Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 78 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
కోనలో.. కోనలో.. సన్న జాజిమల్లి జాజిమల్లి మేనులో.. పొన్న పూలవల్లి పాలవెల్లి వేణిలో.. కన్నె నాగమల్లి నాగమల్లి తీరులో.. అనురాగవల్లి రాగవల్లి కావ్యాలకే..హో శ్రీకారమై..హో కస్తూరి తాంబూలమీవే ! కోరుకో.. సన్న జాజిమల్లి జాజిమల్లి ఏలుకో.. కన్నెసోకులన్ని సోకులన్ని పాడుకో.. ప్రేమ కైతలల్లి కైతలల్లి వేసుకో.. పాలబుగ్గపైన రంగవల్లి మేని సోయగాలు..ప్రేమ బంధనాలు మౌన స్వాగతాలూ..రాగ రంజితాలు సరసములో..సమరములూ సరసులకూ..సహజములూ ప్రాభవాలలోనా..నవశోభనాల జాణా రాగదే రాగమై రాధవై కోరుకో.. సన్న జాజిమల్లి జాజిమల్లి ఏలుకో.. కన్నెసోకులన్ని సోకులన్ని పాడుకో.. ప్రేమ కైతలల్లి కైతలల్లి వేసుకో.. పాలబుగ్గపైన రంగవల్లి రాగాలనే..హోయ్ బోయీలతో..హోయ్ మేఘాల మేనాలో రానా ! కోనలో.. సన్న జాజిమల్లి జాజిమల్లి మేనులో.. పొన్న పూలవల్లి పాలవెల్లి వేణిలో.. కన్నె నాగమల్లి నాగమల్లి తీరులో.. అనురాగవల్లి రాగవల్లి కోయిలమ్మ రాగం .. కొండవాగు వేగం పారిజాత సారం .. ఏకమైన రూపం అధరముపై..అరుణిమలూ మధురిమకై..మధనములూ నందనాలలోన..రసమందిరాలలోన హాయిగా..సాగగా..చేరగా ! కోనలో.. సన్న జాజిమల్లి జాజిమల్లి మేనులో.. పొన్న పూలవల్లి పాలవెల్లి వేణిలో.. కన్నె నాగమల్లి నాగమల్లి తీరులో.. అనురాగవల్లి రాగవల్లి కావ్యాలకే..హో శ్రీకారమై..హో కస్తూరి తాంబూలమీవే కోరుకో.. సన్న జాజిమల్లి జాజిమల్లి ఏలుకో.. కన్నెసోకులన్ని సోకులన్ని పాడుకో.. ప్రేమ కైతలల్లి కైతలల్లి వేసుకో.. పాలబుగ్గపైన రంగవల్లి !

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:58:57 AM IST
ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హృదయం

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:58:10 AM IST
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలహం భానోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం వేణువా వీణియా ఏమిటీ రాగము వేణువా వీణియా ఏమిటీ రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం బృదం తరం గిరిజ సురతం ఈ వేళ నాలో రాగోల్లసాలు ఈ వేళ నాలో రాగోల్లసాలు కాదు మనసా ప్రేమ మహిమా నాదు హృదయం భానోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం రంగులే రంగులు అంబరానంతటా రంగులే రంగులు అంబరానంతటా స్వరం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం ఆవేగమేదీ నాలోన లేదు ఆవేగమేదీ నాలోన లేదు ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలహం భనోదయాన చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:57:18 AM IST
ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేల

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:56:10 AM IST
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది గానమిదీ నీ ధ్యానమిదీ ధ్యానములో నా ప్రాణమిదీ ప్రాణమైన మూగ గుండె రాగమిది మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేల అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ రాగల తీగల్లొ వీణానాదం కోరింది ప్రణయవేదం వేశారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం ఆకాశాన తారతీరం అంతేలేని ఎంతో దూరం మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది కూడనిదీ జత కూడనిదీ చూడనిదీ మది పాడనిదీ చెప్పరాని చిక్కుముడి వీడనిదీ మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:54:37 AM IST
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కలో చూపు చిక్కుకున్నవాడా చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కలో చూపు చిక్కుకున్నవాడా కళ్ళ ముందు కటికనిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానీయకు వ్యర్ధం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానీయకు వ్యర్ధం చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కలో చూపు చిక్కుకున్నవాడా స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే గుండె బండగా మార్చేదా సంప్రదయమంటే కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే గుండె బండగా మార్చేదా సంప్రదయమంటే చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కలో చూపు చిక్కుకున్నవాడా నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కలో చూపు చిక్కుకున్నవాడా కళ్ళ ముందు కటికనిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానీయకు వ్యర్ధం చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కలో చూపు చిక్కుకున్నవాడా

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:53:30 AM IST
రండి రండి రండి..దయ చేయండీ ! గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మనో, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ పి.ఎల్ : రండి రండి రండి..దయ చేయండీ తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ రండి రండి రండి దయ చేయండీ తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ శోభన: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు ! చిరు: అహా ! శోభన: అఁ ! ఇష్ఠులైన వారొస్తే పట్టలేని హుషారు. పలకరింపుతోనే మనసు మీట గలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరూ. పి.ఎల్ : తమరేనా సూర్య. ఇలా కూర్చోండయ్యా ! ఆగండాగండాగండి. వద్దు కూర్చోకండక్కడ! తగిన చోటు కాదది తమబోటివారికిక్కడ. శోభన: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య. గడపదాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య. పి.ఎల్ : క్లైంట్లు, కంప్లైంట్లూ.. క్లైంట్లు, కంప్లైంట్లూ మనసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గానకళకు దర్బారు. పి.ఎల్ : రండి రండి రండి..దయ చేయండీ శోభన: తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ పి.ఎల్ : బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రు మంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రు మంటూ చిర్రు బుర్రు లాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినపుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మితృలకోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా ! కచేరీలు చేసే కుర్చీ ఇది. ఎలా ఉంది? చిరు: హుఁ , బాగుందండి ! పి.ఎల్ : గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంటా.. శునకమైనా పలుకు కనకాంగి రాగాన ! ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా.. గాలైన కదలాడు సరిగమల త్రోవా.. పి.ఎల్ : రావోయ్ రా ! ఇదుగో ఈయనే సూర్య ! ఈమె నా భార్య ! ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సూ.. ఆర్గ్యుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సూ.. పి.ఎల్ భార్య : చాల్లేండి సరసం ! యేళ్ళు ముదురుతున్న కొద్దీ.. పి.ఎల్ : తిడితే తిట్టేవు కాని తాళంలో తిట్టూ.. తకతోం తకతోం తరిగిటతోం థక తకిటతోం ! స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు. పి.ఎల్ భార్య : తడతా పెడతా పొగపెడతా ఉడకపెడతా ! కొత్తవాళ్ళ ముందేవిటి వేళాకోళం ! ఎవరేమనుకుంటారో తెలియని మేళం ! శోభన: ఎవరో పరాయివారు కాదమ్మా ఈయనా ! సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన ! పి.ఎల్ భార్య : ఆహఁ ! రండి రండి రండి..దయ చేయండీ అందరూ : తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ పి.ఎల్ నాన్న: ఖళ్ ఖళ్ ఖళ్ ఖళ్ ! పి.ఎల్ : వ్రుద్దాప్యంతో మంచం పట్టి తాళం తప్పక దగ్గటమన్నది అంచెలంచలుగ సాధించిన మా తండ్రి పెంచలయ్యా ! ఖళ్ళూ ఖళ్ళున వచ్చే చప్పుడు.. ఘల్లూ ఘల్లున మార్చే విద్యా.. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్యా ! శోభన: ఇదుగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవీ ! పి.ఎల్ : దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం ! మా ఇంట్లో సందడికీ ఈ పిల్లే పల్లవి. పనమ్మాయి : రండి రండి రండి దయ చేయండీ తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ డింగ్ డింగ్..డింగ్ డింగ్ (డోర్ బెల్) పోస్ట్మాన్ : పోస్ట్ పోస్ట్ ! పోస్ట్ పోస్ట్ ! వావిలాల వరాలయ్య బి.అ.ఎల్.ఎల్.బి పోస్ట్ పోస్ట్ ! పోస్ట్ పోస్ట్ ! పి.ఎల్ : మాఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లూ అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లూ ! చిలుక: రండి రండి రండి..రండి రండి రండి ! సోభన: మాకు నిలయ విద్వాంసులు చిలకరాజు గారూ.. కీరవాణి వీరిపేరు పలుకు తేనెలూరూ.. పి.ఎల్ : నవ్వు మువ్వ కట్టీ..ప్రతి నిముషాన్నీ తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగూ మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధామాధురి పంచడమే పరమార్ధం ! అదే అదే నా సిద్దాంతం ! చిరు: గానం అంటే ఒక కళగానే తెలుసిన్నాళ్ళూ నాకూ.. బ్రతుకే పాటగ మార్చినందుకూ జోహారిదిగో మీకూ.. సంగీతంతో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళూ.. సంగీతంలో మాటలాడటం .. దా దా పదా పదా పదా ! మాటలనే సంగతులు చేయటం పనీ..పని పని సరి..పని సరిగా ! సంగతులే సద్గతులనుకొనడం సరి సరి సరి సరి సరి సరిగా సరిగ సరిగా తెలుసుకొన్నాను ఈనాడూ సెలవిప్పిస్తే వెళ్ళొస్తా.. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా..ఆ ! హా !

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:52:43 AM IST
లలిత ప్రియ కమలం విరిసినదీ.. కన్నుల కొలనిడి..ఆ ఉదయ రవికిరణం మెరిసినదీ కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినదీ మనసు హిమగిరిగా మారినదీ కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:51:32 AM IST
లలిత ప్రియ కమలం విరిసినదీ లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిడి..ఆ ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని .. ఆ ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని .. ఆ అమృతకలశముగా ప్రతినిమిషం అమృతకలశముగా ప్రతినిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినదీ.. రేయీ పగలూ కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నెలా నింగీ కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి ఈ రాగ చరితరగల మ్రుదురవళీ తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినదీ.. కన్నుల కొలనిడి..ఆ ఉదయ రవికిరణం మెరిసినదీ కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినదీ మనసు హిమగిరిగా మారినదీ కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని ఆ లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిడి..ఆ లలిత ప్రియ కమలం విరిసినదీ

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:50:06 AM IST
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్నూ నడపదు ముందుకు నిన్నూ నిరసన చూపకు నువ్వు ఏనాటికీ పక్కవారికి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా పక్కవారికి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదోయి నీవైపు మరువకు..

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:48:20 AM IST
< < Previous   Page: 78 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.