
|
|

General Forum: Poetry | శిరిడీ సాయి వైభవం | |
| శిరిడీ సాయి వైభవం
శిరిడీ సాయి వైభవం అపూర్వం అసామాన్యం
అద్వితీయం, వర్ణింప శక్యం కాదు
అఖంఢ బ్రహ్మ జ్ఞాన నిష్టుడు
సాటిలేని సిద్ధపురుషుడు
పరమ గురుదేవులు, విశ్వగురువు
ప్రపంచమును పాలించు మహనీయులకు
సర్వ రక్షకులైన సద్గురువులకే సామ్రాట్
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు
యోగిరాజు, కలియుగదైవం శ్రీ సాయినాధులు
జన్మ జన్మల ఆవేదన, అశాంతి, కష్టనష్టములు
సాయి దర్శనం తోనే పటాపంచలు
అనితర సాధ్యం కాని రోగములు కేవలం
శ్రీ సాయి దర్శనం తోడనే పటపంచలు
ఆనితర సాధ్యం కాని రోగములు
కేవలం స్పర్శ తోనే మటుమాయం
సాయి కటాక్షం వలనే పరమశాంతి
మోక్షం, ఆత్మ జ్ఞనం ప్రాప్తం
సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, సప్తశృంగీ దేవిలు
తమ ప్రశిష్యులను సాయి దర్శనం కొరకు
పంపిన వైనం పరమాద్భుతం
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 6, Oct 2009 8:18:56 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|