
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| yaSOdamma gOri kOrika pai
dEvuni batti paaTalu
ippuDu pesaaram sEttunnaananDe !..
yaSOdamma gOru vini ,aalakinchi,pulakinchi paravasittaarani naa sinni aaSa,
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము
బ్రహ్మ
పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెది నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము
బ్రహ్మ
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:53:18 PM IST ఊయల లూగినదోయి మనసే …
తీయని ఊహల తీవెలపైన …
ఊయల లూగినదోయి మనసే …
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ
వెన్నెల పూవులు విరిసే వేళ
సన్నని గాలులు సాగే వేళ
వలపులు ఏవో పలికెను నాలో ….
వలపులు ఏవో పలికెను నాలో
తెలుపగ రానిది ఈ హాయి
ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ
కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై పరువము నేనై ….
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి…
ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:48:00 PM IST అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను..
చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను
తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెను
అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను … పదునౌ చూపులు బాధించెను
హోయ్ అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ ..
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ .. పువ్వుల సంకెల బిగించనీ ..
హోయ్ అంతగా నను చూడకు .. ష్ .. మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:47:25 PM IST ఎవరన్నారివి కన్నులని .. ఎవరన్నారివి కన్నులని
అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని .. ఎవరన్నారివి బుగ్గలని
హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కనులని
నడుమిది ఏమంటున్నది .. ఈ నడుమిది ఏమంటున్నది
నా పిడికిట ఇమిడెదనన్నది
నల్లని జడ ఏమన్నది … నా నల్లని జడ ఏమన్నది
అది నను బంధించెద నన్నది .. నను బంధించెద నన్నది
ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి
సిగ్గులు దోసిట దూయకు .. నా సిగ్గులు దోసిట దూయకు
నీ చేతుల బందీ చేయకు .. నీ చేతుల బందీ చేయకు
మెల్లగ లోలో నవ్వకు .. మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు .. చల్లగ పిడుగులు రువ్వకు
ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి
అడుగున అడుగిడుటెందుకు .. నా అడుగున అడుగిడుటెందుకు
నువు తడబడి పోతున్నందుకు
మరిమరి చూచెదవెందుకు .. నను మరిమరి చూచెదవెందుకు
నువు మైకంలో ఉన్నందుకు .. మైకంలో ఉన్నందుకు
ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:45:50 PM IST విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే
ఒదిగి ఉన్నావులే
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము
వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు … కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే
నిండి ఉన్నావులే
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకె పరిణయమౌనులే..
పరిణయమౌనులే
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:45:11 PM IST చందమామ రమ్మంది చూడు చల్లగాలి రమ్మంది నేడు
ఆ పైన ఇంక ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ బాగుంది నేడు చల్లగాలి బాగుంది నేడు
ఏముంది ఇంక ఏముంది అది అంతే కదా ఏ నాడు
చందమామ బాగుంది నేడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నీవు పలకగాలేను నేను
చందమామ రమ్మంది చూడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు
నీది నా దారి కాదు నాది నీ దారి కాదు
చందమామ బాగుంది నేడు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు
అడవి మనిషివి నీవు
ఆమాటె తగదన్నాను
చందమామ రమ్మంది చూడు చల్లగాలి రమ్మంది నేడు
ఆ పైన ఇంక ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ రమ్మంది చూడు
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:45:23 AM IST ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
నన్నే వలచి నా మేలు తలచి
నన్నే వలచి నా మేలు తలచి
లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా
వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా
యుగయుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన నిన్నే ధరియించనా
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమడుగను ఇంకేమడుగను నీ మనసే నాదైతే ఏమడుగను
నీ కన్నుల వెలుగులే తారకలై నయన తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా
నీ సగము మేన నేనే నివసించగా
ఏమడుగను ఇంకేమడుగను నీ మనసే నాదైతే ఏమడుగను
నిన్నే వలచి నీ మేలు తలచి
నిన్నే వలచి నీ మేలు తలచి
బ్రతుకే నీవై పరవశించు చెలినీ …. నీ జాబిలినీ
ఏమడుగను ఇంకేమడుగను నీ మనసే నాదైతే ఏమడుగను
ఆహాహా … ఆహాహా … ఆహాహహా ……
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:38:19 AM IST ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని
నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని
నే చదివిన జీవితపాఠం నీకే నేర్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:35:29 AM IST ఎందున్నావో ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
---------------------------
ఎందున్నావో …… ఓ …….. చెలీ…..
అందుకో ….. నా…. కౌగిలి …
ఎందున్నావో ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలీ ..
నిలువలేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపుతీపి తెలుసుకోనిదే
నిలువలేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపుతీపి తెలుసుకోనిదే
ఇన్ని నాళ్ళ వెతలు సైచి నీకై నీకై ఉన్నాను
ఇన్ని నాళ్ళ వెతలు సైచి నీకై నీకై ఉన్నాను
ఎందున్నావో ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలీ ..
కొంగులోన నిన్నుదాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశించనా
కొంగులోన నిన్నుదాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశించనా
నీడవోలె యుగయుగాలు నీతో నీతో ఉంటాను
నీడవోలె యుగయుగాలు నీతో నీతో ఉంటాను
ఎందున్నావో సుందరా .. నా ముందు నిలువవేలరా
ఎందున్నావో సుందరా ..
ఇందున్నానే ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలీ ..
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:31:40 AM IST మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
విరిసే ఊహలలో పరువము నీవేలే …
విరిసే ఊహలలో పరువము నీవేలే …
మదనుని కన్నులలో మగసిరి నీదేలే …
మదనుని కన్నులలో మగసిరి నీదేలే …
సైగలతో కవ్వించే జవ్వని నీవే
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
తలపుల పందిరిలో కలలే కందామా …
తలపుల పందిరిలో కలలే కందామా …
తరగని కౌగిలిలో కాపురముందామా …
తరగని కౌగిలిలో కాపురముందామా …
కనరాని తీరాలే కనుగొందామా …
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:29:43 AM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|