
|
|

General Forum: Poetry | కార్పరేట్ ఆసుపత్రులు | |
| ఇదేం ఆసుపత్రి నాయనోయ్
డబ్బుతో, డబ్బుకొరకు
డబ్బు మదం తో వైద్యమందించే
కార్పొరేటు ఆసుపత్రులు ప్రజల పాలిటి
నరక కూపాలు,వ్యాపార కేంద్రాలు
డబ్బిస్తేనే నాడి చూడడానికి సంసిద్ధం
ప్రాణాలు పోతున్నా డబ్బు వాసన పడనిదే
కదలికలు రాని డాక్టర్ బాబులు
వారినే నమ్ముకొని వున్న పరీక్షకులకు
అను నిత్యం పండగే
అన్ని రకాల అవసరం లేని టెస్టులు చేయించి
జలగల వలె డబ్బు గుంజే వైనం బాధాకరం
అడ్దగోలుగా ధన దోపిడీ జరుగుతున్నా
నిమ్మకు నీరెత్తనట్లు మిన్నకుండే అధికారులు
పేదవారికి నాణ్యమైన వైద్యం
ఎప్పటికీ నిజం కాని సుదూర స్వప్నం
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 25, Jun 2009 1:34:09 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|