
|
|

General Forum: Offbeat n Jokes | !!! rachchabamDa - 9 !!! navvula tIram navama parvam.!!! | |
| rachchabaMDa mitrulaMdarakI halO halO !!
pUrvakaalaMlO rachchabaMDamIdaku graamastulu vachchi, vaartalu cheppukunEvaaruTa.
kanuka sahasraM pUrti avaDaaniki nEnu kUDaa konni konni vaartalu pOsT chEstUvumTaa
mitrulu maLLI rachchabaMdaku vastaarani aaSistU
Saastri
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 10:22:25 AM IST మనం పీల్చి వదిలే గాలిలో.. వేసే అడుగులో కూడా శక్తి ఉందంటారు శాస్త్రవేత్తలు. వారి ప్రకారం మనం పీల్చి వదిలే గాలి ఒక వాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ప్రతి అడుగు 70 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి అయ్యే శక్తిని ఒడిసి పట్టుకోవటానికి- ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్లేజోఎలక్ట్రిక్ క్ట్రిస్టల్స్‌ను రూపొందించారు. వీటిని బూట్లలో అమరిస్తే- నడిచినప్పుడు ఏర్పడే కదలికల వల్ల ఈ క్రిస్టల్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఒక రోజులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా సెల్‌ఫోన్లను రీచార్జ్ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ ఒకటి ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది.
బ్రిటన్‌లో జరిగిన గ్లాస్టన్‌బరీ ఫెస్టివల్‌లో- ఆరెంజ్ పవర్ విలీస్ అనే బూట్లను విడుదల చేసింది. ఈ బూట్లను వేసుకొని నడిచినప్పుడు విడుదలయ్యే వేడిని అందులో ఉండే ప్రత్యేక పరికరాలు విద్యుత్‌గా మారుస్తాయి. వీటిని వేసుకొని పన్నెండు గంటలు నడిస్తే ఒక గంట సేపు సెల్‌ఫోన్‌ను చార్జి చేయొచ్చు. ఇలా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పాటు మానవ శరీరాల నుంచి వెలువడే వేడిని కూడా విద్యుత్‌గా మార్చటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలలో ఈ తరహా ప్రాజెక్టుల వల్ల లబ్ది ఉంటుందని వారు భావిస్తున్నారు. పారిస్‌లోని మెట్రో సబ్‌వేలో దీనికి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారు.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 1:26:16 AM IST రైతుకు కష్టం
(-మచిలీపట్నం) అతివృష్టి - అనావృష్టి వంతులేసుకుంటూ రైతును కాల్చుకు తింటున్నాయి. గత ఏడాది తీవ్ర వర్షాభావంతో జిల్లాలో కరవు పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ ఏడాది అతివృష్టి వల్ల రైతు కొంప కొల్లేరయింది. ఖరీఫ్‌సీజన్ ప్రారంభం నుంచి అవస్థలే తప్ప అన్నదాత ముఖంలో ఆనందం కానరాలేదు. కష్టాల మీద కష్టాలు రైతును కుంగదీశాయి.
మేలో సంభవించిన లైలా తుపాను మొదలుకుని ఇప్పటి వరకు ప్రతి నెల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొదట్లో నారుమళ్ళు మునిగిపోయి ఆ తరువాత నాట్లు తదనంతరం కోత కొచ్చిన వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. వీటికితోడు ఎండకు తెగులు (బ్యాక్టీరియా) కొన్ని చోట్ల రైతులను పీల్చి పిప్పిచేశాయి. జూన్, జులై నెలల్లో కురిసిన అధిక వర్షాలవల్ల నారుమళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్‌లో 97.8 మి.మీ సాధారణ వర్ష పాతంకు బదులు 129.1 మి.మీ వర్షపాతం నమోదయింది. జులైలో 210.6 మి.మీకు గాను 355.0 మి.మీ నమోదయింది.
దీంతో రెండుమూడు పర్యాయాలు నారుమళ్ళు పోయాల్సి వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలు వరి దుబ్బు చేయకుండా చేశాయి. ఆగస్టులో 212.8 మి.మీ కుగాను 278.9 మి.మీ వర్షం కురిసింది. సెప్టెంబర్‌లో మరింత అధికంగా 163.9 కి 327.1 మి.మీ వర్షపాతం నమోదయింది. అక్టోబరులోనూ అదే పరిస్థితి 162.7 కి 218.4 మి.మీ పడింది. నవంబర్‌లో 70.7 మి.మీకుగాను ఆ నెలలో కూడా 83.5 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షపాతాలు సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడినా అది పెరిగి పెద్ద కావడానికి ఉపకరించలేదు. అక్టోబరు 30 నుంచి నవంబర్ 3 వరకు కురిసిన వర్షాలు ఖరీఫ్ సాగు గతినే మార్చేశాయి. 23 సెం.మీ వర్షపాతాలు నమోదుతో చేతి కందాల్సిన పంట వాన పాలయింది. అదే సమయంలో సంభవించిన జల్ తుపాన్ ఈ నష్టానికి తోడయింది. వీటన్నింటినీ భరించి కష్టనష్టాలకు ఎదురొడ్డి కోతలు కోసి నూర్చుకునే సమయంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను నిండా ముంచేశాయి.
రైతుకు దక్కింది 10శాతమే...
ఈ ఏడాది 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 10 శాతం మాత్రమే నూర్పిళ్ళు పూర్తయ్యాయి. మిగిలిన పంటంతా పొలాల్లోనే ఉంది. మొత్తం 60 శాతం మేర కోతకోయగా ఇందులో పది శాతం నూర్పిళ్ళు పూర్తికాగా మిగిలిన 50 శాతంలో 20 శాతం కుప్పలు పడ్డాయి. 30 శాతం పనల మీద ఉంది. దాదాపు 2 లక్షల ఎకరాలు నీళల్లో మూడు రోజుల నుంచి నానుతోంది. కోత కోయాల్సిన పైరు 40 శాతం ఉంది. దీంట్లో 25 శాతం నేలకొరిగి పోయింది. దీంతో ఆ మిగిలిన 15 శాతం అనుమానాస్పదంగానే ఉంది. ఇప్పటికే గత వర్షాల వల్ల 55 వేల హెక్టార్లలో 50 శాతంకు పైబడి నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. ఈ వర్షాల వల్ల మరో మూడు లక్షల ఎకరాలు నీట మునిగి ఉంది. పంట దక్కే సూచనలు లేవు.
కోట్లలో నష్టం... వర్షాల వల్ల ముంపునకు గురైన పంట నష్టం దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. 3 లక్షల ఎకరాల్లో పంట నీట మునగగా నష్టం ఈ మేరకు ఉంటుందని రైతు నాయకులు భావిస్తున్నారు. పెట్టుబడుల రీత్యా 600 కోట్లు నష్టపోతుండగా కౌలు రైతులపై అదనంగా మరో 400 కోట్ల భారం పడుతోంది. అలాగే 60 శాతంకు పైగా ఉన్న కౌలు రైతులు ఎకరానికి కనీసంగా రూ.20 వేల కౌలు చెల్లించారు. మొత్తంగా ఈ నష్టం వెయ్యి కోట్లు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దీంతో సాధారణ రైతు ఎకరానికి 20 వేలు పెట్టుబడి నష్టపోతుండగా కౌలు రైతు లీజును కలుపుకుని 40వేల నష్టాన్ని భరించాల్సి వస్తోంది.
ముఖ్యమంత్రి స్పందించాలి... సాగువ్యయం పెరిగిపోయింది. పెట్టుబడులు అధికమయ్యాయి. దిగుబడులు తగ్గి పోయాయి. పోగా మిగిలిన ధాన్యానికి ధర లేదు. ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించాల్సి ఉంది. ఎకరానికి రూ.5వేల ఇన్‌ఫుట్ సబ్సిడీతో పాటు అన్ని రకాల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వరి, మినుము విత్తనాలు పూర్తి సబ్సిడీపై రైతులకు అందించాలి. జీవో నెం. 58 ని సవరించి ఎగుమతులను పెంచాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు బియ్యం ఎగుమతులకు అనుమతి కల్పించాల్సి ఉంది. కనీస మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బస్తాకు రూ.200 బోనస్ ప్రకటించాలనే డిమాండ్ జిల్లాలో ఉంది. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి స్పందించి ప్రకటన చేస్తేనే రైతుకు కాస్త ఊరట కలిగించిన వారవుతారు
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 1:23:52 AM IST
అమ్మవారి అలంకరణకు మూడే హారాలు
విజయవాడ, డిసెంబర్ 8 : ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మకు ఆలయ గోడవున్లలో సు మారు వందకిలోల ఆభరణాలు ఉ న్నాయంటున్నా.. అలకంరించేది మూడు హారాలకు మించి ఉండడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనకదుర్గమ్మకు బయట ప్రత్యేకంగా ఉన్న లాకర్‌లో సుమారు వంద కిలోల బంగారం ఉన్నాయం టున్నా 50 నుంచి 60 కిలోల మేరకు ఉన్నట్లు మాత్రమే సమాచారం. అమ్మవారికి పది బంగారు కిరీటాలు, నాలుగు పూల జడలు, వడ్డాణాలు, వంకీలు, రోజూ ఆలంకరించడానికి వీలున్న పలు రకాల వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య హారాలు, పచ్చల హారాలు, దీంతోపాటు ముత్యాల హారాలు ఉన్నాయంటున్నారు. వీటిని వాడకుండా భద్రపచడంతో అవి నల్లబడి పోయినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ముక్కలుగా ఉన్నట్లు సమాచారం. గత నెల రోజులుగా అమ్మవారికి రవ్వల నెక్లెస్, తాళిబొట్లు, పగడాల హారం మాత్రమే అలంకరిస్తున్నారు.
ఆలయంలో అర్చకుల వద్ద ఉండే బంగారు అభరణాలను భద్రపరచుకోవడానికి వీలు లేదంటున్నారు. అందుకు కారణం వీరికి లాకల్ సౌకర్యం లేకపోవడమే. మూడు సంవత్సరాల నుంచి లాకర్ కోసం అర్చకులు అడుగుతున్నా దాత కోసం చూస్తున్నామంటూ ఆలయ వర్గాలు కాలక్షేపం చేస్తున్నాయి. లాకర్ లేకపోవడం వల్ల జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న కారణంగా అర్చకులు కూడా తమ వద్ద ఎక్కువ ఆభరణాలు ఉంచుకోవడానికి నిరాకరిస్తున్నారు. అర్చకుల వద్ద అమ్మవారికి అలంకరించడానికి వీలులేక పాడైపోయిన వాటిని తీసుకుని తిరిగి నూతనంగా ఆభరణాలు ఇచ్చేందుకు అధికారులకు తీరిక లేదంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆలయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమంటే వచ్చేవారంలోగాని అమ్మవారికి కావాల్సిన నగలు అర్చకులకు అందే అవకాశం లేదు. ఆలయంలో నైరుతి మూలలో లాకర్‌ను ఏర్పాటు చేయడం, దానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నిమయంచి సెక్యూరిటీని ఏర్పాటు చేయ డం వంటి సమస్యలు పెండింగులో నే ఉన్నాయి. కార్తీక మాసంలో శివానీగా కొలిచే కనకదుర్గమ్మకు అభరణాలు అలంకరించకపోవడం భక్తుల మనోభావాలకు ఇబ్బంది కరంగా మారింది. పేరు చెప్పడానికి ఇష్టపడని కొంత మంది దాతలు తాము ఆభరణాలు ఇస్తున్నది అమ్మవారికి అలంకరించడానికిగాని, గోడవన్లో పెట్టడానికి కాదంటున్నారు.
దుర్గమ్మకు మాత్రం ఒకసారి ఆలంకరించిన ఆభరణాలు ఇక తీయరు. దస రా ఉత్సవాలు, శాకంబరీ ఉత్సవా లు, ఉగాది వంటి ప్రత్యేక సమయా ల్లో కూడా ప్రత్యేకంగా గుర్తించదగిన ఆభరణాలను కూడా అలకంరించే పరిస్థితి లేదన్న విమర్శలు ఉన్నాయి.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 1:21:08 AM IST 632 గ్రామాలు జలమయం.. 14మంది దుర్మరణం... 15మంది గల్లంతు... పది లక్షల ఎకరాల పంట నష్టం... తీరం దాటిన వాయుగుండం... మరో 24 గంటలు వర్షాలు... నేడు సిఎం ఏరియల్ సర్వే.....
హైదరాబాద్, డిసెంబర్ 8: కోస్తా జిల్లాలను వేధించిన తీవ్ర అల్పపీడనం ఎట్టకేలకు తీరం దాటింది. బుధవారం ఉదయం బాపట్ల వద్ద తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల 197 మండలాల్లోని 634 గ్రామాలు నష్టపోయాయి. దాదాపు పది లక్షల ఎకరాల్లో పంట ముంపునకు గురయ్యాయి. జల విలయానికి పధ్నాలుగు మంది మృత్యువాత పడగా, మరో పదిహేను మంది గల్లంతయ్యారు. వారి జాడ కోసం అధికారులు వెదుకుతున్నారు. 68 ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్వయంగా గురువారం ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించాలని ఆయన నిర్ణయించారు. మధ్యాహ్నం పనె్నండుంపావుకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బయలు దేరి కృష్ణా జిల్లా పులిగడ్డకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా పెనుమూడి, మోపిదేవి చేరుకుని బాధితులతో, స్థానిక అధికార, అనధికారులతో సమావేశమవుతారు, అనంతరం మళ్లీ పులిగడ్డకు చేరుకుని హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం చేరుకుని పట్నవల్లి ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఖమ్మం, నల్లగొండ, కృష్ణా, కడప, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా కోరిసపాడులో 19.3 సెంటీమీటర్ల వర్షం నమోదుకాగా, గుంటూరు జిల్లా రాజుపాలెంలో 18 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా పాచిపెంటలో 15 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 14.4 సెంటీమీటర్లు, రణస్థలంలో 14.2 సెంటీమీటర్లు, లావేరులో 14 సెంటీమీటర్లు, ఎచ్చెర్ల, కోటబొమ్మాళిలో 13 సెంటీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా పది సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షం కురిసింది.
దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అనేక గ్రామాల్లోకి నీరు చేరిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 342 గ్రామాలు, తూర్పు గోదావరి జిల్లాలో 146 గ్రామాలు, గుంటూరులో 92 గ్రామాలు, ప్రకాశంలో ఏభై గ్రామాలు, నెల్లూరులో నాలుగు గ్రామాలు నష్టానికి గురయ్యాయి. అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుంటూరు జిల్లాలోని వినుగొండ వద్ద వాగులో వ్యాన్ కొట్టుకుపోవడంతో 12 మంది దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో కూడా ఒక్కొక్కరు వంతున మృత్యువాత పడ్డారు. అలాగే ప్రకాశంలో 14 మంది, గుంటూరులో ఒకరు గల్లంతయ్యారు. మొత్తం తీర ప్రాంత జిల్లాల్లో లక్ష మందికి పైగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక పంట నష్టం కూడా తీవ్రంగానే ఉంది. ఇప్పటికే వరుస తుపానులతో అతలాకుతలమైన రైతాంగం మరోసారి దారుణంగా దెబ్బతింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 1.70 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, తూర్పు గోదావరి జిల్లాలో 54 వేల హెక్టార్లు, కృష్ణాలో 46 వేల హెక్టార్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 45 వేల హెక్టార్లు, శ్రీకాకుళం జిల్లాలో40 వేల హెక్టార్లు పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, చిత్తూరు జిల్లా కోసల నగరం గ్రామంలో చెరువుకు గండి పడింది.
మరో 24 గంటలపాటు
అల్పపీడనం తీరాన్ని తాకినప్పటికీ మరో 24 గంటలపాటు ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగానే ఉంటుంది. ప్రభావం పూర్తిగా తొలగిపోయేంత వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మరో 48 గంటలపాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒరిస్సాలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
సహాయ పునరావాసంపై దృష్టి
కాగా, ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వర్షాలపై అధికారులతో సమీక్షించారు. పంట నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టి నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దెబ్బ తిన్న రోడ్లు, చెరువులు, కాలువలను పటిష్ట పరిచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడన ప్రభావం పూర్తిగా తొలగిపోయేంతవరకు సమస్యాత్మక ప్రాంతాల్లో నిశితంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అసవరమైన ప్రాంతాల్లో నిత్యావసరాలను కూడా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి హామీనిచ్చారు.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 1:03:38 AM IST ప్రకాశం బ్యారేజీ 53 గేట్లు ఎత్తివేత
విజయవాడ, డిసెంబర్ 9 : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారీజీకి వరద నీరు వచ్చి చేరాయి. దీంతో అధికారులు 53 గేట్లు ఎత్తివేశారు. 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
మూడు రోజుల నుంచి కష్ణాజిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో వరికి ఎన్నడూలేనివిధంగా 650 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అలాగే పత్తికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు రోజులపాటు ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షానికి బుధవారం కాస్త తెరపిచ్చింది.
ఉదయం ఎండ కాచినప్పటికీ మధ్యాహ్నం నుంచి మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో రైతులు పంట పొలాల్లో నీట మునిగిన వరి పనలను తిరగవేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పొలాల్లో నుంచి నీటిని బయటకు పంపించేందుకు కూడా మార్గం లేకుండా పోయింది. మంగళవారం ఆరు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవ్వగా, బుధవారానికి అది 2.8 సెంటీ మీటర్లకు పడిపోయింది.
వాయుగుండం తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణశాఖ హెచ్చరికతో రైతులు మరింత భాయందోళన చెందుతున్నారు. జిల్లాలో 2.56 లక్షల హెక్టార్లలో వరి పంట వేయగా, వ్యవసాయశాఖ అంచనాల ప్రాకరం 50 వేల హెక్టార్లు ఇంకా నీట మునిగే ఉంది. పక్షం రోజుల నుంచే రైతులు వరికోతలు, కుప్ప నూర్పుడులను ప్రారంభించారు. కేవలం పది శాతం మంది రైతులే పంటను ఇళ్లకు తీసుకువెళ్లారు. 60 శాతం పంట ఇంకా పనలపైనే ఉంది. దీంతో ధాన్యం ఏమాత్రం పనికిరాదని రైతులు వాపోతున్నారు.
రెండో పంటగా వేసిన మినుము, బెండలకు కూడా తీరని నష్టం వాటిల్లింది. భారీ వర్షాల నేపధ్యంలో పంట నష్టాలను అంచనా వేయాలని మంత్రి కె.పార్థసారథి బుధవారం సమీక్ష చేసి జిల్లా కలెక్టర్ పీయూష్‌కుమార్ వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాలతోపాటు గుంటూరు వైపు నుంచి కూడా భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ గేట్లను ఒక అడుగు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కొన్ని చోట్ల వాగులు పొంగటం వల్ల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 1:01:32 AM IST నా రాజకీయ జీవితంలో ఇంత నష్టం ఎప్పుడూ చూడలేదు : బాబు
గుంటూరు, డిసెంబరు 9 : నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం ఎప్పుడూ చూడలేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. పల్నాడు, తెనాలి డివిజన్లలో దెబ్బతిన్న వరి, పత్తి, మిర్చి తదితర పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది లైలా, జల్ తుపానులకు రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, పంట దిగుబడి గణనీయంగా తగ్గి గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో వాయుగుండం కారణంగా వరుసగా మూడు రోజులు కురిసిన వర్షాలకు రైతులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
వరి పూర్తిగా నీట మునిగిందని, మిర్చి, పత్తి మిగలలేదన్నారు. వాణిజ్య పంటలు పండించే గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి రావడం దారుణమన్నారు. రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. గతంలో వచ్చిన వరదల పరిహారాన్ని నేటి వరకు ఇవ్వలేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు స్పందించే తీరు ఇది కాదన్నారు. పంటల బీమా ఒక ఫార్స్‌గా మారిందన్నారు. దానివల్ల ఏ ఒక్క రైతుకు ఒక్కరూపాయి కూడా రావడంలేదన్నారు. గ్రామం, సర్వే నంబరు యూనిట్‌గా తీసుకొని పంటల బీమా అమలుచేయాలన్నారు. సోనియాగాంధీకి రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు.
గతంలో అదిలాబాద్, అనంతపురంలలో పర్యటించిన ఆమె వారిని ఆదుకునేందుకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో రైతులకు వచ్చినన్ని కష్టాలు గతంలో లేవన్నారు. ఈ నేపథ్యంలో రైతుకు న్యాయం జరిగేవరకు మిత్రపక్షాలతో కలిసి పోరాడతామన్నారు. అసెంబ్లీలో తాడోపేడో తేల్చుకుంటామని, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అసెంబ్లీని స్తంభింపచేస్తామన్నారు. 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 నుంచి ఒంటి గంట మధ్య రహదారాలన్నింటిని దిగ్బంధించాలని, చీమ కూడా కదల కూడదని పిలుపునిచ్చారు.
రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, పశువులతో రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. రైతుల బలం ఏమిటో నిరూపించాలన్నారు. ఎన్నికలకు ముందు విజయవాడలో రైతుగర్జన నిర్వహించడంతో భయపడిన ప్రభుత్వం కొంతవరకు రుణాలు రద్దు చేసిందన్నారు. బ్యాంకు రుణాలు మాఫీచేయాలని, పంట బీమా వర్తింపచేయాలని, విత్తనాలు ఉచితంగా అందించాలని , సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎకరాకు రూ. 5 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు రూ. 200 బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో పదవుల కోసం బిజీగా ఉన్నారన్నారు. 2జి స్ప్రెక్టంలో రూ. లక్షా 76 వేల కోట్ల కుంభకోణం జరిగితే నెల రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు.
అందులో వెయ్యి కోట్లు ఇస్తే రాష్ట్రంలో రైతుల సమస్యలు తీర్చవచ్చాన్నారు. ప్రభుత్వం అవినీతిని కట్టడి చేసి ఉంటే రైతులకు న్యాయం జరిగేదన్నారు. వైఎస్ ర్రాష్టాన్ని దోచుకొన్నారన్నారు. ఆలీబాబా లేడని, అయితే 40 దొంగలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కొనసాగుతుందన్నారు.రాష్ట్రంలో 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 0:59:56 AM IST ఆత్మస్థైర్యాన్ని వీడకండి
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది
నష్టపోయిన రైతన్నలకు సీఎం కిరణ్ ఓదార్పు
గుంటూరు, డిసెంబర్ 9 : 'ముప్పై ఏళ్ళలో ఎన్నడూ ఎరుగని విపత్కర పరిస్థితిని ఈ ఏడాది రైతన్నలు చవి చూడాల్సి వచ్చింది, వెంట వెంటనే ఏదో ఒక రూపంలో ప్రకృతి విళయతాండవం సృష్టించి నోటి కాడకు వచ్చిన పంటను కబళించింది, ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది' అంటూ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి రైతులను ఓదార్చారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెనుమూడి గ్రామానికి వచ్చారు. ముందుగా ఆయన పంట పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న వరి పైర్లను పరిశీలించారు. కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతులు సీఎం కిరణ్ ఎదుట తమ బాధను వ్యక్తపరిచారు.
నోటికాడికొచ్చిన పంట నీళ్ళపాలైందని, పూర్తిగా అప్పుల పాలయ్యే పరిస్థితి నెలకొందని బాధిత రైతులు వాపోయారు. సీఎం వారిని ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, తిరిగి కోలుకునేందుకు అన్ని రకాల సాయం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ సీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తాను ఈ విధంగా మీ వద్దకు రావాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడుతున్నట్టు చెప్పారు.
నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 467 మండలాలను వరద బాధిత మండలాలుగా గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. ఈ మండలాల్లోని రైతుల బ్యాంకు రుణాలను రీ షెడ్యూల్ చేయించి తిరిగి కొత్త రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర బృందాన్ని కూడా రప్పించి తగిన సహాయ చర్యలు అందేలా చూస్తామని చెప్పారు. వరదల మూలంగా నాణ్యత కోల్పోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయించేందుకు ఎఫ్‌సిఐను రంగంలోకి దించనున్నట్లు తెలిపారు.
శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు జరిగే కొశ్చన్ అవర్‌ను ఎత్తివేసి రైతు సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు చెప్పారు. ఎంత నష్టం వాటిల్లినా రైతులు కుంగిపోవాల్సిన అవసరం లేదని, రైతుల మేలు కాంక్షించే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గతంలో సంభవించిన విపత్తుల నుంచి రైతులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.వెయ్యి కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.14 కోట్లు కేటాయించినట్లు సీఎం వివరించారు.
కాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాల గురించి ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా అధికారులు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఈ పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, జిల్లా మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కూచిపూడి విజయ, ప్రత్యేకాధికారి హీరాలాల్ సమారియా, కలెక్టర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 10, Dec 2010 0:57:32 AM IST aMdarikI halO halO!
sahasraM pUrti avaDaaniki iMka 94 pEjIlE vunnaayi
mitrulaMdarU chakachakaa pOsTitE sahasraM pUrtiavaDaM asaadhyaMkaadu
kanuka mitrulu rachchabaMdaku vachchi pOsT chEstaarani aaSistU
Saastri
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 9, Dec 2010 9:47:37 AM IST aMdarikI maLLI maLLI halO !!
akaala varShaMvalla rachchabaMDa taDisipOyiMdanukuMTaa
kOtalei panaluvEsina vari vaanaku taDisi paaDeipOtuMdi
paapaM reitulaku IvarShaMvalla apaara naShTaM
EmiTO IprakRuti bhIbhatsaM dina dina gaMDalaavuMdi
aaScharyaM EmiTamTE iMta varShaM kurustunnaa kareMT kaT lEdu.
mitrulaMdarU vIlayitE rachchabaMDaku raavaalani,
2011 janavari 1 vatEdIki daSamaparvaM praaraMbhistaamani aaSistU
Saastri
.
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 8, Dec 2010 9:00:10 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|