
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 13 ! | |
| 1.“ఏమిటోయ్ సుబ్బారావు ? హఠాత్తుగా పొద్దున్నే సతీ సమేతం గా ప్రయాణం కట్టావు ? ఎక్కడికి ?” ఆసక్తిగా అడిగాడు పుల్లారావు పళ్ళు తోముకుంటూ.
“ మా అల్లుడు సకుటుంబ సపరివార సమేతం గా వస్తున్నానని రాత్రే ఫోన్ చేసాడు. వచ్చాడో నెల రోజుల వరకు కదలడు,పైగా ఇల్లంతా గుల్ల చేసి వదుల్తాడు. చెంచాలను సైతం వదిలిపెట్టని పిసిని గొట్టు వెధవ. అందుకే ముందు జాగ్రత్తగా తీర్ధ యాత్రలకు ప్రయాణం కట్టాను. అల్లుడిఎ పీడా వదుల్తుంది, పుణ్యం, పురుషార్ధం కూడా వస్తాయి” హడావిడిగా సామాను బయటకు చేరవేస్తూ చెప్పాడు సుబ్బారావు.
2. “ ఈ రోజులలో అడ్డుక్కుతినేవాళ్ళు కూడా హైటెక్నాలజీని ఉపయోగిస్తున్నారు తెలుసా !” అన్నాడు గోపి.
“ ఏమైంది ?’ అడిగాడు రాజు.
“ ధర్మం చేయమని ఆన్ లైన్ అక్కౌంట్ వివరాలను ఎస్ ఎం ఎస్ పంపిస్తున్నారు “ అసలు సంగతి చెప్పాడు గోపి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 14, Jul 2009 3:16:18 PM IST 1. " నేనంటే నా భార్యకు ఈ మధ్య ఎంతో ఇష్టం పెరిగింది." గర్వంగా అన్నాడు రాజు
"ఎలా చెప్పగలవు ?" అడిగాడు గోపి.
"అర్ధ రాత్రి ఒంటి గంటకు ఇంటికి వస్తున్నా అంట్లు తోమేందుకు వేడి నీళ్ళు పెట్టి ఇస్తుంది.బొగ్గుపొడికి బదులు నిర్మా ఇవ్వడం మొదలు పెట్టింది.బట్టలు ఉతికెందుకు సబ్బులో నానేసి రెడిగా వుంచుతుంది. అన్నం తినదానికి నేనెంత కష్టపడతానో అని ఏమీ మిగల్చకుండా అని మొత్తం తినేసి గిన్నెలు ఖాళీ చెసేస్తుంది" అసలు సంగతి చెప్పాడు రాజు.
2. "బ్యాంకు వాడి కూతురిని పెళ్ళి చేసుకోవడం చాలా తప్పయిందిరా !" విచారం గా అన్నాడు సూరి.
"ఏమయ్యింది ? మంచి కుటుంబం , బ్యాంకు సంబంధం , ఇక కట్న కానుకలకు లోటు వుండదని అంటూ ఎగిరి గంతేసి చేసుకున్నావుగా పెళ్ళి ?" అడిగాడు రాము.
" అంతా నా ఖర్మకు వచ్చింది.కట్నం గా ఇచ్చిన ప్రతీ వస్తువుపై గోపాలం గారి ఆర్ధిక సహాయం తొ అని రాయించి మరీ ఇస్తున్నాడు మా మామగారు. ఇంటికి వచ్చే వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను" ఏడుపు ముఖం తో అసలు సంగతి చెప్పాడు సూరి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 13, Jul 2009 9:40:09 AM IST (1)ఎందుకే ఈ పచ్చడి బండను షో కేసులో పెట్టావు ? ఏమిటి దాని ప్రత్యేకత ? " అడిగింది రాజి.
" నేను కాపురానికి వచ్చిన వారం రోజుల లోనే ఈ పచ్చడి బండకు గుద్దుకొని పడిపోయే మా అత్తగారు టపా కట్టేసింది.నాకు అత్త పోరు లేకుండా చేసింది. అందుకే ఈ పచ్చడి బండ అంటే నాకెంతో ఇష్టం. దానిని అపురూపం గా దాచుకున్నాను." గర్వం గా చెప్పింది రేఖ.
(2)" ఈ ఆపరేషన్ థియేటర్లో పూల దండ ఎందుకు పెట్టారు సార్ ?" ఆదుర్దాగా అడిగాడు చిన్నారావు.
" ప్రాక్టీస్ మొదలెట్టిన దగర్నుంచీ నేను చేస్తున్న మొదటి ఆపరేషను ఇది.సక్సెస్ అయితే దేవుడికి వేస్తాం. ఫెయిలయితే నీకు వేస్తాం" తాపీగా కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు డాక్టర్ దైవాధీనం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 12, Jul 2009 5:04:08 PM IST మా ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా సరే రెండు రోజులకు మించి వుండరు తెలుసా ?” గర్వంగా భుజాలెగరేసుకొని అన్నాడు పాపారావు
“అరే. అలా ఎలా మానేజ్ చేయగలుగుతున్నావురా ? నాకు కూడా కొంచెం చెప్పు. చుట్టాల తాకిడితో చచ్చిపోతున్నాం “ అడిగాడు అప్పుల అప్పారావు.
“ చుట్టాలొచ్చిన దగ్గర నుండీ కాఫీ, టిఫిన్ల తొ పాటు వంట కూడా మా ఆవిడ చేత వండిస్తాను. అంతే ఆమె చేతి వంటకు తట్టుకోలేక రెండు రోజులకే అందరూ పరార్ !” అసలు సంగతి చెప్పాడు పాపారావు.
“ఇప్పటికే మీ చూపు చాలా మందగించింది. వెంటనే గుట్కా తినడం మానక పోతే చూపు వెంటనే పోయే ప్రమాదం వుంది. జాగ్రత్త “ కోపంగా అన్నాడు డాక్టర్ దైవాధీనం
“డాక్టర్ గారు. నేను వయసు మళ్ళిన వాడిని. చూడవల్సిన విషయాలన్నింటినీ ఇప్పటికే చేసేసాను. ఇప్పుడు కొత్తగా చూపు పోతే మాత్రం వచ్చే నష్టం ఏముంది గనుక “ నిట్టూరుస్తూ జేబు లో నుండి గుట్కా పాకెట్టు తీసి నొట్లో వేసుకున్నాడు వెంకటాచలం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 11, Jul 2009 10:13:58 AM IST 1." నువ్వు ఇంకా రెండు రోజుల కంటే బ్రతకవు. నీ ఆఖరి రొజులలో ఎవరినైనా కలవాలనుకుంటున్నావా ? " అడిగాడు డాక్టర్ దైవాధీనం
" అవును. ఒక మంచి డాక్టర్ ను కలవాలనుకుంటున్నాను" అసలు సంగతి తాపీగా చెప్పాడు పరమేశం.
2. " ఒక సీరియల్ లో మీరు అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ పాత్రలు వేస్తున్నారట కదా ! బహుశా తెలుగు టి వి పై త్రిపాత్రాభినయం ఇదే మొదటి సారి అనుకుంటున్నాను.కంగ్రాచులేషన్స్. ఒకే సీరియల్ లో మీరు ఒకేసారి మూడు పాత్రలు ఎలా వేయగలుగుతున్నారు ?" ఆసక్తిగా అడిగాడు సినిమా పత్రికా విలేఖరి.
" ఏముందీ, వెరీ సింపుల్. ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ పూర్తయ్యేసరికి అమ్మను అయిపోతాను. మరి వెయ్యి ఎపిసోడ్స్ కు ఏజ్ బార్ అయ్యి నాచురల్ గా అమ్మమ్మ పాత్రను పోషించేస్తాను" అసలు సంగతి చెప్పింది వర్ధమాన నటి శిరీష..
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 10, Jul 2009 3:03:05 PM IST 1. " నేనెంత కన్విన్స్ చేస్తున్నా మా పేరెంట్స్ మన పెళ్ళికి ఒప్పుకోవదం లేదు !" పెదవి విరుస్తూ అంది రేఖ.
" మరైతే ఏం చేద్దాం ? లేచి పోయి పెళ్ళి చేసుకుందామా ?" అడిగడు శేఖర్.
"అటువంటి నీచపు పనులు మా ఇంటా వంటా లేవు.ఇంక మనము బ్రతికి వేస్ట్ అనిపిస్తోంది నాకు"
" ఏం చేద్దాం"
" నువ్వు ఏ రైలు కిందో తల పెట్టేయి."
" నాకైతే ఒ కె, మరి నువ్వో?"
" నువ్వు లేని జీవితాన్ని ఊహించుకుంటూ,మన గతపు అనుభవాలను నెమరు వేసుకూంటూ ఏ గొట్టం గాడినో పెళ్ళి చేసుకొని బ్రతికేస్తాను " తాపీగా చెప్పింది రేఖ.
2. " నీ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధం గా వున్నాను. ఏం చెయ్యమంటావో చెప్పు. సింగిల్ హాండ్ తో కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ ను నడపమంటావా ?లేక నిన్ను ఎత్తుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కమంటావా ?" ఆవేశం గా అడిగాడు మన్మధరావు.
" అవేం వద్దులే గాని, నేను రేపు ఫస్ట్ షో కి ఐమాక్స్ లో సుశాంత్ తో సినిమాకు వెళదామనుకుంటున్నాను. మా ఇద్దరికీ రెండు టికెట్లు తెచ్చి ఇవ్వు చాలు " అసలు సంగతి చెపింది భార్గవి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 9, Jul 2009 2:18:33 PM IST 1. " మా ఆయన ఈ మధ్య బాగా మారిపోయారు తెలుసా ?" ఏడుస్తూ అంది రాధ.
" ఏమయ్యిందో చెప్పవే,నాకు తోచిన సలహా ఇస్తాను" అనునయం గా అంది అనురాధ.
" పెళ్ళి కాకముందు ప్రేమిస్తున్నానంటూ వెంటబడే రోజులలో నువ్వు లేకుండా బ్రతకలేనంటూ హుషారుగా పాత సినిమాలలో శోభన్ బాబులా సినిమా డైలాగులు చెప్పేవారు. ఈ మధ్య జీవితమే నరకం, జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటే అంటూ మజ్ఞూ లా విషాదం గా పాటలు పాడుతున్నారు" ముక్కు చీదుతూ అసలు సంగతి చెప్పింది రాధ.
2. " ఏమిటండీ ఈ రోజు ఇంత త్వరగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసారు ?" మూడు గంటలకే ఇంటికి చేరుకున్న భర్త గణేశ్ ను అడిగింది భార్య కమల.
" ఫైలు తీసుకెళ్ళి ఆఫీసరు గారి ముందు పెడితే కోపం గా నాలుగు తిట్లు తిట్టీ గో టు హెల్ అన్నాడు. వెంటనే ఇంటికి అదే నా హెల్ కు వచ్చేసాను" అసలు సంగతి చెప్పాడు గణేశ్.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 7, Jul 2009 1:28:18 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|