
|
|

General Forum: Love | స్నేహబంధం | |
| స్నేహబంధం
ఎంతో మధురం మధురం స్నేహబంధం
సంపాదించే సిరి సంపదలు, గౌరవ మర్యాదలు
ఈ జన్మతోనే సరయితే
జన్మ జన్మలకు వెంట వచ్చేదే స్నేహ బంధం
స్నేహ మకరందాన్ని ఆస్వాదించి
ఆ మాధుర్యాన్ని మనకు పంచి ఇచ్చిన
శ్రీకృష్ణుడు, రామకృష్ణ పరమ హంసలు మనకు ఆదర్శం
ఎంత ఆస్వాదించినా తనివి తీరనిది
నిజమైన మిత్రుని సాన్నిధ్యం
గ్రీష్మ తాపంలో చల్లదన్నానిచ్చే వృక్షంలా
కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నప్పుడు దొరికే ఆలంబనలా
దుఖంలో మునిగి వున్నప్పుడు వచ్చే ఓదార్పులా
స్నేహితుని సన్నిధి అపూర్వం, విలువ అనంతం
మంచి స్నేహితుడు లేనివాడు
మంచి స్నేహితుడు కాలేని వాని బ్రతుకు వ్యర్ధం
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 3, Aug 2009 4:38:48 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|