
|
|

General Forum: Offbeat n Jokes | !!! rachchabamDa - 9 !!! navvula tIram navama parvam.!!! | |
| pratinamaskaaram
i^mevaro paatammaayi/aanTi kaani andarini krottammaayiga namminchaTaaniki prayatnisto^ndi
Posted by: Mr. Bhaskar At: 27, Apr 2011 1:12:08 AM IST tel # namaskaaram
Posted by: Ms. neela c At: 25, Apr 2011 2:56:56 AM IST okka mukka artham kaavatledu ee blog lo..
Posted by: Mr. Sri Sri At: 1, Feb 2011 4:32:22 AM IST hi
Posted by: priyanka varma At: 21, Jan 2011 2:53:37 AM IST aMdarakI aaMglanUtanasaMvatsara SubhAkaaMxalu
Saastri
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 1, Jan 2011 7:23:05 AM IST namaste^ Saastrigaariki paadaabhivandanalato........ippuDe^ rachchabanDaki vachchaanu mi^ru po^shTu che^sinavanni chaduvutunnaanu
baammagaaru mi^ru kuSalame^ kadaa ?
Posted by: Mr. Bhaskar At: 13, Dec 2010 1:09:17 AM IST halO
aMdarakI abhinaMdanalu
monna kurisina vaanaku nEla iMkaa taDi aaralEdu
appuDE maLLI tufaanuTa
ippuDu raaShTraM chaalaa kliShTaparistitulalOvuMdi
EmiTO Iakaala varShaalu ! !
mitrulu rachchabaMDaku vastunnaarani aaSistU
Saastri
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 11, Dec 2010 8:32:44 AM IST కమల్‌హాన్, త్రిషల ‘మన్మథబాణం’కి హాలీవుడ్ మూలం?
-ఎస్
December 9th, 2010
కమల్‌హాసన్, త్రిష కాంబినేషన్‌లో ‘మన్మథబాణం’ (తమిళంలో మన్మధన్ అంబు) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో కమల్‌హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషిస్తున్నారు. మదన్‌గోపాల్ (మాధవన్)... అంబుజం (త్రిష)తో గాఢమైన ప్రేమలో ఉంటాడు. అయితే ఆమె ఎదురుగా నిలబడి మనస్సులోని ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయటానికి భయపడుతుంటాడు. అలాగే ఓ విచిత్రమైన సంఘటనతో వీరిద్దరి మధ్య ప్రేమ కట్ అవుతుంది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల అనంతరం గోపాల్ ఈమె ఓ సినీనటిగా ఎదిగిందని తెలుసుకుంటాడు. అస్సలు ఆమె తనతో ప్రేమలోఉందో లేదో తెలుసుకున్న తర్వాతే ఐలవ్ యూ చెబుదామని డిసైడ్ అవుతాడు.
అందుకు ఓ డిటెక్టివ్ సహాయం తీసుకోమని అతని స్నేహితుడు రమేష్ అరవింద్ సలహా ఇస్తాడు. అప్పుడువారు ఆర్మీ మాజీ మేనేజర్ ఆర్.మన్నార్ (కమల్‌హాసన్)ని కలుస్తారు. ఆయన ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌గా పనిచేస్తుంటాడు. అక్కడ నుంచి కమల్‌హాసన్... త్రిషను షూటింగ్‌లలో ఫాలో చేస్తూ స్నేహం చేస్తాడు. ఆ విషయం కమల్‌హాసన్ ప్రేయసి దీప (సంగీత)కి తెలియక అపార్థాలు చోటు చేసుకుంటాయి. అందులోనూ ఆమె అంబుజానికి స్నేహితురాలుకూడా. ఈ చిక్కుముడులన్నింటినీ మాధవన్ ఎలా విడదీసి తన ప్రేమను ఎలా గెలచుకున్నాడనేది కామెడీ ఆఫ్ ఎర్రర్ ఫార్మెట్‌లో సాగుతుంది. ఇక తమిళ హీరో సూర్య ఈ చిత్రంలో త్రిష సరసన ఓ పాటలో కనపడతాడు. అలాగే త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఇందులో ముఖ్యమైన పాత్రను పోషించింది. కమల్‌హాన్, ఆయన ఫేవరెట్ రైటర్ క్రేజీ మోహన్ కలిసి ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ప్రేరణ... 1998లో వచ్చిన అమెరికన్ కామెడీ చిత్రం ‘దేర్ ఈజ్ సమ్ థింగ్ ఎబౌట్ మేరీ’ అనే చిత్రం అని వినపడుతోంది. ఫెరల్లీ బ్రదర్స్ రూపొందించిన ఈ చిత్రంలో బెన్ స్టెల్లర్ పాత్రను మాధవన్ చేస్తుంటే... కెమరాన్ డియాజ్ పోషించిన మేరీ పాత్రను త్రిష చేస్తోంది. అయితే ‘దేర్ ఈజ్ సమ్ థింగ్ ఎబౌట్ మేరీ’ లో పాత్ర డాక్టరుగా మారుతుంది. ఇక్కడ త్రిష నటిగా కన్పిస్తుంది. మ్యాట్ దిల్లాన్ పోషించిన ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రను కమల్ చేస్తున్నాడు. అయితే కేవలం ప్లాట్‌ని మాత్రమే తీసుకుని ఇండియన్ నేటివిటికీ అనుగుణంగా కథను మార్చి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘దేర్ ఈజ్ సమ్ థింగ్ ఎబౌట్ మేరీ’ చిత్రం ఆధారంగా హిందీలో ఇప్పటికే ‘దీవానా హుహే పాగల్’ (2005)లో ప్రీమేక్ చేసారు. అక్షయ్‌కుమార్, సునీల్ షెట్టి, షాహిద్‌కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వర్కవుట్ కాలేదు. అయితే కమల్‌హాసన్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన దశావతారం, తెనాలి, పంచతంత్ర వంటి చిత్రాలు హిట్ అయ్యాయి కాబట్టి ఈ చిత్రం మంచి నవ్వులే పంచుతుంది అని ఆశించవచ్చు. రచన: వెనె్నలకంటి రచన, ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
============================
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 10:42:39 AM IST విద్యుత్ కొరతకు సౌరశక్తే ప్రత్యామ్నాయం
December 10th, 2010
హైదరాబాద్, డిసెంబర్ 9: రానున్న రోజుల్లో దేశీయ విద్యుత్ అవసరాలను తీర్చడంలో సౌరశక్తి అగ్రగామిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమల సంఘాల సమాఖ్య (్ఫ్యప్సీ) అధ్యక్షుడు శేఖర్ అగర్వాల్ తెలిపారు. గురువారం ఇక్కడ ఫ్యాప్సీలో సౌరశక్తి-ప్రపంచదేశాల్లో ఈ రంగంలో వస్తున్న మార్పులు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో విద్యుత్ సామర్ధ్యం 1,46,753 మెగావాట్లు ఉందన్నారు. ఇందులో 54 శాతం బొగ్గు, 25 శాతం హైడ్రో, 8 శాతం రెన్యువబుల్ ఎనర్జీ అని చెప్పారు. మిగిలిన భాగం సహజవాయవు, అణు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. రాన్ను రోజుల్లో మొత్తం 11 శాతం విద్యుత్ కొరత తలెత్తుతుందన్నారు. పీక్ వేళల్లో విద్యుత్ కొరత 15 శాతం వరకు ఉంటుందని చెప్పారు. వచ్చే పది సంవత్సరాల్లో పది వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 24 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయన్నారు. దేశీయంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు సౌరశక్తి మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. సౌరశక్తిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. సౌరశక్తి ఉచితమని, కాని టెక్నాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సోలారియా కార్పొరేషన్ చైర్మన్ డాన్ సుగర్ మాట్లాడుతూ సౌరశక్తి ఉపయోగాలను వివరించారు. ఈ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, పరిశ్రమలను నెలకొల్పడం వల్ల వచ్చే ప్రయోజనాలు, ప్రగతిని వివరించారు. విద్యుత్ రంగ నిపుణులు టిఎల్ శంకర్ మాట్లాడుతూ దేశంలో విద్యుత్ సమస్యలకు సౌరశక్తి ఉత్పత్తి చక్కటి పరిష్కారమన్నారు. ఈ సమావేశంలో సోలారియా కార్పొరేషన్ అధ్యక్షుడు సువి శర్మ, సోలారియా ఇండియా సంస్థ ఎండి సుబ్బారావు త్రిపురనేని, ఫ్యాప్సీ సెక్రటరీ జనరల్ ఎంవి రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దేవేంద్ర సురానా తదితరులు ప్రసంగించారు.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 10:38:36 AM IST తీరం దాటిన వాయుగుండం,కోస్తాకు భారీ వర్ష సూచన
గురు వారం, డిసెంబర్ 09, 2010 , 5:51 [IST]
విశాఖపట్నం, డిసెంబరు 8, ప్రభాతవార్త: బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుం డంగా మారి తీరం దాటినట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకొశాలున్నట్టు ఆయన తెలిపారు. వాయుగుండం ఒంగోలు వద్ద తీరం దాటినట్టు అధికారి తెలిపారు. శనివారం బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా, అనంత రం వాయుగుండంగా మారింది. ఉత్తర తమిళనాడు నుంచి నైరుతి బంగాళాఖాతం దక్షిణ కోస్తా వైపు అల్పపీడనం పయనించి బంగాళా ఖాతంలో బలప డింది. ఒంగోలుకు ఆగ్నేయ దిశగా 250 కిలోమీ టర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, ఒంగోలు, కావలి దగ్గరలో వాయుగుండం బుధవారం మధ్యాహ్నం తీరం దాటింది. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు మరింతగా బలపడినట్టు ఆయన తెలిపారు. కోస్తా అంతటా వర్షాలు కురియనున్నట్టు ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు, తెలంగాణలో కొన్ని ప్రాం తాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు ఆయన తెలిపారు.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 10:25:15 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|