
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| నమ్మకు నమ్మకు ఈ రేయినీ..
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటీ
వెచ్చనైన ఊసులెన్నో రెచ్చ గొట్టు సీకటీ
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన సీకటీ
పొద్దుపొడుపేలేని చీకటే ఉండిపోనీ
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామ సిలకా సద్దుకుపోయే సీకటెనకా..
నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకూ
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు..అరె నమ్మకు నమ్మకు
నువ్వూ..నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్నూ నడపదు ముందుకు నిన్నూ
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారికి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా
పక్కవారికి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు..
నమ్మకు నమ్మకు..అరె నమ్మకు నమ్మకు
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
సీతకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
సీతకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కాద
మ..గసమ..దమద..నిదని
మమమమగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ
నమ్మకు నమ్మకు..అరె నమ్మకు నమ్మకు
ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:47:16 AM IST తరలిరాద తనే వసంతం !
తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాలకోసం
గగనాల దాకా అలసాగకుంటె
మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాలకోసం
వెన్నెల దీపం కొందరిదా..అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా..అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేనీ చల్లని గాలీ అందరికోసం అందునుకాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద !
తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాలకోసం
బ్రతుకున లేనీ శృతి కలదా.. ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేనీ శృతి కలదా.. ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కానీ కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదు కద !
తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాలకోసం
గగనాల దాకా అలసాగకుంటె
మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాలకోసం
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:45:45 AM IST చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్ఠం వస్తేనే కద గుండెబలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచైనా..చెడ్డైనా పంచుకోను నేలేనా
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది
గుండెల్లో సుడి తిరిగే కలత కధలూ
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!!
కోకిలలకు కొమ్మల్లో చెడబుట్టిన కాకిని అనీ
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకినీ
కోకిలలకు కొమ్మల్లో చెడబుట్టిన కాకిని అనీ
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకినీ
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!
పాత బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచిపొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం..విరబూసే ఆనందం
తేటి తేనె పాట..పంచె వన్నెల విరి తోట
బ్రతుకు పుస్తకం లో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటా
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటా
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!
ఏటిపొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడూ
కంటి నీటి కుంభవృష్ఠి జడిలో ఇంకొకడు
మంచి వంచను మోడై గోడు పెట్టువాడొకడు
వీరి గొంతులో కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్త కోకిలా
కళ్ళు ఉన్న కబోదిలా..చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడా..కరువాయెను నా స్ఠానం
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!
అసహాయతలో దడ దడలాదే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారూ
దిక్కూ మొక్కూ తెలియని దీనుల యదార్ధ జీవన స్వరాలూ
నిలువునా నన్ను కమ్ముతున్నాయి..శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి..ఈ అపశృతి సరిచెయ్యాలి
జనగీతిని వద్దనుకుంటూ..నాకు నేనె పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను..కలవరింత కోరను నేనూ
నేను సైతం విశవీణకు తంత్రినై మూర్ఛనలు పోతానూ
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తానూ
నేనుసైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తానూ
నేను సైతం .. నేను సైతం బ్రతుకు బాటకు గొంతుకలిపేనూ
నేను సైతం .. నేను సైతం బ్రతుకు బాటకు గొంతుకలిపేనూ
సకలజగతికి శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనం లో నందనం వికసించు దాకా
పాత పాటను పాడలేనూ..కొత్త బాటను వీడి పోనూ
పాత పాటను పాడలేనూ..కొత్త బాటను వీడి పోనూ
నేను సైతం .. నేను సైతం.. నేను సైతం .. నేను సైతం
నేను సైతం .. నేను సైతం.. నేను సైతం .. నేను సైతం
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:44:59 AM IST వేదం అణువణువున నాదం !
గా..మా..నీ..
గ మ గ స .. మ గ స .. గ స .. నీ సా ని ద మ గ..
ద మ గ..మ గ ..స రీ సా నీ..గ మ గా నీ ..
గ మ గ మ దా మ..ద నీ ద ని సా ని రీ..
వేదం అణువణువున నాదం
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసా నందీ రాగలై
వేదం..వేదం అణువణువున నాదం
ఆ..
సాగరసంగమమే ఒక యోగం
నిరిసని దమగా.. గగ మద రిసనీ.. నిరిసని దమగా మదనిసరీ స గా రి మ గ ద మ గ ని సా నిదని సమదగ రిగస
సాగరసంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆమధనం ఒక అమృతగీతం జీవితమే చిర నర్తనమాయే
పదమలు తామే పేదవులు కాగా..
పదమలు తామే పేదవులు కాగా..
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం !
మాతృ దేవో భవా..
పితృ దేవో భవా..
ఆచార్య దేవో భవా..ఆచార్య దేవో భవా..
అతిధి దేవో భవా..అతిధి దేవో భవా !
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురు పాయె కుదురైన నాట్యం
గురుదక్షిణైపోయే జీవం
నటరాజ పాదాన తల వాల్చనా
నయనాభిషేకాన తరియించనా
నటరాజ పాదాన తల వాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమమూ..రసమయ..
సుగమము రసమయ నిగమము భరతము గానా
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసా నందీ రాగలై
వేదం..వేదం అణువణువున నాదం
జయంతి పే సుకృతినొ రస సిద్దా కవీశ్వరాః
నాస్తితేషామ్యషకాఃయే
చరామరణజం..భయం..నాస్తి
జరా మరణజం..భయం..నాస్తి
జరా మరణజం..భయం !
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:44:25 AM IST వాగర్ధావివ సంపృప్తౌ
వాగర్ధప్రతిపక్తయే
జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం
వందే పార్వతీప రమేశ్వరం
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ.. గానములో ఆ.. గమకములో ఆ..
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ..ఆ..ఆ
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం
భరతమైన నాట్యం .. ఆ..బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
భరతమైన నాట్యం .. ఆ.. బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర..
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:42:38 AM IST ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా
ఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!
పంచభూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచభూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా.గా.మ.దనిస..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ..
దషోప నిషక్తులై ఇల వెలయా
ఓం.. ఓం .. ఓం నమఃశివాయా..
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా
ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయ లయనిలయా
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:41:53 AM IST వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
మువ్వా గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..మా ముద్దూ గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే
ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే..
మా ముద్దూ గోవిందుడే !
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:41:13 AM IST మౌనమేల నోయీ..
మౌనమేల నోయీ ఈ మరపు రాని రేయి
మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో..
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
పలికే పెదవీ వణికింది ఎందుకో..
వణికే పెదవీ వెనకాల ఏమిటొ..
కలిసే మనసులా..విరిసే వయసులా
కలిసే మనసులా..విరిసే వయసులా
నీలి నీలి ఊసులూ లేత గాలి బాసలూ
ఏమేమో అడిగినా..
మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి
హిమమే కురిసే చందమామ కౌగిటా..
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా..
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా..
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా..
కన్నె ఈడు ఉలుకులూ కంటి పాప కబురులూ..
ఎంతెంతో తెలిసినా..
మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి...
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో..
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:39:09 AM IST నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తారలా..
ఆశకున్న విరిదారులా..
ఈ సమయం ఉషోదయమై..మా హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖలు రాసే మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా..
మనసులోని మరు దివ్వెలా..
ఈ సమయం రసోదయమై..మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:37:28 AM IST రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ !
రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
సూరీడు చల్లారు నీ చూపూ..చలిగాలిలా వీచే నావైపూ
పరుగెత్తే పరువం లోనా..పడగెత్తే ప్రణయం లాగ
సాగిపోవాలి జతగా
నీకంటిలో ఉన్న చలిమంటా..తొలిగంట కొట్టింది నా కంట
పయనించే గగనం లోనా..చలి తేరుకు పవనం లాగా..
జల్లు రావాలి వడిగా
ఈ వడిలో ఉరవడిలో ముడివడి పోవాలీ
కాలమెంత దూరమో కలిసి చూడగా
రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
సందెల్లో మందార బొట్టుందీ..అందాల ముద్దిచ్చి అంటిందీ
సెలయేటి అలజడిలోనా..చెలరేగే అల్లరిలాగా
ఊగిపోవాలి కలిసీ
సిగ్గుల్లో చిగురంత ఎరుపుందీ..వద్దుల్లో వరసైన వలపుందీ
నాజూకు నడకల్లోనా..నలిగేటి మొలకల్లాగా
ఆవిరవ్వాలి అలిసీ
ఆవిరో నావిరులే విర విరలాడాలీ
కౌగిలింత ఇల్లుగా కలిసి చేరగా !
హ హ రాగమో అనురాగమో..ల ల ల గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ !
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:36:28 AM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|