
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే అది ఏ రాగం ఆ అనురాగం
ఈ చీకటి కన్నుల వాకిలిలో వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
ఆ వెలుగుల మంగళ వేదికపై నా వేణులోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకు ఎదురు చూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు చుట్టూ ఉన్నది పెనుచీకటి
వేయి దీపాలు నాలోన వెలిగితే ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం ఆ అనురాగం
సుడి పడి పోయే జీవితనౌక కడలి తీరం చేరేదెపుడో
కలలా తోచే ఆశా రేఖ నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో రేపటి ఉదయం మెరిసింది
వేగిపోయే నా గుండెలో గతమే స్మృతిగా మిగిలింది
వేయి దీపాలు నాలోన వెలిగితే ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం ఆ అనురాగం
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 10:02:17 AM IST ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటె నిజమేగా స్వప్నం
నువ్వుంటె ప్రతి మాట సత్యం
నువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతం
నువ్వుంటె ప్రతి అడుగు అందం
నువ్వుంటె ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటె ఇక జీవితమంతా ఏదో సంతోషం
పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణం
అడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనం
దారిచూపద శూన్యం అరచేత వాలద స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కద వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లొ కలకాలం
నువ్వుంటె ప్రతి ఆశ సొంతం
నువ్వుంటె చిరుగాలె గంధం
నువ్వుంటె ఎండైన కాద చల్లని సాయంత్రం
నువ్వుంటె ప్రతి మాట వేదం
నువ్వుంటె ప్రతి పలుకు రాగం
నువ్వుంటె చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం
ఉన్నచోట ఉన్నాన ఆకశమందుకున్నాన
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేన
మునిగి తేలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లె నన్నల్లె ఈ రంగులు నీ వల్లె
సిరిమల్లెల వాగల్లె ఈ వెన్నెల నీవల్లె
ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోన
నువ్వుంటె దిగులంటూ రాదె
నువ్వుంటె వెలుగంటూ పోదె
నువ్వుంటె మరి మాటలు కూడ పాటైపోతాయె
నువ్వుంటె ఎదురంటూ లేదె
నువ్వుంటె అలుపంటూ రాదె
నువ్వుంటె ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలె
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:58:10 AM IST ఈవీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
మనసులో రాగాలు స్వరములై పలికాయి
కనులలో రాగాలు కళలుగా వెలిసాయి
మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిసాయి
కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
ఆ….. కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
సన్న సన్నగ వలపు సంగతులు వేసాయి
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
మోహనా ఆలాపించ మోహమే ఆపినది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
మోహనా ఆలాపించ మోహమే ఆపింది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
శృతి కలిపి జత కలిసి సొక్కులెరిగిన వాడు తోడైన నాడే నే తోడు పాడేది
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది
ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది
ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
వేచి ఉన్నది వీణ కాచుకున్నది కాన …
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:55:50 AM IST ఈ కోవెల నీకై వెలిసింది… ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా … నా దేవి తరలిరా ….
ఈ కోవెల నీకై వెలిసింది… ఈ వాకిలి నీకై తెరిచింది
రా స్వామీ తరలి రా … నా స్వామి తరలిరా
దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను
తిరునాళ్ళేపుడో రాక తప్పదని తేరును సిద్ధం చేసాను
దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను
రేపటి కోసం చీకటి మూసిన తూరుపులాగా ఉన్నాను
తూరుపులాగా ఉన్నాను
ఈ కోవెల నీకై వెలిసింది… ఈ వాకిలి నీకై తెరిచింది
నీరు వచ్చే ఏరు వచ్చే .. ఏరు దాటే ఓడ వచ్చే
నీరు వచ్చే ఏరు వచ్చే .. ఏరు దాటే ఓడ వచ్చే
ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డువేసే
ఆ .. దేవుడేదో అడ్డువేసే
ఈ కోవెల నీకై వెలిసింది… ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలిరా … నా స్వామీ తరలిరా …
రా దేవి తరలిరా … నా స్వామీ తరలిరా
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:54:27 AM IST తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకుని … ఆ కైపులో లోకాలే మరువని
మనసులో మనసునై మసలనీ . మనసులో మనసునై మసలనీ
నీ మనిషినై మమతనై మురిసిపోనీ
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
నీ కురులే చీకటులై కప్పివేయనీ .. ఆ చీకటిలో పగలు రేయి ఓకటైపోనీ
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ .. నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ
తడి ఆరని మదిలో నను మొలకలెత్తనీ
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ … అల్లరి పడుచుదనం కొల్లబోనీ
కొల్లగొన్న మనసే నా ఇల్లనీ … కొల్లగొన్న మనసే నా ఇల్లనీ
చల్లగా కాపురమూ ఉండిపోనీ ..
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:52:10 AM IST అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ
అరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగ
గుండెల్లో కొలువుండగ
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:50:43 AM IST మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని
మరల||
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసుపడే తడబాటుని
మరల||
నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయజూచి
నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయజూచి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధురబాధ
మరల||
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:49:44 AM IST నీ లేత గులాబి ….. పెదవులతో …..
కమ్మని మధువును తాకాలి
లేత గులాబి పెదవులతో కమ్మని మధువును తాకాలి
విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి
లేత గులాబి పెదవులతో కమ్మని మధువును తాకాలి
మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే … సిగ్గులతో
మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే సిగ్గులతో
చంద్రుని ముందర తారవలే … చంద్రుని ముందర తారవలే
నా సందిట నీవే ఉండాలి ….
ఈ మధువంతా నీ కోసం .. పెదవుల మధువు నాకోసం
మధువు పుట్టింది నా కోసం .. నేను పుట్టింది నీ కోసం ..
మధువు పుట్టింది నా కోసం .. నేను పుట్టింది నీ కోసం
కన్నుల కాటుక కరగక ముందే … కన్నుల కాటుక కరగక ముందే
సిగలో పువ్వులు వాడక ముందే .. సిగలో పువ్వులు వాడక ముందే
పానీయముతో పరవశమై పానీయముతో పరవశమై
నీ కౌగిట నన్నే బంధించుకో .
లేత గులాబి పెదవులతో కమ్మని మధువును తాకాలి
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:48:25 AM IST Why fly solo when there is so much support on offer around you.
Posted by: Mr. Siri Siri At: 4, Sep 2008 9:29:35 AM IST You can't expect someone to make a change to suit your needs. It's not realistic.
Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 8:46:53 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|