
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
తొలిముద్దు జబు రాసా చెలికే ఎపుడో
చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతు నిచ్చి కొమ్మకీ
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకీ
మల్లె వీణ లాడెనేమొ బాల నీలవేణికీ
మెచ్చీ మెచ్చీ చూడసాగె గుచ్చే కన్నులూ
గుచ్చీ గుచ్చీ కౌగిలించే నచ్చే వన్నెలూ
అంతేలే..కధంతేలే..అదంతేలే..
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
హంసలేఖ పంపలేక హిమస పడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా రేణు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలూ
వళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలూ
అంతేలే..కధంతేలే..అదంతేలే..
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:28:35 PM IST నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
దాచినదంతా నీ కొరకే
దాచినదంతా నీ కొరకే
నీ కోరిక చూపే .. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో కోర్కే !
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !
నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం
పరుగులు తీసే నా పరువం
నీ కధలే విందీ .. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది నీకూ నాకే జోడందీ !
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా .. సరదా పడితే వద్దంటానా .. హయ్య !
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:26:48 PM IST హే.. ముత్యవల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా
జరగనా కొంచెం .. నేనడగానా లంచం
చలికి తలలు వంచం .. నీ వళ్ళే పూలమంచం
వెచ్చగ ఉందామూ మనమూ
హే .. పైటలాగా నన్ను నువ్వూ కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా .. అది తొలకరించు వేళా
తెలుసుకో పిల్లా .. ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ .. మనదీ
హే .. కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
నవ్వని పువ్వే నువ్వూ .. నునువెచ్చని తేనెలు ఇవ్వూ
దాగదు మనసే .. ఆగదు వయసే
ఎరగదే పొద్దూ .. అది దాటుతుంది హద్దు
ఈయవా ముద్దూ .. ఇక ఆగనే వద్దు
ఇద్దరమొకటవనీ .. కానీ
హే .. బుగ్గ మీదా మొగ్గలన్నీ దూసుకోనీ
రాతిరంతా జాగారమే చేసుకోనీ
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:26:13 PM IST ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
వయసులో వేడుందీ.. మనసులో మమతుంది
వయసులో వేడుందీ.. మనసులో మమతుంది
మమతలేమో సుధామయం .. మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో ..
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
కంటిలో కదిలేవూ..జంటగా కలిసావు
కంటిలో కదిలేవూ..జంటగా కలిసావూ
నీవు నేనూ సగం సగం .. కలిసిపోతే సుఖం సుఖం
తనువూ మనసూ తనివిరేపునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
భావమే నేనైతే.. పల్లవే నీవైతే
భావమే నేనైతే.. పల్లవే నీవైతే
ఎదలోనా ఒకే స్వరం .. కలలేమో నిజం నిజం
పగలూ రేయీ ఏదో హాయీ ..
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే .. ఊయలూగునే .. ఆహ హాహ హా !
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:25:11 PM IST Helo !
Hi.
Good morning !
Good morning.
How do you do?
Fine. Thank you.
How about joining me?
Ok, with pleasure.
పరువమా .. చిలిపి పరుగు తీయకూ
పరువమా .. చిలిపి పరుగు తీయకూ
పరుగులో .. పంతాలు పోవకూ
పరుగులో .. పంతాలు పోవకూ
పరువమా ..
చిలిపి పరుగు తీయకూ
ఏ ప్రేమ కోసమో .. చూసే చూపులూ
ఏ కౌగిలింతకో .. చాచే చేతులూ
తీగలై .. హో .. చిరుపూవులై పూయ
గాలిలో .. హో .. రాగాలుగా మ్రోగా
నీ గుండె వేగాలు తాళం వేయా !
పరువమా ..
చిలిపి పరుగు తీయకూ
ఏ గువ్వ గూటిలో .. స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో .. సౌఖ్యం ఉన్నదో
వెతికే .. హో .. నీ మనసులో లేదా
దొరిక్తే .. హా .. జత కలుపుకో రాదా
అందాక అందాన్ని ఆపేదెవరూ !
పరువమా ..
చిలిపి పరుగు తీయకూ
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:24:07 PM IST అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ .. వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని .. చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి
ఏకమై .. ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని .. బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని .. కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు .. చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు .. హాహాకారం
మళ్ళీ మళ్ళీ ..
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:23:16 PM IST ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా
ఆమనీ పాడవే హాయిగా..
ఆమనీ పాడవే హాయిగా..
వయస్సులో వసంతమే .. ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే .. రచించెలే మరీచికా
పదాల నా ఎదా .. స్వరాల సంపదా
తరాల నా కధా .. క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేననీ !
ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూల రాగాలతో
శుకాలతో పికాలతో .. ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం .. స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే .. మరింత చేరువై
నివాళి కోరినా .. ఉగాది వేళలో
గతించిపోని గాధ నేననీ !
ఆమనీ పాడవే హాయిగా
మూగవైపోకు ఈ వేళా
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా ..మౌనమైన వేళలా
ఆమనీ పాడవే హాయిగా..
ఆమనీ పాడవే హాయిగా..
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:22:40 PM IST ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలూ .. రాలు పూల దండలు
నీదో లోకం .. నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ !
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలూ .. మాసిపోవు ఆశలూ
నింగీ నేల .. తాకే వేళ
నీవే నేనై పోయేవేళాయె
నేడు కాదులే .. రేపు లేదులే
వీడుకోలిదే .. వీడుకోలిదే !
నిప్పులోన కాలదూ .. నీటిలోన నానదూ
గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ
రాచవీటి కన్నెదీ .. రంగు రంగు స్వప్నమూ
పేదవాడి కంటిలో పేద రక్తమూ
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా .. ఎదురులేదు ప్రేమకూ
రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా !
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
కాళిదాసు గీతికీ .. కృష్ణ రాసలీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవీ
ఆ అనారు ఆశకీ .. తాజ్ మహలు శోభకీ
పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ
నిధి కన్న ఎద మిన్న .. గెలిపించు ప్రేమనే
కధ కాదు బ్రతుకంటె .. బలికానీ ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా .. ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే .. తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా !
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసీ ..తీర్చమందిలే కసీ
నింగీ నేల .. తాకే వేళ
నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం .. లేదు బంధనం
ప్రేమకే జయం .. ప్రేమదే జయం !
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:21:59 PM IST ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో
మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా
ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో
అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా
హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:21:17 PM IST సుందరీ నేనే నువ్వంట... చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా ....జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంటా..... నీడగా పాడమంటా
నా శిరీ నీవేనట
సుందరీ నేనే నువ్వంట ....చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చామనసంతా.... జన్మకే తోడై నేనుంట
అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
రేపవలు నిద్దరలోను ఎద నీ తోడే కోరును
యుధ్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద పిలుపు ఈ వేళ ఏల ఈ శోధనా
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావో
ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
సుందరీ నేనే నువ్వంటా చూడనీ నీలో నన్నంటా
గుండెలో నిండమంటా నీడలా పాడమంటా
నా శిరీ నీవేనట
సుందరీ నేనే నువ్వంటా చూడనీ నీలో నన్నంటా
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
మాసాలు వారాలౌను నీవు నేను కూడితే
వారాలు మాసాలౌను బాటే మారి సాగితే
పొంగునే బంధాలే నీ దరే చేరితే
గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం
సుందరీ నేనే నువ్వంటా చూడనీ నీలో నన్నంటా
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంటా నీడగా పాడమంటా
నా శిరీ నీవేనట
సుందరీ నేనే నువ్వంటా చూడనీ నీలో నన్నంటా
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా
Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:20:22 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|