
|
|

General Forum: Poetry | prajaaraajya veduka! prajalandari veduka! | |
| ఆనాడు ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే
ఈనాడు మే16న ఆంద్ర ప్రజలకు మరో స్వాతంత్ర్యం
అదే అదే సామాజిక స్వాతంత్ర్యం!
నాడు తెల్లదొరల పాలనకు గాంధీజి భరత వాక్యం పలికితే!
నేడు అవినీతి పాలనకు 'చిరు' చరమగీతం పలుకనున్నాడు!
ఆనాటి బానిసబతుకుల విముక్తికి పోరాడిన ఎందరో స్వాతంత్ర్య
యోధులు తమ జీవితాలను ఆస్తులను పణంగా పెడితే!
నేటి ఈ సామాజిక న్యాయ పోరాటం లో ఎందరో యువకులు
మహిళలు తమ అపూర్వభవితకు పునాదులు వేశారు!
ఆనాటి మన పోరాటం పరాయి దేశస్తులపైన
ఈనాటి మన పోరాటం అవినీతి నాయకుల పైన!
ఆనాటి పోరాటం లో అశువులు బాసిన వారు
చరిత్రపుటలలొ అమరులుగా మిగిలారు
ఈనాటి పోరాటంలో (ప్రజరాజ్య సభల్లో ప్రమాదవశాత్తు)
ప్రాణాలు కోల్పోయినవారు ప్రజారాజ్యానికి పునాదులయ్యారు
సామాజిక న్యాయానికి ప్రేరణగ మిగిలారు!
అందరికి ఆధర్శవంతులుగా సమసమాజ స్థాపనకు
ప్రాణప్రదాతలుగా నిలిచారు! వారికి జోహార్లు!
ఎందరో మహాను భావులు అందరికి అభివందనములు!
రానున్నది బడుగు బలహీన వర్గాల రాజ్యం
అదే అదే ప్రజారాజ్యం! చిరు జీవుల ఆశాదీపం!
కొందరి కోసం ఎందరో అది గతం!
అందరి కోసం ఒక్కడు ఇది నేటి మాట!
ఆ ఒక్కడు అందరి వాడు
పేదలబతుకులలో వెలుగులు నింపడమే
ఆయన ఆశయం! మదర్ థెరిస్సా,
మహాత్మ గాంధీ వంటివారు ఆయనకు
ఆదర్శ ప్రాయులైతే, ఆయన మరెందరికో
స్పూర్తిప్రదాతగా మారాడు, ఆయన మదిలోని
భావాలకు ప్రతిరూపమే ప్రజారాజ్యం!
అందులో నేను సైతం అంటూ అడుగులు
కలిపిన అభిమానులు కోకొల్లలు...
చిరంజీవి శ్రీరాముడైతే ఆయన అభిమానులు
అన్నమాట జవదాటని లక్ష[మ]ణులు
స్వకార్యం మాని, స్వామికార్యం నెరవేర్చే
వీరాంజనేయులే! అందరి ఆశలు
చిరు పాలన కోసమైతే...........
చిరు కోరిక మాత్రం ప్రజాహితం!
ప్రభుత్వ ఫలాలు అందని ఫలాలు కాదు
అందరి ఫలాలు కావాలన్నది అభిమతం
అందుకే ఈ పోరాటం! ఇది ప్రజాపక్ష పోరాటం
ఈ పోరాటం లో ప్రజారాజ్యానిదే విజయం
అదే అదే సామాజికన్యాయానికి తొలి విజయం
సంబరాలు జరుపు కుందాం
సన్నద్దులమవుదాం
ప్రజారాజ్య వేడుక! ప్రజలందరి వేడుక!
జై ప్రజారాజ్యం! జయహో చిరంజీవా!
ఆర్జా ప్రసాద్
వెబ్ & మీడియా కో ఆర్డినేటర్
చిరు గల్ఫ్ వెల్ఫేర్ వింగ్ - దుబాయి
Posted by: Mr. venkata vara prasad arza At: 13, May 2009 1:46:09 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|