Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
జోకులేసుకుందాం రా !
< < Previous   Page: 8 of 12   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
kiDnaap jOk chaalaa baagundi mEDaM.. :)

Posted by: Mr. sathwik D At: 12, Jan 2010 11:18:20 PM IST
1. ఆ కంపెనీలో బాస్ ను ఆ రోజు ఉదయం ఇంటి నుండి కిడ్నాప్ చేసారన్న వార్త దావానలంగా వ్యాపించింది. ఆఫీసులో అందరూ హడావిడిగా తిరుగుతుండడం చూసి రేపో మాపో రిటైర్మెంటుకు దగ్గరలో వున్న ఒక వృద్ధ క్లర్క్ తన పక్కవాడిని అడిగాడు " ఏమిటి సంగతి " అని. "మన బాస్ మన్మధ రావును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చెసారు. పది కోట్లు ఇవ్వకపోతే పెట్రోల్ పొసి తగలెట్టేస్తామని బెదిరిస్తున్నారు" చెప్పాడు పక్క టేబుల్ క్లర్క్. "అయితే మనవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు?" అడిగాడు వృద్ధ క్లర్క్. "ప్రతీ వారూ చందాలు వేసుకుంటున్నారు, మొత్తం అంతా కలెక్ట్ అయ్యాక ఒకే సారి ఆ కిడ్నాపర్లకు అందిస్తారట" "ఒక్కొక్కరు ఎంత వేసుకుంటున్నారో చెబితే నా వంతు కూడా ఇస్తాను" అడిగాడు వృద్ధ క్లర్క్. "తలా ఒక లీటరు" అసలు సంగతి తాపీగా చెప్పాడు పక్క టేబుల్ క్లర్క్. 2. లల్లూ ప్రసాద్ యాదవ్ భారత ప్రధాన మంత్రిగా 10-05-2014 న ప్రమాణ స్వీకారం చేసాక ఈ క్రింది ఉత్తర్వులను జారీ చేసారు: 1. జాతీయ జంతువు : గేదె. 2. జాతీయ క్రీడ: గేదె పందాలు. 3. జాతీయ దుస్తులు: ధోతీ మరియు కుర్తా. 4. జాతీయ పానీయం : గేదె పాలు. 5. జాతీయ భోజన పధార్ధం : ఎండు గడ్డి 6. జాతీయ సంపద: ఎ కె 48 7. జాతీయ స్లోగన్ :. హం దో, హమారే డజన్ (మేము ఇద్దరం, మాకు పన్నెండు మంది) 8. టాడా లోనికి కొత్తగా చేర్చబడిన శిక్షార్హమైన చర్య: కుటుంబ నియంత్రణ. 9. జాతీయ బండి : గేదె బండి. 10. జాతీయ సందేశం : జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా పి ఎం లాలూ ( సమోసా లో బంగాళ దుంప వున్నంత వరకు లాలూయే ప్రధానిగా వుంటారు.)

Posted by: Mrs. Kanaka Durga At: 12, Jan 2010 12:28:04 PM IST
మీరు కనిపెట్టిన ఈ మందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, ఏమిటి ఈ మందు యొక్క విశేషం అడిగాడు విలేఖరి. ఈ మందును సిలైన్ లో కలిపి ఎక్కించుకుంటే ఇక ఏ భోజనం అవసరం రాదు. పది పదిహేను రోజుల పాటు అన్న పానీయాలు మానేసినా లేచి నిలబడగలం, బైకులపై తిరగగలం.ఆవేశం గా అరవగలం. ప్రపంచవ్యాప్తం గా నిరాహార దీక్షలు చేసేవారికి ఇది ఎంతో ఉపయోగం గా వుంటుంది. ట్రైల్ బేసిస్ మీద ఈ మధ్యే కొంతమందికి ఇచ్చాం, సూపర్ సక్సెస్ అయ్యింది" చెప్పాడు సైంటిస్టు.

Posted by: Mr. yadhaardhavaadi yadhaardhavaadi At: 12, Jan 2010 11:38:57 AM IST
1. “మా టీచర్ నేనే వర్కు చెయ్యకపోయినా అసలు నన్నేమీ అనదు తెలుసా ?” గర్వంగా చెపుకున్నాడు బంటి. “ అవును నిజమే! ఎద్దులకు ఎంత చెప్పినా లాభం వుండదు కదా అందుకనే మానేసి వుంటుంది” చురక అంటించాడు చింటూ. 2."డాక్టర్ గారూ అర్జంటుగా నాకు రేబీస్ ఇంజక్షను చెయ్యండి" గాభరాగా అరుచుకుంటూ వచ్చాడు పిచ్చేశ్వరరావు. “పిచ్చి కుక్క కరిచిందా?" అడిగాడు డాక్టర్ అయోమయం “కాదు డాక్టర్, అంతకంటే భయంకరమైన జంతువు అదే మా ఆవిడ కరిచింది” అసలు సంగతి చెప్పాడు పిచ్చేశ్వరరావు. 3. ఇదేమిటీ పార్టీ అధ్యక్షుడు గారు ఒకే అంశంపై రెండు స్టెట్ మెంట్లు పంచారు? అడిగాడు ఒక విలేఖరి. "సీమాంధ్ర వాళ్లకొకటి, తెలంగాణా ప్రాంతం వాళ్ళకు మరొకటీ ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు.నువ్వు ఏ ప్రాంతం వాడివైతే ఆ స్టేట్ మెంట్ రాసుకో.ఎవ్వరినీ నొప్పించడం ఆయనకు ఇష్టం వుండదట" అసలు సంగతి చెప్పాడు మరొక విలేఖరి.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 11, Jan 2010 7:55:59 PM IST
1. "స్వామీజీ, మా ఆయన నాతో రోజూ పోట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి కొడుతున్నాడు కూడా.ఎంత సహిస్తున్నా ఇక నా వల్ల కావడం లేదు. దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి "కన్నీళ్ళతొ ఆడిగింది అనసూయ. స్వామీ ఒక్క క్షణం ఆలోచించి ఒక బాటిల్ లో కొంత మంత్రించిన నీళ్ళు ఇచ్చారు. "దీనిని ఎలా వాడాలి స్వామీ" అని అడిగింది అనసూయ. "ఏముందీ, మీ ఆయన పోట్లాటకు దిగినప్పుడల్లా ఈ నీళ్ళు కొంచెం నోట్లో వేసుకొని నోరు గట్టిగా మూసేసుకో. ఆయన కోపం దానంతట అదే తగ్గిపోతుంది" చెప్పారు స్వామీజీ. 2. "ఈ సినిమా మీ మొదటి సినిమా అయినా దొంగ పాత్రలో చాలా బాగా లీనం అయి నటించారు "మెచ్చుకున్నాడు విలేఖరి. " నేను చేస్తున్న ఉద్యోగం నన్ను ఇంత బాగా నటించడానికి దోహద పడింది " చెప్పాడు గుర్నాధం. "ఒహో ! మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు ?" అడిగాడు విలేఖరి. " పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం" అసలు సంగతి చెప్పాడు గుర్నాధం.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 10, Jan 2010 3:03:52 PM IST
అటూ నేనే -- ఇటూ నేనే - నా పేరే ఊసరవెల్లి 1. ఒక రాజకీయ నాయకుడిని ఒక టి వి ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. "సార్,తెలంగణాపై మీ వైఖరి ఏమిటి" రాజకీయనాయకుడు: మా వైఖరి ఇంతకు ముందు రెండు సార్లు స్పష్టం చేసాము. 2004 లో మరియు 2009 లో. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు సార్లు లేఖ కూడా రాసాము. విలేఖరి: రెండు సార్లు మీ వైఖరి భిన్నంగా వుంది కదా రాజకీయనాయకుడు:దానికేముంది, తెలంగణా ప్రజల వైఖరి కూడా భిన్నంగా వుంది కదా. విలేఖరి:మరి ఇప్పుడు మీ వైఖరి ఏమిటి? రాజకీయనాయకుడు:అది అడిగే వారు ఏ ప్రాంతం వారన్న దాని బట్టి ఆధారపడి వుంటుంది, ఇంతకూ మీరు ఎక్కడి వారు ? విలేఖరి: (నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఈయన గారు తిరిగి నన్నే ప్రశ్నలు వేస్తున్నారేమిట్రా అనుకొని) నేను తెలంగణా కు చెందిన వాడినిసార్. రాజకీయనాయకుడు:అయితే రాసుకోండి. తెలంగణా ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలి. వారి పోరాటం ఈనాటిది కదు, యాభై ఏళ్లనాటిది.వారికి ప్రత్యేక రాష్ట్రం వెంటనే ఇవ్వాలి. అందుకై నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.జై తెలంగణా ఇంతలో రాజకియనాయకుడు గారి సెల్లు మోగింది. ఒక పత్రికా విలేఖరి విజయవాడ నుండి ఫోన్ చెసి ఇదే ప్రశ్న అడగగా " రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా వుండాలన్నదే నా అభిమతం. నేను సమైక్యాంధ్రా వాదిని. సమైక్యాంధ్రా కోసం నేను ఆత్మ త్యాగానికైనా సిద్ధం. సమైక్యాంధ్రా కోసం రేపటి నుండి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలో పర్యటన ప్రారంభిస్తున్నాను. అని చెప్పి ఫోన్ కట్ చేసాడు. విలేఖరి: మరి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగణా లో మీ పర్యటన ఎప్పుడు సార్. రాజకీయనాయకుడు: సీమాంధ్ర పర్యటన పూర్తవగానే తెలంగణా పర్యటన ప్రారంభమవుతుంది. అమరణ దీక్ష కూడా ప్రారంభిస్తున్నాను. విలేఖరి: ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ దేశం నలుమూలల నుండి డిమాండ్స్ వెల్లువగా వస్తున్నాయి కదా మరి మీ అభిప్రాయం ఏమిటి ? రాజకీయనాయకుడు : ఆయా రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు వున్నాయనే దాని పై మా అభిప్రాయం ఆధారపడి వుంటుంది.ఇప్పుడు మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి కదా ఒకవేళ ప్రభుత్వాలు మారిపోతే వెంటనే మా వైఖరి కూడా మారిపోతుంది. విలేఖరి: మీ వైఖరి చాలా విచిత్రంగా వుంది సార్? రాజకీయనాయకుడు: విచిత్రం కాదూ పాడు కాదు. రెండు ప్రదేశాలలో నా పార్టీని కాపాడుకోవాలి కదా అందుకే ఈ జోడు గుర్రాల స్వారి.అప్పటికప్పుడు అందరికీ సర్ధి చెప్పదానికి వెయ్యి అబద్ధాలైనా ఆడక తప్పదు. అయినా మీ పిచ్చి గాని గంటకొక మాట మార్చే మా వంటి రాజకీయ నాయకులకు వైఖరి స్పష్టం చేయమనడం ఏమిటయ్యా? మేమెప్పుడైనా అన్న మాట మీద నిలబడ్డామా ఇప్పటి వరకు? మేము చెప్పిందే వేదం.మేము ఏమంటే అదే రాజ్యాంగం.ప్రజల నుండి రియాక్షన్ రాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మేమలా అనలేదని దిద్దుబాటు ప్రకటన ఇచ్చేస్తాం. ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ సమాప్తం ఇదంతా విన్న ఆ విలేఖరి కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయాడు. (కేవలం మనసారా నవ్వుకోవడానికి మాత్రమే ఈ కధ ఉద్దేశించినది. ఎవ్వరినీ నొప్పించడం నా అభిమతం కాదు.)

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 9, Jan 2010 10:04:04 AM IST
ఆంధ్రా ఆస్కార్ అవార్డులు 2009 : 1. ఉత్తమ నటుడు : కె సి ఆర్ 2. ఉత్తమ సైలెంట్ సైడ్ నటుడు : చంద్ర బాబు నాయుడు 3. ఉత్తమ ఓవెర్ యాక్షన్ చేసిన నటుడు :లగడపాటి 4. ఉత్తమ కమెడియన్ : చిరంజీవి 5. ఉత్తమ సపోర్టింగ్ నటుడు : అల్లు అరవింద్ 6. ఉత్తమ డబ్బింగ్ అర్టిస్ట్ : చిదంబరం 7. ఉత్తమ ప్రేక్షకుడు : రోశయ్య 8. ఉత్తమ కధ, స్క్రీన్ ప్లే రచయిత మరియు దర్శకుడు(రాలు) : సోనియా గాంధి 9.ఉత్తమ డైలాగ్ రచయిత : పరకాల ప్రభాకర్ 10.ఉత్తమ నటి : విజయ శాంతి 11.ఉత్తమ మహిళా కమేడియన్ : రోజా 12.ఉత్తమ మేకప్ మెన్ : చేగొండి హరే రామ జోగయ్య 13.ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత : దేవెందర్ గౌడ్ 14.ఉత్తమ ఫయిట్ మాస్టర్ : నాగం జనార్ధన రెడ్డి 15.స్పెషల్ జ్యూరీ అవార్డులు : కేకే,కాకా మరియు వి హెచ్. హనుమంతరావు. 16. ఆల్ టైం లెజెండ్ : కీ:శే:డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఇక ఒక కొత్త అవార్డు : ఉత్తమ శృంగార నటుడు : ఎన్. డి.తివారీ ( ఈ కధనం కేవలం నవ్వుకోవడానికి తప్ప ఎవ్వరినీ కించపరచడానికి ఉద్దేశించినది కాదని మనవి చేస్తున్నాను. ఒక వేళ ఎవ్వరికైనా బాధ కలిగినట్లయితే వారికి నా క్షమార్పణలు.)

Posted by: Mrs. Kanaka Durga At: 8, Jan 2010 4:46:08 PM IST
1. ఒలింపిక్స్ లో చాలా దశాబ్దాల తర్వాత ఒక భారతీయ మహిళ అందులోనూ ఒక పంజాబీ మహిళ పాల్గొనేందుకు అర్హత సంపాదించింది. అందులో ఎలాగైనా గెలవాలన్న తపనతో ఆమె అహర్నిశలు కృషి చేసింది.ఎట్టకేలకు పోటీ ప్రారంభమయ్యింది. పదిమంది స్విమ్మర్లలో మన సర్దారిణీ ఆఖరు స్థానం లో వచ్చింది. బహుమతుల ప్రదానోత్సవం తర్వాత ఎందుకు ఓడిపోయారని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు " నేనైతే చాలా కష్టపడ్డాను కానీ నా తోటి వారంతా స్విమ్మింగ్ చేసేటప్పుడు చేతులను వుపయోగించారు." గాఢంగా నిట్టూర్పు విడుస్తూ చెప్పిందామె. 2. "చాలా కాలం అంటు పని, వంట పని , బట్టలు ఉతుకోవడం లాంటి పనులతో వేగలేక చివరకు పెళ్ళి చేసుకున్నాను" అన్నాడు మహేశ్. " నేనూ అదే కారణం గా విడాకులు తీసుకున్నాను" తాపీగా చెప్పాడు సురేశ్. 3.చీకటి జోకు: "రేపు మా ఇంటికి పొద్దున ఒకసారి రా? ఇంపార్టెంట్ లెటర్ ఒకటి డిక్టేషన్ ఇవ్వాలి" సెక్రెటరీతో చెప్పాడు ఆఫీసర్ సుందరం. " సరే సార్ " అంది సెక్రెటరీ కోణంగి. మర్నాడు: "సార్! నా ప్రమోషన్ ఖాయమే కదా " గోముగా అడిగింది కోణంగి. " ఓ ఎస్" బట్టలు వేసుకుంటూ చెప్పాడు సుందరం.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 8, Jan 2010 3:01:05 PM IST
'magaaLLakI ADaaLLakI maatramE eyiD&s sOkutuMdi baayyaa' ani samaraM cheppuMTaaDu.

Posted by: Mr. Subba Rao A At: 8, Jan 2010 1:53:58 AM IST
muddu dvaaraa eyiD&s saMkramistuMdaa..? ani Daak&Tar samaraM gaarni lagaDapaaTi raajagOpaal aDigaaTTa...... :)

Posted by: Raja Pulakesi At: 8, Jan 2010 1:10:11 AM IST
< < Previous   Page: 8 of 12   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.