
|
|

Cinema Special: Anything on Cinema | చరిత్ర హీనులుగా మిగలకండి! | |
| చరిత్ర హీనులుగా మిగలకండి!
జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో పోటీచేసిన ప్రజారాజ్యం అభ్యర్ధులారా! మీకు మా హ్రుదయపూర్వక సూచన! ముందుగా అందుకోండి మా శుభాభినందనలు. అసలు ప్రజారాజ్యం అభ్యర్ధిగా నిలబడటం మీకొక వరం. చిరంజీవి సైన్యం లో భాగస్వాములు కావడం మరొక శుభపరిణామం. అవినీతిపై యుద్దానికి సేనాని కావడం ఇంకొక అదనపు కానుక ఇన్ని అర్హతలు సంపాదించిన మీకు గతం లో మేమెవరో తెలియదు, మీరెవరో మాకు తెలియదు. కాని మన అందరికీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి కాదు, కాదు ఒక ప్రఛండ శక్తి డాక్టర్ చిరంజీవి. ఆయనను బట్టే మనం ఆత్మ బందువులైనాము ఆ సంగతి మరువకండి! అన్నయ్య ఆశయాలను నెరవేర్చేందుకు కంకణ బద్దులమైనామన్న సంగతి విస్మరించకండి! తాత్కాలికమైన ధనప్రలోభాలకు లోనుకాకుండా శాస్వతమైన ప్రజాప్రయోజనాలకు పాటుపడదాం. మిమ్ము నడిపించటానికి అన్నయ్య చిరంజీవి మీ ముందు వున్నాడు. వెనుక కొండంత అండగా అభిమానులమైన మేము వున్నాము, కనుక మీరు ఎవరికి భయ పడవలసిన పనిలేదు ఒక్క నీతికి, నిజాయితీకి తప్ప.
ఇంతగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే మనం ఎంతనీతిగా వుందామన్నా కొన్ని కుటిల రాజకీయ శక్తులు మీకు మీ మీ బలహీనతలను ఆసరా చేసుకుని ఆయా బలహీనతలను బట్టి తగిన యెరను వేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించి వుంటారు. అందుకు కొందరు దేశం పెద్దలు విదేశాలనుండి అతిపెద్ద మొత్తం లో డబ్బుని సైతం తీసుకు వఛినట్లు తెలుస్తుంది. కనుక గౌరవ ప్రజారాజ్యం అభ్యర్ధులారా! దయచేసి వినండి గతం లో సంఘం లో మీకు ఎటువంటి విలువ వుందో మాకు తెలియదు కాని "పూల సువాసన దారానికి అబ్బినట్లు," చిరంజీవి పట్ల ప్రజలకున్న అభిమానమనే అత్యంత విలువైన పరిమళం అభ్యర్దులైనందున మీకు అబ్బింది. దానిని కాపాడు కోవలసిన బాధ్యత మీది. మీరు ఎటువంటి పరిస్తితులలోను అతిహెయమైన, హీనమైన పనులకు పాల్పడరని విశ్వసిస్తున్నాము. మిమ్ములను కాపాడుకునేందుకు మేము సిద్దం, ఒక వేళ మీరే అవినీతికి అర్రులు చాస్తే మిమ్ములను జాతి క్షమించదు, అంతే కాదు అభిమానులు సహించరు అన్న సంగతి మరువకండి! ఎన్నికలు జరిగిన నాటినుండి అభిమానులు మీ యోగక్షేమాలను విచారిస్తున్నరన్న సంగతి మీకు తెలియదు, మీ ప్రతి కదలిక అన్నయ్య కదలికగా అభిమానులు భావిస్తున్నారు. మీరు ఏ తప్పు చేయరని, సామాజిక న్యాయ పోరాటం లో మీ వంతు పాత్రకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు, వారి ఆశలను అడియాశలు చేయకండి! కనీసం అటువంటి ఆలోచన కూడా మదిలోనికి రానీయకండి! ఇంతసేపు మేము చెపుతున్నది అభిమానమనే నాణేనికి ఒకవైపు మాత్రమే! దయా చేసి నాణేనికి రెండో వైపు చూడటానికి సాహసించకండి! మీరు అన్నయ్యకు ఎంత నమ్మకంగా వుంటే అన్నయ్య అభిమానులు మీకు అంతకు పది రేట్లు అధికంగా నమ్మకంగా వుంటారు. అందుకు వ్యతిరేకంగా జరిగితే మాత్రం పరిణామాలు వంద రెట్లు అధికంగా వుంటాయి సుమా! ఇదీ కేవలం మర్యాద పూర్వక సూచన మాత్రమే! నీతి, నిజాయితీ గల ప్రభుత్వ స్థాపనకు భాగస్వామ్యం వహించండి, చరిత్ర లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకోండి, అంతేకాని చరిత్ర హీనులుగా మిగలకండి!
Arza Prasad
Web & Media co ordinator
Chiru Gulf NRI’s welfare wing—Dubai
Posted by: Mr. venkata vara prasad arza At: 11, May 2009 8:19:47 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|