Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 59 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
గుప్పెడంత గుండెలో గూడుకట్టుకున్న ఆశలెన్నిటినో గుప్పిట్లోనే బిగియించి మది నిండిన నీ ఆలోచనలను గది లోపలే బందించి మరపుకైనా రాని జ్ఞాపకాల్ని మౌనంగానే భరిస్తూ ఎదలోపలి భావాలను వ్యధగానే మిగిలిపొమ్మంటూ విధి చేసిన శాసనానికి తలవొగ్గి గుండె గాయమైనా బ్రతుకు భారమైనా పెదాలపై మాత్రం చిరునవ్వు చెదరనివ్వక ప్రతి క్షణం నీ తలపులతోనే చివరి క్షణం కోసం ఎదురు చూస్తూవున్నా!

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:18:08 PM IST
వసంతాలు దాటేస్తోంది వయసు వెంట రమ్మంటె రానన్నది మనసు కాలంతో పాటు పరుగెడుతోంది వయసు ఆ కాలంతో నిమిత్తం లేదంది మనసు బ్రతుకు తీరాలు దాటేస్తోంది వయసు బతిమాలినా వెంటరానన్నది మనసు దేహాన్ని కరిగించేస్తోంది వయసు ఇంకా దాహం తీరలేదంటోంది మనసు బంధాలు తనని ఆపలేవంది వయసు అనుబంధంతోనే ముడిపడిపోయింది మనసు మృత్యువు వైపు నడిపిస్తోంది వయసు గమ్యం చేరలేక విలపిస్తోంది మనసు రేయనక పగలనక పరుగెడుతోంది వయసు రేయింబవళ్ళు నీకై ఎదురు చూస్తోంది మనసు క్షణమాగక పయనిస్తోంది వయసు నీ ఎద వాకిటనే నిలిచిపోయింది నా మనసు పరుగాపని వయసు దరిచేరని మనసు!

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:17:09 PM IST
నీవు లేని ఏకాంతంలో నిదురే రాని నిశి రాతిరిలో కదలిక మరచిన కాలంతో బదులు పలకని శూన్యంతో అలుపెరగని తలపులతో అల్లరి చేసే ఊహలతో చేస్తోంది మనసు సమరం చేరలేక నీ హృదయ ద్వారం పంపాను మేఘాలతో సందేశం మన్నించి దరిచేరవా నేస్తం!

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:12:51 PM IST
ఉషస్సుతో వచ్చావు మనస్సులో నిలిచావు ఆశలెన్నో రేపావు నా ప్రతీ శ్వాశలోనూ చేరావు ఊసులెన్నో చెప్పావు నా ఊహలకు ఊపిరిని పోసావు బాసలెన్నో చేశావు బంధమేదో కలిపావు బాధలన్నీ మరచి నీ ఎదపై తలవాల్చి సేదదీరమన్నావు భారం తీర్చుకునే వేళకి మాత్రం దూరంగా వెళ్ళిపోయావు తిరిగి మదిలో తిమిరం నింపావు

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:12:21 PM IST
ఎదురవుతావన్న ఆశ లేదు ఎదురీతకి దారి లేదు ఎదురించే శక్తీ లేదు ఎద భారం చేసిన ప్రేమ మాత్రం మిగిలే వుంది ఎదురుచూపులోనే యుగాలు గడిపేస్తోంది ఏ తోడూ అందిరాక ఎడబాటుకే బంధువై ఏ నీడా కానరాక ఎండమావికి చేరువై గుండెకోత మిత్రునితో కన్నీటి స్నేహం చేస్తూ కాలంతో కలిసి పయనిస్తోంది

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:11:44 PM IST
నేను! ఎంతో...మారాను! నా జాడే నాకు తెలియనంతగా నా నీడ సైతం నువ్వైనంతగా నా గుండె చప్పుడే నీ పేరైనంతగా నా కంటిపాపే నీ రూపైనంతగా నా ఊహ సైతం నిను వీడనంతగా నా ఊపిరి సైతం నువ్వైనంతగా అణువణువు నువు నిండినంతగా అసలు నేనే నువ్వైనంతగా ! నువ్వు! నువ్వూ...మారావు! నా ఊహకి సైతం అందనంతగా నా ఉనికిని సైతం మరిచినంతగా నా ఊసే నీ ఎదలో లేనంతగా నా ఆశలన్నీ కూల్చేంతగా నా పిలుపు సైతం వినలేనంతగా నా ప్రేమను సైతం కనలేనంతగా అసలేమీ జరగనట్టుగా నేనంటూ అసలు లేనే లేనట్టుగా! నాలో ఈ మార్పుకి కారణం నా మది నీపై పెంచుకున్న అంతులేని మమకారం! మరి నీలో మార్పుకి కారణం......?? అది బదులు దొరకని ఒక ప్రశ్నకి ప్రాకారం!

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:10:44 PM IST
ఊసులాడే ఒక జాబిలట సిరి మువ్వులగ నను తాకేనటా ఊసులాడే ఒక జాబిలట సిరి మువ్వులగ నను తాకేనటా చూపులతో బాన మేసేనట చేలి నా యేదలో సేగ రేపేనట మాటె వేదం తానే నా లోఖం ప్రేమే యోఘం ఊసులాడే ఒక జాబిలట సిరి మువ్వులగ నను తాకేనటా అందాలే చిందే చేలి రూపం నా కోసం ఆనంధం నిలిపేటి ధ్యనం చేలి ధ్యనం అదే పేరు నేను జేపించేను రోజు నన్నే చూసే వేల అల్లై పొంగు తాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను ఊసులాడే ఒక జాబిలట సిరి మువ్వులగ నను తాకేనటా నాలోను రేగే నీ పాటచేలి పాట నీడల్లే సాగే నీ వేంట తన వేంట స్వరలై పోంగేన వరాల్లే కోరేన ఇలా ఊహల్లోన సద ఉండి పోన ఒకటై లాడు ఒకటై పాడు పండగ నాకు యే నాడు ఊసులాడే ఒక జాబిలట సిరి మువ్వులగ నను తాకేనటా ఊసులాడే ఒక జాబిలట సిరి మువ్వులగ నను తాకేనటా చూపులతో బాన మేసేనట చేలి నా యేదలో సేగ రేపేనట మాటె వేదం తానే నా లోఖం ప్రేమే యోఘం

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 12:08:23 PM IST
ammay gOrO ! "aay !" ammay gOrO ! "aay ! aay ! " aay baabOy ammay gOrO ! aay ! aay ! anEttunnaarETanDE ? kompadeesi gOdaarOlla baasochEsindETanDi meeku ? mari mee inTikaaDa... annaTTu ammaygOrO mee inTikaaDa mee vOllantaa evalO abbay gOrini reDee gaa suusEsi, mee kOsam meerinkaa raalEdani eduru tennalu suuttaa vunTaaranDi ee paaTiki. inTikellipOdaamETanDE ammay gOrO ?! "aay ! inTiki tarvaata eltaanu gaanii, mundu nuvvu raamaayanam seppu " aay ! aTTaagEnanDE ammay gOrO ! raamaayanam seppapoTE ee bEram kuuDaa poTE, maa inTidi sandaala nannu pEkaaDEsi raamaayanammottam suupinchEddanDE baabO ! ammay gOrO mundu meeru bEkupaaTTuki ee masaalaa vODa laaginchAnDE ! aay ! "aay ! tEnks !"

Posted by: Mr. Siri Siri At: 5, Sep 2008 8:57:59 AM IST
అంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను.. చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెను అంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను పెదవులే కవ్వించెను … పదునౌ చూపులు బాధించెను హోయ్ అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ .. వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ నవ్వులే పండించనీ .. పువ్వుల సంకెల బిగించనీ .. హోయ్ అంతగా నను చూడకు .. ష్ .. మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు

Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 10:05:02 AM IST
ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది దహించు ఏకాంతమే సహించలేనన్నది యుగాల ఈ దూరమే భరించలేనన్నది విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది ఒకే ఒక క్షణం చాలుగా ప్రతి కల నిజం చేయగా యుగాలు కలకాలమా ఇలాగే నూఆగుమా దయుంచి ఆ దూరమా ఇవాళ ఇటు రాకుమా ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా

Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 10:04:22 AM IST
< < Previous   Page: 59 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.