
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 7 ! | |
| . డాక్టర్ గారూ. తీవ్రమైన అలసటగా వుంటోంది. దయచేసి టేస్టు చెయ్యండి" అడిగాడు సుబ్బారావు.
డాక్టర్ అన్ని పరీక్షలు చేసి "మీరు చాలా వీక్ గా వున్నారండి. ఈ మందులను వాడండి క్రమం తప్పకుండా వాడండి, దానితీ పాటు బాగా రెస్టు తీసుకొండి" అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు.
" ఓ కె డాక్టర్ అయితే రేపట్నుంచి ఆఫీసుకు వెళ్ళడం ప్రారంభిస్తాను.అక్కడయితే పగలు కూడా బాగా నిద్రపోవచ్చు" అని భారం గా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు సుబ్బారావు.
"ఆ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు డాక్టర్.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 29, Jun 2009 2:23:05 PM IST 1. "ఈ రోజు ఆదివారం కదా , హాయిగా ఎంజాయ్ చేద్దామని మూడు సినిమా టిక్కట్లు తీసుకు వచ్చాను." జాలీగా టిక్కట్లు చూపుతూ అన్నాడు పవన్
" హాయిగా ఎంజాయ్ చేద్దామంటున్నారు మరి మూడో టిక్కట్టు ఎవరి కోసం తీసుకువచ్చారు ?" ఆశ్చర్యం గా అడిగింది శ్రీమతి కనకం
" నీకు, మీ అమ్మా నాన్నలకు " సాయంత్రం గీతతో అవుటింగ్ కలలో ఊహించుకుంటూ అసలు సంగతి చెప్పాడు పవన్.
2. "నాకూ మా ఆవిడకు గొడవ జరిగినప్పుడల్లా నేను కిరసనాయలు డబ్బా దాచేస్తాను" అన్నాడు మనోహర్.
" ఆహా ! ఎంత ముందు చూపురా నీది. ఆవేశం లో మీద కిరసనాయలు పోసుకొని ఎక్కడ అంటించేసుకుంటుందేమోనన్న భయం కదూ నీకు ?" అడిగాడు విక్రం.
"చ చ అదేం కాదు. గొడవ మొదలయ్యాక కోపం తో ఎక్కడ నా మీద పోసి అంటిస్తుందేమోనన్న భయం నాకు" చల్లగా అసలు సంగతి చెప్పాడు మనోహర్.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 29, Jun 2009 2:15:45 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|