Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 70 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే ఒదిగి ఉన్నావులే విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము కలకల నవ్వే నీ కళ్ళు … కాముడు దాగిన పొదరిళ్ళు ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే నిండి ఉన్నావులే విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు ఆ పసిడి పందిళ్ళలో మనకె పరిణయమౌనులే.. పరిణయమౌనులే విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే … విన్నానులే ప్రియా

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:15:13 PM IST
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో …. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ … సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా వెతికే పెదవులతో ..తొణికే మధువులతో వెతికే పెదవులతో ..తొణికే మధువులతో పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ … విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ … కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో నడిచే తీగియవై పలికే దీపికవై నడిచే తీగియవై పలికే దీపికవై అవతరించి ఆవరించి అలరించే నా చెలీ .. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:11:26 PM IST
ఓ నిండు చందమామ … నిగనిగల భామ ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు ఏలుకునే ప్రియుడను కానా నాలించగ సరసకు రానా ఓఓఓఓఓ… ఓ నిండు చందమామ … నిగనిగల భామ ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడతాయే కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడతాయే కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే నేటినుంచి నేనులు రెండూ నెరజాణా ఒకటాయే.. ఓఓఓఓఓ… ఓ నిండు చందమామ … నిగనిగల భామ ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:10:27 PM IST
ఆనాటి మధుర వసంతం ఈనాడు విధురహేమంతం ఆనాటి తీయని సుఖం ఈనాడు కాలకూట విషం .. కాలకూట విషం కాలమే విధి రూపము మానవాళికి దీపము శోకమైనా .. సౌఖ్యమైనా …కాలమే ప్రమాణము … కాలమే విధి రూపము.. కలసివచ్చిన కాలమైతే మనిషి తానే దైవము కలసివచ్చిన కాలమైతే మనిషి తానే దైవము మంచిరోజులు మారిపోతే పరుల కంటికి హీనము … పరుల కంటికి హీనము కాలమే విధి రూపము.. మానవాళికి దీపము కలల వెన్నెల కరిగిపోగా కారుచీకటి నిండెనా .. కలల వెన్నెల కరిగిపోగా కారుచీకటి నిండెనా పరుల పంచను బ్రతుక వలసిన వ్రాతయే మీదాయెనా .. వ్రాతయే మీదాయెనా … కాలమే విధి రూపము.. మానవాళికి దీపము ఒకని భాగ్యము తూగుటూయల ఒకని శాపము శోకము కాలమెవరికి మేలు చేయునో కాలమెవరికి కీడు చేయునో మానవునికే తెలియరానిది విధివిలాసము చోద్యము విధివిలాసము చోద్యము కాలమే విధి రూపము.. మానవాళికి దీపము శోకమైనా .. సౌఖ్యమైనా …కాలమే ప్రమాణము … కాలమే విధి రూపము..

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:09:00 PM IST
లేని బాట వెతుకుతున్న పేద వానికి …. రాని పాట పాడుకున్న పిచ్చివానికి ….. బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు మాటలతో చిక్కుబడి మనసు నలిగిపోతుంది మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది పలుకలేని ప్రతి గుండే బాధతో నిండినది ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు చీకటిలో వెలుగును చూడ నేర్చుకో చమటలో స్వర్గాన్ని సృష్ఠి చేసుకో విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే ఆ రోజు వచ్చులే ….. బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:07:13 PM IST
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ - గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ - గుండెల్లో గుసగుసలు వినిపించనీ నీ చూపుతో నన్ను ముడివేయకు – ఈ పూలు వింటాయి సడి చేయకు నీ చూపుతో నన్ను ముడివేయకు సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది - నా పైట చెంగు లాగి కవ్వించకు సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది - నా పైట చెంగు లాగి కవ్వించకు అనువైన వేళ అందాలు దాచకు … అనువైన వేళ అందాలు దాచకు అణువణువు నిన్నే కోరే మురిపించకు.. ఇకనైన నునుసిగ్గు తెర వేయకు నీ చూపుతో నన్ను ముడివేయకు – ఈ పూలు వింటాయి సడి చేయకు కన్నుల్లో మిసమిసలు కనిపించనీ ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే – మోహాలతో నన్ను మంత్రించకు ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే – మోహాలతో నన్ను మంత్రించకు మనలోని ప్రేమ మారాకు వేయనీ … మనలోని ప్రేమ మారాకు వేయనీ మనసారా ఒడిలో నన్ను నిదురించనీ …నీ నీలి ముంగురులు సవరించనీ నీ చూపుతో నన్ను ముడివేయకు – ఈ పూలు వింటాయి సడి చేయకు కన్నుల్లో మిసమిసలు కనిపించనీ – గుండెల్లో గుసగుసలు వినిపించనీ కన్నుల్లో మిసమిసలు కనిపించనీ …..

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:04:24 PM IST
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ … ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ … ఎక్కడో దూరాన కూర్చున్నావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు అంతా మా సొంతమని అనిపిస్తావు .. అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా …..చేసేస్తావు … సామీ … ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ … ఎక్కడో దూరాన కూర్చున్నావు పెరుగుతుంది వయసనీ అనుకుంటాము … కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతుంది వయసనీ అనుకుంటాము … కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా మా కళ్ళముందు మాయతెరలు … కప్పేస్తావు … సామీ ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఎక్కడో దూరాన కూర్చున్నావు … సామీ …. ఎక్కడో దూరాన కూర్చున్నావు …

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:01:44 PM IST
How do you see yourself?

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 4:36:03 PM IST
You want to keep them from making a mistake, but you don't want them to think you don't believe in them. Just try to do your best to help them see things more conservatively -- alert them to the downside of their idea, and what could happen. Ask them if they are ready for a worse case scenario. They'll know you are speaking from a place of caring, not judgment

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 4:25:16 PM IST
Every day has the potential to be good or bad day, so just try to do your best without worrying so much about what people think of you. You won't please everyone you come in contact with, so just be yourself. If they don't like what they see, move on

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 4:22:20 PM IST
< < Previous   Page: 70 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.