
|
|

|
General Forum: Offbeat n Jokes | | జోకులేసుకుందాం రా - 3! | |
| 1.‘’ప్రియా ! నువ్వు లేకుండా నేను క్షణమైనా జీవించలేను. నీ కళ్ళ లోకి చూస్తూ జన్మంతా అన్న పానాదులు లేకుండా గడిపెయ్యాలనిపిస్తోంది. నీ కోసం ఎన్ని కష్టాలనైనా సహనం తో , చిరునవ్వుతో భరించడానికి సిద్ధం గా వున్నాను” తన్మయత్వం తో ప్రియ అందాన్ని తనివితీరా చూస్తూ అన్నాడు రమేష్.
“ చ చ,మనకింకా పెళ్ళి కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి డియర్ , అసలు కష్టాలు పడే రొజులు ముందు వున్నాయి కదా !, ఈ నాలుగు రోజులయినా కష్టాల గురించి ఆలోచించక హాయిగా జీవితాన్ని ఎంజాయి చెయ్యు ” అంత తన్మయత్వం తో రమేష్ ఒడిలో పడుకొని పల్లీలు తింటూ అంది ప్రియ.
2.“భయం మీద ఒక వ్యాక్యం చెప్పురా భాస్కర్ “అడిగింది టీచర్.
“ భయం గురించి విని భయాన్ని చూస్తే భయపడతానని అనుకున్నా కానీ అసలు భయాన్ని భయం భయం గా చూడగానే అసలు భయం వేయలేదు పైగా భయం ఇలాగే వుంటుందా అనిపించింది. భయాన్ని భయం గా చూడకూడదని, అసలు భయపడకూడదని, అంతే కాక భయాన్ని ముందే భయపెట్టాలని అప్పుడే డిసైడ్ అయ్యాను." గుక్క తిప్పుకోకుండా చెప్పాడు కవి కొడుకైన భాస్కర్
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 25, Jun 2009 12:18:35 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|