
|
|

General Forum: Poetry | కవితా సమాహారం | |
| కర్మ సిద్ధాంతం
చేసిన కర్మలకు ఫలితమనుభవించక తప్పదు
ఎవరి సక్రమ ప్రవర్తన వారిని కాపాడును
నీతి, నిజాయితీలతో కూడిన ప్రవర్తన
సదా భగవన్నామస్మరణ
పరులకు చేతనైనంత సేవ
సదా సమాజ శ్రేయస్సు కొరకు
చిత్తశుద్ధితో కృషి సల్పుట
ఇవియే మనకు శ్రీరామరక్ష
భగవంతునికి చెడు అంటే గిట్టదు
దురాశ, రాక్షస ప్రవృత్తి
హింసా నైజం, పరుల దుషనం
ఇత్యాది దుర్గుణములతో
చెడు పంధాలో పయనించు వారికి
అన్నటికైనా తప్పదు వినాశనం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 12, May 2011 11:37:01 AM IST సాయి దివ్య నామం సకల పాప హరణం
అదియే మోక్ష తీరం, వేద సారం, అతి మధురం
మంచి నీటితో దీపములను వెలిగించి
బేహారుల హృదయములలో అజ్ఞానంధకారములను తొలిగించి
దివ్యమైన జ్ఞాన మార్గమును జూపి
బ్రోచిన సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధులు
అత్యాశతో పరుగులు తీయ యత్నించిన
దాము అన్నాకు హిత బోధ గావించి
శాశ్వత పరమానందమునకు దారి జూపిన
దేవదేవుడు కలియుగ దైవం శ్రీ సాయి
నిరుపేదలకు ధన పెన్నిధి
గురు భక్తులకు దత్తునిగా
నమ్మి కొలిచిన భక్త జనావళికి
ఆశ్రిత కల్పవృక్షమై
భాసిలిన్న త్రిమూర్తి స్వరూపం
పరిశుద్ధ పరమేశ్వర అవతారం శ్రీ సాయి
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 7, Oct 2009 8:59:34 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|