
|
|

|
General Forum: Offbeat n Jokes | | జోకులేసుకుందాం రా ! - 2 | |
| 1. చిన్నప్పుడు క్లాస్ రూములో చింపిరి జుత్తుతో నోట్లోని పళ్ళన్నీ పైకి కనిపించేలా పిచ్చి పిచ్చిగా నవ్వుతూ, అర్ధం పర్ధం లెని విధం గా మాట్లాడుతుండే వాడివి,ఇప్పుడేమి చేస్తున్నావురా ?" చాలా కాలం తర్వాత కనిపించిన శిష్యుడిని ఆప్యాయం గా పలకరించి అడిగారు హెడ్ మాష్టార్ రామనాధం గారు.
" వెర్రి అనే టి వి చానెల్ లో యాంకర్ గా పనిచేస్తున్నాను సార్" సవినయం గా చెప్పాడు బాలు.
2. "ఈ రోజు లెక్కల పరీక్ష ఎలా రాసావు రా ?" కళ్ళజోడు సవరించుకుంటూ కొడుకుని అడిగాడు రాంబాబు.
" ఆ మాట పరీక్ష హాలులో నాకు ముందు బెంచీ లో కూర్చున్న రమేష్ ను అడుగు" తాపీగా బబుల్ గం నములుతూ చెప్పాడు సురేష్.
3. "సార్ నేను జగదాంబా సెంటర్ మధ్యలో వున్నాను. మీ హాస్పటల్ కు ఎలా రావాలో కాస్త దారి చెబుతారా ?" గాభరాగా ఫోన్లో ఒక కార్పొరేట్ హాస్పటల్ కు ఫోన్ చేసి అడిగాడు పిచ్చేశ్వర రావు.
"మీరు ఎటూ కదలకుండా అక్కడే ట్రాఫిక్ లో కాస్సేపు నిలబడితే మా ఆంబులెన్సు వచ్చి మిమ్మల్ని సురక్షితం గా హాస్పటల్ కు తీసుకు వస్తుంది" తాపీగా చెప్పి ఫోను పెట్టేసింది రిసెప్షనిస్టు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 24, Jun 2009 4:21:27 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|