
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| నిన్న వాలంటైన్స్ డే నాడు రంజిత్ నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాడమ్మా అంటూ వయ్యారాలు పోతూ తల్లికి చెప్పింది రమ్య.
రంజిత్ చాలా మంచివాడమ్మా నువ్వు అతని ప్రేమను ఒప్పుకుని పెళ్లి చేసుకో అంటూ రమ్యకు సలహా ఇచ్చింది తల్లి.
కానీ రంజిత్ బొత్తిగా నాస్తికుడమ్మా... స్వర్గం, నరకం ఏదీ లేదని వాదిస్తుంటాడు. అలాంటివాడిని ఎలా పెళ్లి చేసుకోను అంటూ తల్లిని ప్రశ్నించింది రమ్య.
నిన్ను పెళ్లి చేసుకున్నాక స్వర్గం, నరకం ఉన్నాయని మెల్లగా అతనికే తెలుస్తుందిలేమ్మా అంటూ రమ్యకు చెప్పింది తల్లి.
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:08:33 PM IST ప్రేమలో పడ్డ యువకుడు తన ప్రేయసికి ఇలా లెటర్ రాశాడు.
ప్రియా నాకు నువ్వంటే చాలా ఇష్టం. అయితే నేను రాజేష్‌లా నిన్ను కారులో తిప్పలేక పోవచ్చు. వాడిలా నీకోసం వేలకు వేలు ఖర్చు పెట్టలేకపోవచ్చు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నాకంటే కూడా నీవే నాకు చాలా ఇష్టం.
ఆ లెటర్ చదివిన ఆ అమ్మాయి ఇలా సమాధానం రాసింది.
నాకూ నువ్వంటే చాలా ఇష్టం. అయితే ఆ రాజేష్ అడ్రస్ కాస్త చెప్పవా... ప్లీజ్...
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:08:08 PM IST ఓ ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు
తాగినపుడు నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా డార్లింగ్ అంటూ తన ప్రేయసితో అన్నాడు ప్రేమికుడు.
కానీ నేను తాగను కదా అంటూ ఆశ్చర్యంతో తన ప్రియున్ని ప్రశ్నించింది ప్రేయసి.
నువ్వు తాగినపుడు కాదు డియర్ నేను తాగినపుడు నాకు నువ్వు అందంగా కన్పిస్తావు అంటూ అసలు విషయం చెప్పాడా ప్రియుడు.
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 1:45:51 PM IST baaTasaari gOrO! tEnksanDE !
iTochhinanduku. aa sEtammagOrekkaDunnaarO suusi,ikkaDikilaakkochhi
aa telangaanaa daaraaniki pEnampoyyamani seppanDE !
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 1:42:49 PM IST EnTanDE ennelagOrO ! meekEmee telnaTTu aTTaa anTaarETanDE ?
ammay gOrinTaarani kayitalEsaananDE ! aay !
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 1:40:57 PM IST ivi kavitalaa ...? paaTalaa .....?
Posted by: Mrs. Vennela...:) At: 6, Sep 2008 9:20:01 AM IST http://in.youtube.com/watch?v=EWYwZAzLvAs&feature=related
anukunTAm gAnI, telangANA yAsalO kAmeDI enta kAmeDIgA unTundI! O sAridi chUddurU
Posted by: Bahud♥♥rapu Baatasaari At: 5, Sep 2008 10:44:24 PM IST నువ్వురాక ఎవ్వరున్నా
ఒంటరవుతాను ఎందుకో
నిన్నుచూస్తే నన్నునేనే
మరచిపోతాను ఎందుకో
కనులముందుకు నేరుగా
నేరాను అంటావు ఎందుకో
కలతనిదురలొ కలలాగా
వెనువెంటవస్తావు ఎందుకో
ఎందుకో ఓ ఓ..
నిదురనే మరచి నా కన్నులే
అలసినా వేచెనెందుకో
తలపులో నిలచి నీ రూపం
గుండెనే తట్టెనెందుకో
ఈలోకం వెలివేసినా
నీకోసం ఎదిరించనా
ఈలోకం వెలివేసినా
నీకోసం ఎదిరించనా
చెలియా చెలియా నువ్వుగా వలచి నన్నిలా వదిలావెందుకో ఎందుకో....
చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో
ఈ దూరం బాధించినా
ఎడబాటే కలిగించినా
ఏగాయం నువుచేసినా
పూవల్లే నినుచూడనా
మనసా మనసా మాటలే మరచి మౌనమే నేర్చినావెందుకో ఎందుకో....
Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:26:49 PM IST ఏకాకిగా మారిన మనసు
ఎన్నాళ్ళని చేయను తపస్సు
నీకై ఎదురు చూస్తోందని
నీకూ...తెలుసు
ఐనా తగునా నీకింత అలుసు?
ఆవిరైపోదా సొగసు?
మనకై ఆగుతుందా ఈ వయసు?
Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:24:13 PM IST నీతో గడిపిన ఆ మధుర క్షణాలు
నను నేనే మరచిన ఎన్నో వైనాలు
మదిని మురిపించిన ఆ తీయని మాటలు
ఎదను మీటిన మరెన్నో భావనలు
నీ తలపులతోనే గడిపిన ఎన్నో రాత్రులు
ఒట్టి ఊహలుగానే ఉండిపొమ్మంటూ
కలవర పెట్టిన ఆ కఠినమైన నిజాలు
మౌనంగా పారాయి నా కంట కన్నీరు
సాక్ష్యం గా నిలిచాయి నా నయనాలు
నిదురకు దూరం చేశాయి నీ జ్ఞాపకాలు!
Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:18:41 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|