Discussion on Poetry in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Poetry
నా అంతరంగం
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
బంద్..బంద్..బంద్ బందులు బాబోయ్ బందులు స్వార్ధ ప్రయోజననాల కొరకు మన నేతాశ్రీఅ ఆయుధం సామాన్యుల జన జీవనం అస్థవ్యస్థం విధ్వంసకర ఘటనలలో ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం ఈ బందులు మాకొద్దు బాబోయ్ అంటూ జనం ఘోషిస్తున్నా,గగ్గోలు పెడుతున్నా నిమ్మకు నిరెత్తినట్లు మిన్నకుండే ప్రభుత్వాలు బందులను నొషేధించమంటూ షుప్రీం కోర్ట్ తీర్పును చేసారు బుట్ట దాఖలు ఎన్నటికి కలిగేను బంద్ ల నుండి విముక్తి ?

Posted by: Mrs. Kanaka Durga At: 20, Dec 2009 9:06:59 AM IST
సమాజ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు కాంక్షించి తమ ఆదాయములో కోంత భాగం దిక్కులేని అన్నార్తులకు దాన మొనరించడం అత్యావశ్యకం నిరుపేదల జీవితములలో వెలుగు దాతల హృదయములలో కరుణ ప్రేమ, జాలి ఇత్యాది సద్గుణముల జననం అందరిజీవితములలో వికాసం దీన్నార్తులను ఆదుకోని బ్రతుకులు కడు వ్యర్ధం వారు ఒనరించు ఆరాధనల ఫలితం స్వల్పం పరులకు దానమొనరించని సిరి సంపదలు వ్యర్ధం హీనమైన మరు జన్మలు పోందుట తధ్యం

Posted by: Mrs. Kanaka Durga At: 19, Dec 2009 9:08:10 PM IST
హత విధీ ! పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు అధిక శాతం మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితి నాణ్యమైన బోధన మృగ్యం మొక్కుబడి విద్య, కానరాని క్రమశిక్షణ అధిక ఫీజుల వసూలు పైనే దృష్టి నిబంధనలను గాలికొదిలేసిన వైనం అనుమతులు లభించడం విడ్డూరం లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ఎన్నటికీ కలిగేను జ్ఞానోదయం ? మంచితనం - మానవత్వం మంచితనం,నలుగురితో కలయిక వారిని మన్మలో కలుపుకోవడం మనవాళ్ళుగా భావించడం అందరి బాధల్నీ, బాధ్యతల్నీ మనవిగా భావించి పంచుకోవడం వున్నదానిని నలుగురికీ పంచి ఇవ్వడం ఇంటి తలుపులనే కాక మనసు తలుపులనూ తీచి వుంచడం ఏ వత్యాసం లేక అందరినీ ఆహ్వానించడం ఎదుటివారి మంచిని హర్షించి వారి చెడును విస్మరించడం ఇదే మనిషి జీవించాల్సిన విధానం ఇంటి వైశ్యాలయం కంటే మనసు గది వైశాల్యం ఆవశ్యం అందరి హృదయాలను గెలవడమే మన నిజమైన గెలుపు

Posted by: Mrs. Kanaka Durga At: 17, Oct 2009 9:16:27 AM IST
తెలుగు భాష అమ్మ ముద్ద కమ్మదనం నాన్న ఒడి వెచ్చదనం అమ్మమ్మల ప్రేమానురాగాలు భార్య అధరం లోని మాధుర్యం తొలి ప్రేమ పారవశ్యం మల్లెపూల సుగంధ పరిమళం తొలకరి చినుకుల పులకరింత పచ్చని పంటల పైరగాలి సౌఖ్యం పున్నమి వెన్నెల చల్లదనం పసివారి నవ్వుల అహ్లాదం మంచి స్నేహితుని సన్నిధి వీటన్నిటికంటే తెలుగు భాష మాధుర్యం అంటే నాకెంతో ఇష్టం

Posted by: Mrs. Kanaka Durga At: 12, Oct 2009 7:39:41 PM IST
సంతృప్తి జీవితం లో లభించినదానిని కోరుకొనుట ఆనందించుట సంతృప్తికర జీవనానికి సోపానం లేని దాని కోసం అర్రులు చాచడం ఎడతెగని కోరికల సాఫల్యం కొరకు అవిశ్రాంతంగా పరుగులు తీయడం అవివేకం విలువైన జీవితం వృధా చివరకు మిగిలేవి దు:ఖం అశాంతి, అసంతృప్తులే ! జగృతితో శాశ్వ్తతమైన దాని కోసం యత్నించడమే మన కర్తవ్యం

Posted by: Mrs. Kanaka Durga At: 11, Oct 2009 8:56:57 PM IST
జీవితం జీవితం ఒక ఆట సర్వ శక్తులు ఒడ్డి ఆడు జీవితం ఒక పోరాటం శక్తి యుక్తులు కూడదీసుకొని పోరాడు జీవితం ఒక పాట సర్వం మరిచి హాయిగా పాడుకో జీవితం ఒక పజిల్ తెలివితేటలతో సాధించు జీవితం బ్రహ్మ గీసిన గొప్ప చిత్రం అణువణువూ ఆనందించు జీవితం ఒక అపూర్వ వరం ప్రతీ నిమిషం జీవించి విజయం సాధించు

Posted by: Mrs. Kanaka Durga At: 11, Oct 2009 12:55:55 PM IST
ధర్మాచరణ ధర్మో రక్షతి రక్షిత: అన్నది అజరామరమైన వేదవాక్కు సర్వాకాల సర్వావస్థలయందు ధర్మాచరణ భారతీయుల కర్తవ్యం ధైర్యం,ఓర్పు, మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం, శాంతం సమాజ సేవ, సత్య భాషణం అలవర్చుకోవల్సిన సద్గుణములు ధర్మ హీనమైన జీవితం చంద్రుడు లేని రాత్రి వలే శోభించవు ఎన్నో హంగులు సమకూరిననూ ధర్మమును పాటించని జీవితం నిరర్ధకం కామ క్రోధాధి దుర్గుణములను జయించి వీలైనంతగా దాన ధర్మములను గావిస్తూ శాస్త్రములు విధించిన కర్మలను విధిగా ఆచరించు వారే ధర్మాత్ముల వలే ప్రసిద్ధి నొందెదరు

Posted by: Mrs. Kanaka Durga At: 7, Oct 2009 9:03:47 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.