
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచి పోబోకుమా..మమత నీవే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనె నే వేచి వుంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే..వెల్లువౌతానులే
హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగి
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచి పోబోకుమా.. విరహమైపోకుమా
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
పున్నమి నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే..ఆ తీరాలు చేరాలిలే
మౌనమై వెలిసి గానమై పిలిచి
కలలతో అలిసి ఎగనమై ఎగసి
ఈ ప్రేమ..నా ప్రేమ..తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా..ప్రేమ మనమే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచి పోబోకుమా..మమత నీవే సుమా
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:35:36 AM IST మందారం .. ముద్దు మందారం !
మందారం .. ముద్ద మందారం !!
ముద్దుకే ముద్దొచ్చే .. మువ్వకే నవ్వొచ్చే
ముద్దుకే ముద్దొచ్చే మందారం.. మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం.. మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
అడుగులా అష్టపదులా
నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా.. నడకలా జీవనదులా
పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్ళు
విరివాలు జడకుచ్చుల సందళ్ళు
కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి
ముద్దుకే ముద్దోచ్చే మందారం..మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
పలుకులా రాచిలకలా
అలకలా ప్రేమ మోలకలా
పలుకులా రాచిలకలా.. అలకలా ప్రేమ మోలకలా
మలిసంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాలు వడగళ్ళు
మల్లెపూవా కాదు మరుల మారాణి
బంతిపూవా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం.. మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం.. మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:34:59 AM IST అలివేణీ ఆణిముత్యమా..
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి
అలివేణీ ఆణిముత్యమా..నీ కంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివానా లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలో
అలివేణీ ఆణిముత్యమా..నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివానా లేత ఎండలో జాజి మల్లీ పూల దండలో
అలివేణీ ఆణి ముత్యమా..
కుదురైన బొమ్మకీ..కులుకు మల్లె రెమ్మకీ
కుదురైన బొమ్మకీ..కులుకు మల్లె రెమ్మకీ
నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా..
వద్దంటే ఒట్టుగా !
అందాల అమ్మకీ..కుందనాల కొమ్మకీ
అందాల అమ్మకీ..కుందనాల కొమ్మకీ
అడుగు మడుగులొత్తనా మెత్తగా..
అవునంటే తప్పుగా !
అలివేణీ ఆణి ముత్యమా..నా పరువాల ప్రాణ ముత్యమా
పొగడలేని ప్రేమకీ..పొన్న చెట్టు నీడకీ
పొగడలేని ప్రేమకీ..పొన్న చెట్టు నీడకీ
పొగడ దండలల్లుకోనా పూజగా..
పులకింతల పూజగా !
తొలి జన్మల నోముకీ..దొర నవ్వుల సామికీ
తొలి జన్మల నోముకీ..దొర నవ్వుల సామికీ
చెలిమై నేనుండి పోనా చల్లగా..
మరు మల్లెలు చల్లగా !
అలివేణీ ఆణిముత్యమా..నీ కంట నీటి ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివానా లేత ఎండలో జాజి మల్లీ పూల గుండెలో..
అలివేణీ ఆణిముత్యమా..
అలివేణీ ఆణిముత్యమా..
ముద్దు మందారం-ముద్ద మందారం
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:33:36 AM IST మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాలా
ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కా నవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాలా
మొగ్గ తుంచుకుంటె మొగమాటాలా
బుగ్గ దాచుకుంటె బులపాటాలా
దప్పికంటె తీర్చటానికిన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వె గోరింకా
తోడుగుండిపోవె కంటి నీరింకా
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేరులే ఇంకా
మిన్నేటి సూరీడు .. ల ల ల లా
మిన్నేటి సూరీడు .. ల ల ల లా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:31:40 AM IST సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో.. ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
కన్యాకుమరి నీ పదములు నేనే
ఆ..ఆ..ఆ..ఆ
కన్యాకుమరి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారీ నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళా
అలిగిన నా తొలి అలకలు
నీలొ పులకలు రేపీ పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళా
సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళా
పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళా
సాగర సంగమమే
ప్రణయా సాగర సంగమమే
సాగర సంగమమే !
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:30:48 AM IST స గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమమా పపపా గమప గమగసా
నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మామ గాగ సాస నీస
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మురిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
తనన ననన ననన ననన తనన ననన నాన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
తనన ననన ననన ననన తనన ననన నాన
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ..ఆ..ఆ..ఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీజడలో గులాబి కని మల్లెల రవ్వడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా
నా పుత్తడి బొమ్మా !
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే !
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:29:56 AM IST ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ !
మాటే మంత్రమూ
మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రమూ.. మనసే బంధమూ
నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సం యోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రమూ..మనసే బంధమూ
నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో
మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం !
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:29:15 AM IST లిపి లేని కంటి బాసా
తెలిపింది చిలిపి ఆశా
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా.. ఇలా
చదవనీ.. నీ లేఖని.. ప్రణయ రేఖనీ !
బదులైన లేని లేఖా
బ్రతుకైన ప్రేమ లేఖా
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా.. ఇలా
రాయనీ.. నా లేఖని.. ప్రణయ రేఖనీ !
లిపి లేని కంటి బాసా
తెలిపింది చిలిపి ఆశా
అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉందీ వేదన తానై విదియ నాటి జాబిలి కోసం
వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
వెదుకుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాసా
తెలిసింది చిలిపి ఆశా
అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకునీ
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకునీ
నీ కంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడపదాట లేకా నన్నే గడియవేసుకున్నాను
ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖా
బ్రతుకైన ప్రేమ లేఖా
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా.. ఇలా
రాయనీ.. నీ లేఖని.. ప్రణయ రేఖనీ !
లిపి లేని కంటి బాసా
తెలిసింది చిలిపి ఆశా
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:27:48 AM IST శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజా
మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి.. మిము వరించి.. మీ గురించి
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో.. భక్తితో.. అనురక్తితో
సాయంగల విన్నపములూ !
సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన..
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా ..ప్రేమ లేఖ !
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ
ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకూ
ఎంతటి మగధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండీ.. చప్పున బదులివ్వండి !
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ
తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే.. ఆహ్ అబ్బా !
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే.. ఆహ్ ఆహ్ !
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండీ.. ఇప్పుడే బదులివ్వండి !
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:26:55 AM IST మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
ఏమంత అందాలు కలవనీ.. వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి వుంది నీకనీ.. మురిసేను నిన్ను తలచీ
చదువా పదవా ఏముంది నీకు
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శృతి మించకే నీవు మనసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
ఏనోము నోచావు నీవనీ.. దొరికేను ఆ ప్రేమ ఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ.. అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకంది రాడు
కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:26:20 AM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|