Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
జోకులేసుకుందాం రా !
< < Previous   Page: 9 of 12   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
naaku baaga navvochchE oka jOk ni meeku pOsT chEstaanu.. oka palleToori atanu EdO oka pani meeda krottagaa paTnaaniki vastaaDu..vachchi rOD madhyalO unna pedda gaDiyaaraanni aasaktigaa choostU nilabaDipOtaaDu..idantaa gamanistunna akkaDE unna oka donga elaagainaa aa palleToori vaNNi mOsaM chEsii atani daggara DabbEmainaa unTE koTTEyaalanu anukunnaaDu.. appuDu aa dongaa palleToori vaanitO, donga: "neeku aa gaDiyaaraM kaavaalaa???aitE oka veyyi roopaayalu ivvu,aa gaDiyaaraanni neekistaanu" anduku oppukoni aa donga ku aa veyyi roopaayalistaaDu.. donga: "sarE nuvvu ikkaDE unDu..nEneLLi nichchena teesuku vachchi aa gaDiyaaraanni teesi ichchEstaa" sarE ani akkaDaa veyiT chestunTaaDu..raatri ayyETappaTikii kooDaa aa donga raakapOyEsariki akkaDanunDi veLLipOtaaDu.. aa marusaTi rOju kooDaa aa palleToori vaaDu maLLi vachchi aa gaDiyaaraM vankE choostunTaaDu..adE vidhaMgaa ninnaTi donga atanni maLLii aa palleToori vaaNNi gamaninchii pakkanE maroka dongatO ninna tanu chEsinaTlugaa chEsii inkO veyyi roopaayalu nokkeyyamanTaaDu..sarE anii aa inkoka donga maLLI inkO veyyi roopaayalu teesukonii ikkaDE unDu nenippuDE gaDiyaaraM teesichchEnduku nichchena nu teesukuvastaanu anee veLtunDagaa, appuDu aa palleToori atanu: "ninna kooDaa okatanu vachchii nannu ilaagE mOsaM chEsaaDu..ee saari nuvvu ikkaDE unDu..nEnE veLLi nichchena teesukostaanu" jOk vinaDamE haayi..itaraluku raasi vinipinchamE kashTaM :) eppuDU pOsT chEsE prataap gaarini,durga gaarini mechchukOvaalii

Posted by: Mr. sathwik D At: 7, Jan 2010 3:07:37 PM IST
1. కొత్తగా ఆర్మీలో చేరిన ఇద్దరు తెలుగు వాళ్ళు తమను పరస్పరం పరిచయం చేసుకున్నారు. “నువ్వు ఆర్మీ లో ఎందుకు చేరావు” అడిగాడు మొదటివాడు. “నాకు యుద్ధాలు అంతే చిన్నప్పటినుండి ఇష్టం వుండడం వలన ఆర్మీలో చేరాను. మరి నువ్వొ ?” అడిగాడు రెండవవాడు. “నాకు అయిదేళ్ళ కిందే పెళ్ళయ్యింది. ఈ అయిదేళ్ళలో యుద్ధాలంటే అలవాటు అయిపోయి పెళ్ళాంతో యుద్ధం చేయడం కంటే ఆర్మీలో చేరడమే బెటరని చేరాను” అసలు సంగతి చెప్పాడు మొదటివాడు. 2. “ మా ఆయన కంట్రోల్ లో అసలు వుండడు. మరి మీ వారైయితే నీ చెప్పు చేతలలో వుండడం నేను చూసాను.నువ్వు నీ మొగుడును ఎలా కంట్రోల్ చేస్తున్నావో చెప్పవా”అడిగింది రమ్య. “ ఏముంది వెరీ సింపుల్. వాడు తోక జాడించినప్పుడల్లా నేను మేకప్ తీసేసి ఎదుట నిలబడతాను. అంతే దడుసుకొని చస్తాడు. ఇక రెండ్రోజుల దాకా నోరెత్తితే ఒట్టు” అసలు కిటుకు చెప్పింది కావ్య.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 7, Jan 2010 12:38:43 PM IST
1."ఏమిట్రా విజయ్ ? ఒక కన్ను మూసి ఇంకొక కన్ను తెరుస్తున్నావు? ఏమైనా జబ్బా ?" అడిగాడు మనోజ్ " జబ్బూ కాదూ,పాడూ కాదు. ప్రతీ వస్తువునూ పొదుపుగా వాడుకొమ్మని మా టీచరు చెప్పారు. అందుకనే ఒక కన్ను మాత్రమే వాడుకుంటున్నాను" అసలు సంగతి చెప్పాడు విజయ్. 2. " కంటికి కనిపించని అంగ వైకల్యం ఏమిటి లక్ష్మీ? " అడిగాడు భర్త కనకారావు. " మీలా బుద్ధి వంకర టింకరగా వుండడం"మూతి ముప్ఫై సార్లు తిప్పుతూ చెప్పింది లక్ష్మి. 3."పేషెంటుకు ప్రసవం ఇంకొక గంటలో అవవచ్చు" చెప్పింది అసిస్టెంట్. " అయితే వెంటనే సిజేరియన్ కు ఏర్పాట్లు చేసెయ్యి. నార్మల్ డెలివరీ అయితే మనకు, మన హాస్పటల్ కూ చాలా కష్టం" ఆర్డర్ వేసాడు డాక్టర్ దురాశం.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 6, Jan 2010 3:04:05 PM IST
1. మీ ఆయనలో హుషారు, ఓపిక తగ్గాయా ?ఎప్పటి నుండి?" అడిగింది రజని. "మేము కొత్త పనిమనిషిని పెట్టుకున్నప్పటినుండి" అసలు సంగతి చెప్పింది రేఖ. 2. "ఎందుకే అలా గోళ్ళు పెంచుతున్నావు? చక్కగా నీట్ గా ట్రిం చేసుకోవచ్చు కదా!" అడిగింది రంభ. " " ఈ గోళ్ళే నా ఆయుధాలు. వీటి ద్వారానే నేను మా ఆయనను కంట్రోల్ చేయగలుగుతున్నాను" పొడవుగా పెరిగిన గోళ్ళ వైపు మురిపెంగా చూసుకుంటూ చెప్పింది ఊర్వశి. 3. " మీ డ్రైవింగ్ చూసి అందరో ఎలా ఆశ్చర్యపోతూ మిమ్మల్నే చూస్తున్నారో ఒకసారి గమనించండి" గర్వంగా అంది భార్య. " డ్రైవింగ్ కాదు పాడూ కాదు,జారిపోయిన నీ పైటను ఒకసారి సర్ధుకో, వాళ్ళు చూసేది నన్ను కాదు, నిన్ను" అసలు సంగతి చెప్పాడు భర్త.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 2, Jan 2010 10:22:30 AM IST
1.“ఏమిట్రా అంత సంతోషం గా వున్నావు? అడిగాడు అజయ్ “ నేను ఇంటర్ రెండో సారి ఫెయిలయ్యాను” చెప్పాడు విజయ్ “ ఇందులో సంతోషించాల్సింది ఏముంది? రెండో సారి ఫెయిలయినందుకు సిగ్గుపడాలి గాని” “ నా గర్ల్ ఫ్రెండ్ వనజ పాసయ్యిందిగా !” “అరే వెరీ గుడ్. మీ ఇద్దరిలో కనీసం ఆమె గెట్టిక్కిందన్న మాట” “ అంతే కాదు, ఆమె ఇంటర్ పాసయితే ఆమె బావ కిచ్చి వెంటనే పెళ్ళి చేస్తానన్నాడు ఆమె డాడి. అందుకే చాలా సంతోషం గా వుంది” అసలు సంగతి చెప్పాడు విజయ్. 2. “ నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా ?” అడిగాడు శ్రీను. “ ఓ యస్, ఇప్పటి దాకా ఇరవై మందిని ప్రేమించాను కాని ఒక్కర్తి కూడా నన్ను ప్రేమించలేదు” అసలు సంగతి చెప్పాడు వాసు. 3. “ నేను నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చెయ్యమంటావో చెప్పు” అడిగాడు మన్మధ రావు. “ దట్స్ గుడ్. సాయంత్రం జగదాంబ థియేటర్ కు రెండు టిక్కట్లు తెచ్చి పెట్టు. నేను, విక్రం ఔటింగుకు వెళ్తున్నాం. తెచ్చి పెడితే నెక్శ్ట్ చాన్స్ నీకే ఇస్తాను. చేతకాకపోతే చెప్పు, ఆల్రెడీ రమేష్ లైను లో వున్నాడు” తాపీగా అసలు సంగతి చెప్పింది కమల. 4.”అయ్యగారికి సరిగ్గా వండి పెట్టడం లేదా అమ్మగారు. ఈ మధ్య కాస్త డల్ గా వుంటున్నారు” అడిగింది పనిమనిషి నాగులమ్మ. “ అదేం లేదే, అయినా ఎందుకడుగుతున్నావు” ఆశ్చర్యంగా అడిగింది రత్నం. “ ఇంతకు ముందు నాతో బాగా హుషారుగా వుండే వారు. ఈ మధ్యే కాస్త స్పీడు తగ్గింది. అయ్యగారు అలా వుండడం నాకేం నచ్చడం లేదమ్మా” చేతులు నలుపుకుంటూ అసలు సంగతి చెప్పింది నాగులమ్మ.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 1, Jan 2010 3:31:21 PM IST
1. చంద్రం : "లాయర్ గారూ ! నెను విడాకులు తీసుకుందామనుకుంటున్నాను ఎందుకంటే పెళ్ళయిన దగర్నుంచీ నా భార్య ఏడాదికీ పది నెలలు పుట్టింట్లోనే వుంటోంది. నాతో సరిగ్గా కాపురం చెయ్యడం లేదు" లాయర్ " " ఎందుకైనా మంచిది, ఈ విషయం లో మరొక్క సారి ఆలోచించు నాయనా! ఎందుకంటే నీకు పట్టిన ఈ అదృష్టం లక్షలలో ఏ ఒక్కరికో దొరుకుతుంది. అనవసరంగా దానిని జారవిడుచుకోకు " 2. "అమ్మగారూ , అయ్యగారిని వాడే టూత్ పేస్టు కొంచెం మార్చమని చెప్పండి" చెప్పింది పనిమనిషి మనిషా. " అయ్యగారు ఏ పేస్టు వాడితే నీకెందుకే ?" కోపంగా అడిగింది లక్ష్మి. "నిన్న మీరి ఇంట్లో లేనప్పుడు వంటింట్లో నన్న కౌగిలించుకొని ముదెట్టుకున్నప్పుడు నోట్లోంచి ఒకటే కంపు, అస్సలు భరించలేకపోయానంటే నమ్మండమ్మా! " వయ్యారాలు పోతూ అసలు సంగతి చెప్పింది మనీషా. 3. "ఈ తరం అబ్బాయిలు భలే తెలివి మీరిపోయారురా! బాధగా అన్నాడు రామం. "ఏమయ్యింది ?" అడిగాడు భధ్రం. " ఈ రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్సు వచ్చినప్పుడు వచ్చే సెప్టెంబరు పరీక్షలో పాసవ్వలని దీవించండి నాన్నా అంటూ నా కాళ్ళకు మొక్కాడు మా అబ్బాయి" అసలు సంగతి చెప్పాడు రామం.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 15, Dec 2009 12:09:36 PM IST
rAshTram bhaggumani manDipOtUmTE jOkulEsukumdAm rammamTunnArA?

Posted by: Mr. karan karan At: 12, Dec 2009 1:18:53 PM IST
1.“ఏవమ్మా కొంచెం భిక్షం వేయండి” అరిచాడు బిచ్చగాడు. “ఇంకా ఇంట్లో భోజనాలు అవలేదు, కాస్సేపాగి రా” విసుగ్గా అంది ముత్యాలమ్మ. “ అయితే నా సెల్ నెంబరు తీసుకోండి. అంతా రెడీ అవగానే ఒక్క కాల్ చెయ్యండి, వెంటనే వచ్చేస్తాను” వినయంగా చెప్పాడు బిచ్చగడు. 2.ఎందుకండీ ఆ చంటి గాడిని అంతలా బాదుతున్నారు? అడిగింది ఆండాళ్ళు. “ వాడికి గాడిద బొమ్మ గీయమని వాడి టీచర్ చెప్పిందట. గాడిదను తెస్తే చూసి గీస్తాడట అంటున్నాడు. వీడి దిక్కుమాలిన డ్రాయింగ్ కోసం నేను గాడిదనెక్కద తెచ్చేది? కోపంగా అరిచాడు వెంగళప్ప. “ ఓస్ అంతేనా! ఈ మాత్రం దానికి గాడిద ఎందు కు? ఒక్క అరగంట పాటు మీరే వాడి ఎదుట నిలబడి వాడి చేత గీయిస్తే పోలా? వయ్యారం గా మూతి తిప్పుకుంటూ వంటింట్లోకి వళ్ళిపోయింది ఆండాళ్ళు. ఆ మాటలకు నోరు తెరుచుకొని వుండిపోయాడు వెంగళప్ప. 3.“ఆంత అర్జంటుగా విడాకులుకు అప్లయి చేసావెందుకు ?” అడిగింది రేఖ. “ మా ఆయన హఠాత్తుగా నెలకు బస్తా బియ్యం, అయిదు కేజీల కందిపప్పు, నాలుగు కేజీల నూనె ఇవ్వమని మా నాన్నకు ఫోన్లు చేస్తున్నాడు. ఆ వెధవకు ఇన్ని ఇవ్వడం కంటే విడాకులు తీసుకోవడమే బెటర్” చెప్పింది రాజీ. 4.నానా! నోట్స్లు కొన్నుకోవాలి, డబ్బులివ్వు” అడిగింది రజని. “ఇప్పుడు చీకటి పడింది. ఆడపిల్లవు ఒక్కర్తీ బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. రేపు పొద్దున్నే వెళ్ళి కొనుక్కొ” ఆప్యాయంగా సలహా ఇచ్చాడు సుబ్బారావు. “ రమేష్ కు రావడం ఇప్పుడే వీలవుతుంది నాన్నా” గబుక్కున అనేసి నాలిక కరుచుకుంది రజని.

Posted by: Mrs. Kanaka Durga At: 12, Dec 2009 10:42:53 AM IST
1.“ఏవమ్మా !గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాలని నిన్న హాఫ్ డే లీవ్ తీసుకున్నావు, కానీ సాయంత్రం ఐమాక్స్ థియేటర్ లోనుండి ఎవడితోనో వస్తూ కనిపించావు. ఏం తమాషాగా వుందా “అరిచాడు మేనేజర్ బ్రహ్మానందం “నేనేం అబద్ధాలు చెప్పలేదు, మీరు చూసినాయన నా బాయ్ ఫ్రెండ్, వృత్తి రీత్యా గైనకాలజిస్ట్” వయ్యారాలు వొలకబోస్తూ అసలు సంగతి చెప్పింది స్టెనో లూసీ. 2." ఏమిట్రా ఆ వొళ్ళంతా కట్లు, యాక్సిడెంట్ గానీ జరిగిందా ఏమిటి? అడిగాడు గుర్నాధం. “ యాక్సిడెంటూ కాదూ పాడు కాదు, పతియే ప్రత్యక్ష దైవమన్న సీరియల్ చూస్తూ వుండగా డిస్టర్బ్ చేసానని మా ఆవిడే ఒళ్ళు వాతలు తేలేలా కొట్టింది” ఏడుస్తూ అసలు సంగతి చెప్పాడు అప్పారావు. 3. “డాక్టర్ గారూ, మా అబ్బాయి పొరపాటున అయిదు రూపాయల బిళ్ళ మింగేసాడు, త్వరగా ట్రీట్ మెంట్ చేసి దానిని బయటకు తీయండి” గాభరాగా అన్నాడు మల్లేశ్వర రావు. “మీరేం వర్రీ అవకండి.ఉద్యోగంలో లక్షలకు లక్షలు మింగేసిన మీరు శుభ్రంగా, దుక్కలా వున్నారు. వెధవది ఒక అయిదు రూపాయల కాసు మింగేసిన మీ వాడికి ఏమవుతుంది?” నెమ్మదిగా కిళ్ళి మనులుతూ చెప్పాడు డాక్టర్ పరంధామం. 4. "సగం విరిగి, మిగితా సగం గారలు పట్టి వున్న పళ్ళతో, నొట్లోంచి అంత అసహ్యంగా కంపు వస్తున్న వ్యక్తితో ఇందాక మాట్లాడావు. ఆయనెవరురా?" అడిగాడు ముఖేష్. " అతను మా ఫ్రెండ్,వృత్తి రీత్యా పళ్ళ డాక్టర్" అసలు సంగతి చెప్పాడు శిరీష్.

Posted by: Mrs. Kanaka Durga At: 10, Dec 2009 2:04:08 PM IST
paatavE reMDu 'guruvugaari'ki saMbaMdhiMchinavi gurtuku techchukuMdaaM : 1) upaa : 'karta, karma, kriya'la guriMchi evareinaa cheppaMDiraa! oka SishyuDu : paaThaM sarigaa cheppalEni meeru karta, adi vinaDaM maa karma, vErE paMtulunu choosukOvaDaM kriya. 2) upaa : orE bheemaaraavoo - dEvuDu neeku anukOkuMDaa pratyakshamei EMkaavaalO kOrukOmaMTE nuvvEM aDugutaavuraa? SishyuDu : naaku vipareetaMgaa Dabbu kaavaalani aDugutaanaMDee! upaa : orE nEneitE chaduvu kaavaalani kOrukoMTaanuraa! SishyuDu : evaridaggara EM lEdO adE aDugutaaru kadaMDee! 3) upaa ( oka SishyuDitO) : neekannaa aa ammaayE nayaM. EdO okaTi cheppiMdi. Something is better than nothing annaaru kadaa! SishyuDu : Nothing is better than nonsense ani kooDaa annaaru kadaMDee!

Posted by: SATYA RAMA PRASAD KALLURI At: 26, Nov 2009 7:49:31 PM IST
< < Previous   Page: 9 of 12   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.