
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 4 ! | |
| (1)“సినీ నటిని పెళ్ళి చేసుకోవడం తప్పయి పోయిందిరా “ విచారం గా అన్నాడు రాబర్ట్
“ ఏమయ్యింది, అందం ,చందం, నటన, గుణం, ఆస్తి, అంతస్తు అన్ని వున్నాయని ఏరి కోరి చేసుకున్నావుగా పెళ్ళి ?” అడిగాడు ఫ్రాన్సిస్
“ పెళ్ళి ముందువరకు తన మాజీ భర్త గురించి చెబుతుండేది. పెళ్ళయ్యాక తనకు రాబోయే భర్త గురించి చెప్పడం మొదలు పెట్టింది, నేను పడే బాధ వర్ణనాతీతం” అసలు సంగతి చెప్పి బావురుమన్నాడు రాబర్ట్.
(2)“ ఇదేమిటి డాక్టర్ గారూ, ట్రీట్ మెంట్ నాకొక్కడికి ఇస్తే , ముగ్గురికి బిల్లు వేసారు ? ఇది చాలా అన్యాయం, అక్రమం “అంటూ ఆవేశపడ్డాడు చెంగల్రావు.
“ అన్యాయమూ కాదూ, పాడూ కాదు, నీకూ ట్రీట్ మెంట్ ఇస్తున్నప్పుడు నువ్వు పెట్టిన కేకలకు మిగితా ఇద్దరు పేషెంట్లు పారిపోయారు. మరి వారి బిల్లు ఎవరు కడతారు ? మీ బాబా ?”తాపీగా అసలు సంగతి చెప్పాడు డాక్టర్ దైవాధీనం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 25, Jun 2009 1:23:10 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|