
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| చెలి చేమంతాలై పూసే నీ ప్రేమ నాలో..అది తెలుసా
చలి పూగంధాలై తాకే నీ లేత మనసే..ఇది తెలుసా
ఏ జన్మదో విరిసెగ మన ప్రేమ
ఈ జన్మలో ఒకటిగ కలిసామా !
చెలి చేమంతాలై పూసే నీ ప్రేమ నాలో..అది తెలుసా
ప్రేమంటే ఏమో తెలియదుగా..నిను చేరక ముందు
నీ చెలిమే నన్నే మార్చెనుగా
నీకోసం కనులే వెతికెనుగా..ఒక వెన్నెల దీపం
నీ రూపై ఎదురుగ నిలిచెనుగా
సాగరాలలా సిరిమువ్వలుగా..
నీ ధ్యానములే చిరుజల్లులుగా..
నన్నే ముంచేసే ఆ తొలకరి నువ్వేగా !
చెలి చేమంతాలై పూసే నీ ప్రేమ నాలో..అది తెలుసా
చలి పూగంధాలై తాకే నీ లేత మనసే..ఇది తెలుసా
ఆకాశం నేలకు దించెనుగా..నీ తీయని స్నేహం
జాబిల్లిని మెడలో వేసెనుగా
ఎండల్లో వానై కురిసెనుగా..నీ చల్లని హృదయం
ముంగిట్లో ముగ్గై పిలిచెనుగా
కలలో కలలా..కవ్వింపులుగా
నీ రూపములే నా మనసంతా
నాలో దాగున్న నా ప్రాణం నువ్వేగా !
చెలి చేమంతాలై పూసే నీ ప్రేమ నాలో..అది తెలుసా
చలి పూగంధాలై తాకే నీ లేత మనసే..ఇది తెలుసా
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:50:25 PM IST హే .. పదహారణాలా తెలుగు జూలియట్ ..ఎక్కడవుందో వెతుకుదాం
పదరా మనవాడి చిలిపి లైఫ్ నీ .. ఎక్కడ ఉన్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదూ..కళ ఉంటే సరే
మతమేదైనా దిగుల్లేదూ..మనసుంటే సరే సరే
సినీ తారో..టెన్నిస్ స్టారో..నచ్చేదిక నీకెవరో
We have a Romeo..We needa a Juliet
We have a Romeo..We needa a Juliet
హే .. పదహారణాలా తెలుగు జూలియట్ ..ఎక్కడవుందో వెతుకుదాం
yO yO yO we have a romeo..all that we need is a Juliet
yO yO yO we have a romeo..all that we need is a Juliet
చదువుల సుందరి అదుగోరా..నడిచే లైబ్రరీ ఎందుకురా
సెల్ ఫోన్ సొగసరి ఇదుగోరా..ఎపుడూ ఎంగేజేరా
టీవీ యాంకర్ దేఖోరా..ఆ వంకర భాషకు దండం రా
టాటా గారి బేటీరా.. అది రూపీ రూపం రా
ఏం కావాలో..ఓ .. తనలో క్వాలిటీ .. ఓ
ఇంకా నీలో .. ఓ .. లేదోయ్ క్లారిటీ .. ఓ
తేల్చేలోగా వయసవుతుందీ..కనీసం నూటొకటీ
We have a Romeo..We needa a Juliet
We have a Romeo..We needa a Juliet
హే .. పదహారణాలా తెలుగు జూలియట్ ..ఎక్కడవుందో వెతుకుదాం .. వెతుకుదాం !
పదరా మనవాడి చిలిపి లైఫ్ నీ .. ఎక్కడ ఉన్నా కలుపుదాం !
I can give you a reason .. to stay .. if you can see at me !
Your life, your dreams .. we alike..Don’t walk away !
Can’t you see what u are leaving in me ! hO !
అందరు గమనిస్తూ ఉంటే .. ఏమండీ అని పిలవాలీ
ఎవ్వరు పక్కన లేకుంటే .. ఏరా అనాలీ
అల్లరి వేషం వేస్తుంటే..తలపై ఒక్కటి ఇవ్వాలీ
అలసటగా నువ్ వస్తుంటే..తననే నిమరాలీ
కొంచెం కోపం .. ఓ .. కొంచెం జాలీ .. ఓ
కొంచెం స్వార్ధం .. ఓ .. కలిసుండాలీ .. ఓ
నన్నే నాకూ..కొత్తగ చూపే ..యువరాణే కావాలీ
We have a Romeo..We needa a Juliet
We have a Romeo..We needa a Juliet
పదహారణాలా తెలుగు జూలియట్ ..ఎక్కడవుందో వెతుకుదాం .. వెతుకుదాం !
పదరా మనవాడ్ చిలిపి లైఫ్ నీ .. ఎక్కడ ఉన్నా కలుపుదాం !
yO yO yO we have a romeo..all that we need is a Juliet
yO yO yO we have a romeo..all that we need is a Juliet
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:48:22 PM IST హే..కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నానూ
కాని ఇప్పుడు..హుం
పగలే వెన్నల కాస్తుందని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నానూ
కాని ఇప్పుడు..హుం
ప్రేమకోసం ఏకంగా..తాజ్ మహలే కట్టాడూ
షాజహాన్ కి పని లేదా అనుకున్నాను
ప్రేమకన్నా లోకం లో గొప్పదేదీ లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నానూ
ఒ ఒ ఓ అరె ఇంతలో..ఏదేదో జరిగిందిరో
ఒ ఒ ఓ ఈ ప్రేమలో..నే కూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నానూ
కాని ఇప్పుడు..హుం
హే.. పగలే వెన్నల కాస్తుందని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నానూ
కాని ఇప్పుడు..హుం
హో..ప్రేయసి ఊహల్లో లైఫంతా గడిపేస్తూ
అరె చేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నానూ
కానీ ఇప్పుడు..హుం
గ్రీటింగ్ కార్డులకీ..సెల్ఫోన్ బిల్లులకీ..
వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నానూ
కానీ ఇప్పుడు..హుం
గాలిలోనా రాతలు రాస్తే..
మాయరోగం అనుకున్నానూ
మాటిమాటికి తడబడుతుంటే
రాతిరిదింకా దిగలేదని అనుకున్నానూ
ఒ ఒ ఓ అది ప్రేమనీ..ఈరోజే తెలిసిందిరో
ఒ ఒ ఓ ఈ ప్రేమలో..నే కూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నానూ
కాని ఇప్పుడు..హుం
హో..చూపుల్తో మొదలై..గుండెల్లో కొలువై
తికమక పెట్టేదొకటుందంటే నమ్మనే లేదూ
కాని ఇప్పుడు..హుం
నీకోసం పుట్టీ..నీకోసం పెరిగీ
హృదయం ఒకటీ ఉందంటే ఒప్పుకోలేదూ
కాని ఇప్పుడు..హుం
ప్రేమమైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నానూ
ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కణ్ణే ఎందుకు మిస్సయ్యానూ
ఒ ఒ ఓ ఈ రోజులా..ఏ రోజు అవలేదురో
ఒ ఒ ఓ ఈ ప్రేమలో..నే కూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నానూ
కాని ఇప్పుడు..హుం
హే.. పగలే వెన్నల కాస్తుందని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నానూ
కాని ఇప్పుడు..హుం
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:46:01 PM IST అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
కలవో అలవో వలవో నా ఊహల హాసినీ
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని !
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
తీపికన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే.. వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే.. నువు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
నన్ను నేనే చాలా తిట్టుకుంటా..నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా..ఏదో చిన్నమాటే నాతో నువ్వు మాటాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే..ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:41:49 PM IST మౌనమేలా మనసా
మాయ నీకు తెలుసా
ఊయలూగే వయసా
వింత కాదా వరసా
కళ్ళు రెండూ సొంతమైనా కంటి పాపా చూపవేమే
గుండె నిండా ప్రేమ ఉన్నా కోరకుండా చేరుకోదే
ఊరికే..ఊసులో..ఊహలో..చేరదే ఇలా..
ఊసులాడే మనసా
ఊయలూగే వయసా
నీకుగానీ తెలుసా
కొంటె ప్రేమ వరసా
గుండెలోనా ఆశలన్నీ చెప్పుకుంటే తప్పు కాదే
చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే
ఆటలో..పాటలో..మాటలో..చెప్పవే ఇలా..
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:37:34 PM IST ఏమైనదో ఎదలోపలా
నీ ఊసులే సిరిమువ్వలా
అలాపించే ఈ గీతం
ఆరాతీసే నీ కోసం
నింగీ నేలా నీ రూపం
నువ్వే కాదా ఈ లోకం
ఏమైనదో ఎదలోపలా.. నీ ఊసులే సిరిమువ్వలా
తొలి చూపులే విడిపోయెనా
చిగురాశలే చితులాయెనా
మౌనాలన్నీ ఇంతేనా
దూరం చేసీ వింతేనా
ఏమవుతుందో ఈ ప్రేమా
మళ్ళీ మళ్ళీ కలిసేనా
తొలి చూపులే విడిపోయెనా.. చిగురాశలే చితులాయెనా !
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:36:30 PM IST మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
నిన్నే తలచా..నన్నే మరిచా..నీకై జీవించా
ఆ.. ఆమాట దాచా..కాలాలు వేచా..నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
ఆ..చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసూ
కన్నీరైనా గౌతమి కన్నా..
తెల్లారైనా పున్నమి కన్నా..
మూగైపోయా నేనిలా
మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
నిన్న నాదిగా..నేడు కాదుగా..అనిపిస్తున్నా
కన్ను చీకటై..కలలు వెన్నెలై..కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా..
మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
నిన్నే తలచా..నన్నే మరిచా..నీకై జీవించా..
ఆ.. ఆమాట దాచా..కాలాలు వేచా..నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా..నిన్నే ప్రేమించా
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:35:42 PM IST సత్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శౄతిశిఖరీ.. నిగమఝరీ.. స్వరలహరీ !
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
వెతలు తీర్చు మా దేవేరీ.. వేదమంటి మా గోదారీ
శబరి కలిసినా గోదారీ.. రామ చరితకే పూదారీ
ఏసెయ్... చాప జోర్సెయ్.. నావ వార్సేయ్.. వాలుగా..
చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
సావాసాలు.. సంసారాలు.. చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయాంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలై పోతున్న ఇంటిపనుల దౄశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి లగ్గం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడా
నది ఊరేగింపులో.. పడవ మీద రాగా.. ప్రభువు తాను కాగా
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపూ
లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకూ
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకీ
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికీ
లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపూ
అర పాపికొండలా నలుపు కడగలేకా.. నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
వెతలు తీర్చు మా దేవేరీ.. వేదమంటి మా గోదారీ
శబరి కలిసినా గోదారీ.. రామ చరితకే పూదారీ
ఏసెయ్... చాప జోర్సెయ్.. నావ వార్సేయ్.. వాలుగా..
చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:33:37 PM IST ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే..స్వర్గాలై..
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:31:15 PM IST కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హౄదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:30:36 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|