
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 12 ! | |
| 1."ఈ రోజు నేనొక గొప్ప విషయాన్ని కనిపెట్టాను.సూర్యుని కంటే చంద్రుడే ఎంతో గొప్పవాడు, తెలుసా ?"కాలరెగరేస్తూ అన్నాడు గోవర్ధనం.
" ఎలా చెప్పగలవు " ఆశ్చర్యంగా అడిగాడు పరమేశం.
" సూర్యుడు పగటిపూట అక్కర్లేనప్పుడు వెలుతురు ఇస్తాడు. అదే చంద్రుడు అయితే వెలుగు లేనప్పుడు, అది కావల్సినప్పుడు ఇస్తాడు, అందుకే సూర్యుని కంటే చంద్రుడే ఎన్నో రెట్లు గొప్ప " ఐన్ స్టీన్ లా అసలు సంగతి చెప్పాడు గోవర్ధనం.
2. " ఇదేమిటి సార్,పార్కింగులో పెట్టిన కారు యొక్క రెండు చక్రాలు విప్పదీస్తున్నారు ?" ఆఫీసరు గారిని ఆశ్చర్యం గా అడిగాడు మన్మధరావు.
" నేనేమైనా తెలివి తక్కువ వాడిననుకున్నావుటోయ్ మన్మధరావూ. పైన పెట్టిన బోర్డులో పార్కింగు ద్విచక్ర వాహనములకు మాత్రమే అని రాసి వుంది కదూ, అందుకే పోలీసులు పట్టుకోకుండా ఈ ఏర్పాటు" గర్వంగా మీసాలు తిప్పుతూ చెప్పాడు ఆఫీసరు జంబూకం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 6, Jul 2009 4:25:47 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|