
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
రతనాల భవనాల నిన్నుంచలేను
రతనాల భవనాల నిన్నుంచలేను
కనుపాపల నిన్ను కాపాడు కోనా
కనుపాపల నిన్ను కాపాడు కోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
జో లాలి
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:27:08 AM IST ఏదో ఏదో అయిపోతుంది
ఎదలో ఏదో మొదలయ్యింది
నిన్నే చూడాలని నీతో ఉండాలని
నేనే ఓడాలని నువ్వే గెలవాలని
పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన
కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే
చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక
తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక
నిన్నే తాకాలని నీతో గడపాలని
ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని
మనసేమో మనసిచ్చింది
వయసేమో చనువిచ్చింది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన
ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే
మోమాట సిగ్గుతోటి పెదవి విప్పనంటే
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే
ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే
ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక
నువ్వే కావాలని నిన్నే కలవాలని
మనసే విప్పాలని మాటే చెప్పాలని
ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:24:52 AM IST పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతకు ఆవాహనం
పరువాల హోయలకు పైయెదలైన
నా ఊహల లలనకు ఉరువుల ఆసనం
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:23:17 AM IST అప్పుచేసి పప్పుకూడు
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పుచేసి మీసం మెలిదిప్పరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
ఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితె ఐ.పి. బాంబుందిరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూక లేనివాడు భువిని కాసుకు కొఱగాడురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:20:01 AM IST లటుకు చిటుకు లంకతోటలో
చిగురాకు పెదవుల మీద చిరునామా ముద్దర కోసం వేచానులే నిద్దర కాచానులే
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:18:08 AM IST లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే
కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే
వాలుగా చూపులు చూసి పూలపై బాసలు చేసి
ముద్దుగా వుందామంటె ఇద్దరం ఒకటేనంటే
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
Posted by: Mr. Siri Siri At: 29, Aug 2008 9:15:49 AM IST పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు
aDagaka ichhina muddE muddu
Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 9:08:48 AM IST నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది … నేనొక ప్రేమ పిపాసిని
తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నానా
దాహం తీరనిది నీ హృదయం కదలనిది ….. నేనొక ప్రేమ పిపాసిని
పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచానని తెలిపేలోగా నివురై పోతాను
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది ….. నేనొక ప్రేమ పిపాసిని
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచానని తెలిపేలోగా నివురై పోతాను
నేనొక ప్రేమ పిపాసిని
Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 9:04:52 AM IST మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కల్లలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
కోర్కెల సెలనీవు కూరిమి వలనీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కల్లలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 9:02:57 AM IST అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతము ఏదీ లేని గానము
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా
అదే బాసగా అదే ఆశ గా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటె పాడను?
అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 9:01:06 AM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|