
|
|

General Forum: Poetry | మధుర భాషణం | |
| మీరు Title మధుర భాషణం అన్నారు. మధుర భాషణమంటే soft speaking skills అనుకొంటాను. అంటే నొప్పించకుండా మాట్లడడం. అపద్ధాలు చెప్పేవారు కూడ soft గానె మాట్లాడతారు. అయితే సత్య భాషణమమంటే నిజం మాట్లడడం.
మీ కవితలో మొదటి వాక్యం మాత్రమే మధుర భాషణం గురించి తెలుపుతుంది. మిగిలిన వాక్యాలు ఉదా: రాముడు, గాంధీ, హరిచ్చంద్ర వున్న వాక్యాలు సత్యం, ధర్మమనే గుణాలను తెలుపుతాయి. కావున మీరు మధుర భాషణమా లేదా సత్య భాషణం గురించి వ్రాయలను కొన్నారొ తెలియదు.
మరియు చాల చోట్ల ఒకే భావం, లేదా మాటలు repeat అయ్యాయి. ఉదా: "ఆడి మాట తప్పడమన్న" లేదా "మాట జారడమన్న" ఒకటే కదా.
అలాగే కఠినమైన మాటలన్న, పరుష పదజాలమన్న ఒకటే. ఇవి రెండు చోట్ల వాడడం వల్ల ఒకే భావం రెండు సార్లు చెప్పినట్లవుతుంది.
Repetitions తగ్గించి compact గా ఇంకా మంచి భావమోచ్చునట్లుగా కవిత వ్రాయగలరని నా భావం.
Posted by: jhon Reddygaru At: 22, Jul 2009 5:23:59 AM IST మంచి మాటలు మనసుకు పట్టు వస్త్రాలు
పరుష పదజాలం, ఆడిన మాట తప్పడం
మాట జారడం విషపు జంతువుల వంటివి
ఏదోనాటికి మనం బలి కావడం తధ్యం
ఆడిన మాట కోసం అడవులకేగిన కోదండరాముడు
అసత్యమాడక భార్యాబిడ్దలను సైతం తెగనమ్ముకొని
కటిక దరిద్రమనుభవించిన సత్య హరిశ్చంద్రుడు
సత్యమే ఆయుధముగా రవి అస్తమించని బ్రిటీషు
సామ్రాజ్యవాదులను తరిమి కొట్టిన మహాత్ముడు
జన్మించిన పవిత్ర భారతావనిలో జన్మ
నెత్తడం మన పూర్వ జన్మ సుకృతం
కఠినమైన మాటలు, అసత్యపు పలికులను విడనాడిన
ప్రశాంత బృందావనిలో జీవవం సాధ్యం
మాటలడుట చేతకానిచో మౌనమే ఉత్తమం
చితి మంటలు దేహలను మాత్రమే దగ్ధం చేయును
పరుషమాట హృదయాలను సైతం కాల్చివేయును
జన్మ జన్మల బంధములు సైతం కకావికలమైపోవును
Posted by: Mrs. Kanaka Durga At: 14, Jul 2009 4:13:47 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|