూబాట కాదురా.. ముళ్ళంటూ దాటనిదే ఏ గమ్యం రాదురా..
బంధువులు ఎన్నడూ నేస్తాలు కారురా… అమ్మైనా నాన్నైనా నీ మనసే తోడురా…
కలలో జీవిస్తూ అదేలే సుఖమని అనుకోకు.. తెగించి వెతికిననాడే చేరువకావా కోరిన తీరాలు..
కన్నామీ అమ్మకి ఇదే తుది ఆశరా….
||వెండి గిన్నె||
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:11:35 PM IST నెమలికి నేర్పిన నడకలివీ…
మురళికి అందని పలుకులివీ…
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా…. (నెమలికి)
కలహంసలకిచ్చిన పదగతులూ..
ఎలకోయిల మెచ్చిన స్వరజతులూ… (కలహంసల)
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ…
ఏవేవో కన్నుల కిన్నెరలూ… (ఎన్నెన్నో)
కలిసిమెలిసి కళలువిరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా మల్ప శిల్ప మణిమేఖలనూ శకుంతలనూ… (ఓ ఓ నెమలికి)
చిరునవ్వులు అభినవ మల్లికలూ…
సిరిమువ్వలు అభినయ దీపికలూ… (చిరునవ్వులు)
నీలాల కన్నుల్లో తారకలూ…
తారాడే చూపుల్లో చంద్రికలూ… (నీలాల)
కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనా లెఖ్య సరస సౌందర్యరేఖనూ శశిరేఖనూ…
ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ…
మురళికి అందని పలుకులివీ…
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా…. (నెమలికి)
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:10:36 PM IST నా జన్మ భూమీ…భూమీ…భూమీ…
నా జన్మ భూమి…భూమి…భూమి…
నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా యిల్లు అందులోన కమ్మనీ ప్రదెశము
నా సామిరంగా హొయ్ హొయ్ నా సామిరంగా
నా జన్మ…
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
ఫచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం
హొయ్ హొయ్ నా సామిరంగా హొయ్ హొయ్ నా సామిరంగా
నా జన్మ
బతకాలందరు దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయి మనుషులే
బతకాలందరు దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయి మనుషులే
శ్వార్ధము వంచనా లేనిదే పుణ్యం
త్యాగము రాగము ఇస్టము ధన్యమూ
నా జన్మ…
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:09:59 PM IST నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా
స్వప్నమ నువ్వు సత్యమ తెలిచి చెప్పవె ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవె హౄదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువ్వే సహవాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశెవు కద
తడపడ నీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే పంచుమా
||నే తొలిసారిగా ||ప్రేమా నీతో పరిచయమే ఎదో పాపమా
అమ్రుతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చెరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరు నవ్వుల దగ
కనపడ నీయవు నిప్పుల సెగ
||నే తొలిసారిగా ||
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటెఏమిటో ఎనాటికి ఆపవు కదా
నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చలగాటమా
చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా
||నే తొలిసారిగా ||
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:07:29 PM IST ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా !
ఎదుట నిలిచింది చూడు..
నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ
అవునో..కాదో..అడగకంది నా మౌనం
చెలివో..శిలవో..తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా !
ఎదుట నిలిచింది చూడు..
నిన్నే చేరుకోలేక..ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా..విసుక్కుంది నా కేకా
నీదో..కాదో..రాసున్న చిరునామా
ఉందో..లేదో..ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో..సొంతమైందిలా !
ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా !
ఎదుట నిలిచింది చూడు..
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:06:10 PM IST ఉరకలై గొదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణానికి సిరి మువ్వ రవళి
రసమయం జగతి
నీ ప్రణయ భావం నా జీవ రాగం
రాగలు తెలిపే భావాలు నిజమైనవి
లొకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగంలా స్వర లోకమె మనదైనది
ఉరకలై గొదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణానికి సిరి మువ్వ రవళి
రసమయం జగతి
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైనా బ్రతుకే ఏనాడొ నీదైనది
నీవన్న మనిషే ఈనాడు నాదైనది
ఒక గుండె అభిలాష పదిమందికి బ్రతుకైనది
ఉరకలై గొదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణానికి సిరి మువ్వ రవళి
రసమయం జగతి
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:05:21 PM IST చెలిమిలొ వలపు రాగం వలపులో మధుర భావం
రాగం భావం కలిపే ప్రణయ గీతం
పాడుకో పాడుకో పాడుకో
ఉయ్యాలలూగినావు ఈ ఊహలో
నెయ్యాలు నేర్చినావు ఈ చూపులో
ఆరాధనై గుండెలో ఆలాపనై గొంతులో
అలలలాగ కలలలాగ కదలిరాగా
చెలిమిలొ వలపు రాగం వలపులో మధుర భావం
నును వెచ్చనైన తాపం నీ స్నేహము
యద గుచ్చుకున్న భావం నీ రూపము
తుదిలేని ఆనందము తొణుకాడు సౌందర్యము
శ్రుతిని చేసీ స్వరము కూర్చీ…..
శ్రుతిని చేసీ స్వరము కూర్చీ పదము కాగా
చెలిమిలొ వలపు రాగం వలపులో మధుర భావం
రాగం భావం కలిపే ప్రణయ గీతం
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:04:33 PM IST నా చెలి రోజావే నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే యెదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కధలు జ్ఞాపకం
మనసులేకపోతె మనిషి ఎందుకంట
నీవులేకపోతె బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు
నా చెలి
చెలియ చెంత లేదులె చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనె చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు
నా చెలి
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:03:15 PM IST ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
నిదురించు వేళ హృదయాంచలాన
అలగా పొంగెను నీ భంగిమ
అది రూపొందిన స్వర మధురిమ
ఆ రాచ నడక రాయంచ కెరుక
ఆ రాచ నడక రాయంచ కెరుక
ప్రతి అడుగూ శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన
నీ రాకతోనే ఈ లోయ లోనే
అణువులు మెరిసెను మణి రాసులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకౄతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:02:35 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|