Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 67 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
నా లోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానము

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 9:00:09 AM IST
గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసి కూడా చేయలెని వెర్రి వాడని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ రో--దించనీ

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:58:33 AM IST
నీ కనులలోనా తడి చేరనీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే నను ముంచనీకు యె కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహా సాగరాలే నిను మ్రింగుతున్నా ఈ జన్మ లోనా యెడబాటులేదు పది జన్మలైనా ముడేవీడిపోదు అమరం అఖిలం మన ప్రేమా

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:57:00 AM IST
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది నల్లని జడలో కరినాగుంది నడకలలో అది కనబడుతుంది దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది మొగిలి రేకుల సొగసూ ఉంది మొన కన్నులలో పదునూ ఉంది లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు?

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:55:58 AM IST
ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోనా నీవే మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం గాయన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడి పోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాణ్ణి కాలేను ఒహొహో..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోన నీవే కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతె క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగ స్వప్నం సత్యమైతె వింత సత్యం స్వప్నం అయ్యెదుంద ప్రేమకింత బలముందా అహహహా..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:53:11 AM IST
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా సొంతవారు ఐనవారు అంతరాల ఉందురోయ్ .. అంతరాల ఉందురోయ్ ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకనోయ్… జ్ఞాపకాలే అతుకనోయ్ ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే తనకు తనవారికి ఎడబాటే లేదులే .. ఎడబాటే లేదులే ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు ఎక్కడికీ పోదు … ఎక్కడికీ పోదు ఎక్కడికీ పోదు

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:52:12 AM IST
ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతే మిగిలేది తెలుపేనండి నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నా కోసం మీ ఇష్టం వదలొద్దండి బాగుంది మీ Taste నాకెంతో నచ్చేట్టు మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు అందుకే నే దిగి వచ్చా వంచని నా తల వంచా స్నేహ భావమా కలా నిజం నీ కొసమే అనుక్షణం ఉల్లాసమే == నేనంటు ప్రత్యేకం నాదంటు ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:49:12 AM IST
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కధలే లేవని గమనించుక నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:45:18 AM IST
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుషప్రపంచం, లేచింది మహిళాలోకం ఎపుడో చెప్పెను వేమనగారు, అపుడే చెప్పెను బ్రహ్మంగారు ఎపుడో చెప్పెను వేమనగారు, అపుడే చెప్పెను బ్రహ్మంగారు ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా... ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా... విస్సన్న చెప్పిన వేదం కూడా లేచింది ... పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు అది యిది యేమని అన్ని రంగముల అది యిది యేమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు లేచింది .... చట్టసభలలో Seatల కోసం భర్తల తోనే పోటీ చేసి చట్టసభలలో Seatల కోసం భర్తల తోనే పోటీ చేసి డిల్లి సభలో పీఠం వేసి... డిల్లి సభలో పీఠం వేసి... Lecture లెన్నో దంచారు,విడాకు చట్టం తెచ్చారు Lecture లెన్నో దంచారు,విడాకు చట్టం తెచ్చారు లేచింది .... లేచింది, నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:43:08 AM IST
There's no way to change your past, of course, but you can change how you deal with your present and your future!

Posted by: Mr. Siri Siri At: 27, Aug 2008 8:39:38 AM IST
< < Previous   Page: 67 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.