
|
|

General Forum: Religion | bhagavantuniki bhaktuniki madhya anusandhaanamainadi EnTi?? | |
| జైబాబా
గీతానామ సహస్రం
నప్రహృష్యే త్ప్రియం ప్రాప్య
నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం
స్థిరబుధ్ధి రసమ్మూఢో
బ్రహ్మ విద్ర్బ్రహ్మణి స్థితః
బ్రహ్మ ఙ్ఞాని సదాబ్రహ్మ భావముతో నుండి ప్రియమైనవి పొందినప్పుడు సంతోషించుట అప్రియమైనవి అనగా
అయిష్టమైన వి తనకు దాపురించినప్పుడు దుఃఖించుట యుండదు. నిజానికి స్థిరబుధ్ధి కలిగినవానికే బ్రహ్మ ఙ్ఞానము
లభిస్తుంది.ఉన్నదానితో తృప్తిపొంది గొంతెమ్మ కోర్కెలు అనగా తనకు లభించదని తెలిసినా వాటి కొరకు అరాటపడని
వారికి మాత్రమే స్థిరబుధ్ధి కలుగుతుంది.కోరికెలు లేకుండుటే తృప్తి.
కామ క్రొధాలు మనిషికి ప్రాణమున్నంతమటుకు ఆవరిచియుండును.ప్రాణము తొలగిన శవమునకు మాత్రము
ఆత్మీయుల ఏడ్పులకు గాని.కట్టెతో కాల్చినా మట్టి వేసి పూడ్చినా స్పందన యుండదు-అట్టి స్థితి బ్రతికియున్నప్పుడే
కలగాలి అని అనుకున్నప్పుడు మానవుడు బ్రహ్మ ఙ్ఞానులవద్ద కఠోర దిక్షతో శిక్షణ పొందాలి.చలములో నీరు
ఉబికినట్లు మనసులో కోరికెలు పుట్టుచుండును.ఒకటీ అరా కోరిక తీరినంత మాత్రమున తృప్తి కలుగదు,అందుకే నేమో
విష్ణు భగవానునికి తృప్తి అనేది యుండదుట కనుకనేఅనల అని సార్ధక నామధేయం -భక్తులకు ఎన్ని కోరికెలు
తీర్చినా ఆయనకు త్రృప్తియుండదుట.కోరికలు పుట్టించే మన్మధుని భస్మము చేస్తే శివుడు
భండాసురుడుపుట్టాడు-కోరికలు లేక మనుషులే చైతనయరహితులైనారు అప్పుడు శ్రీ లలితా పరమేశ్వరి
ఉద్భవించుట జరిగినది.
జౌబాబా
భగవంతునికి కామద అని కామ కృత్ అని రెండు నామాలు విష్ణుసహస్రములో ఒకదానివెంబడి మరొకటి యున్నవి
.కోరికెలు లేకుండా చేసే వాడు,కోరికెలు తీర్చేవాడు-ఈరెండూ ఒకదానికొకటి విరుధ్ధమైన అర్ధమునిస్తున్నా-ఆయనను
మనసులో నింపుకొనుటకు చేయాలి సాధన ఇందుకు కావాలి ఏకాగ్రత -అది కోరికలున్న మనసుకు
సాధ్యముకాదు-ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా-సాధనా ప్రక్రియలో కోరికలు లేకుండా ఉండు విధముగా
మనము ప్రయత్నించినచో సిధ్ధావస్థ లో భగవానుడే మనకేది అవసరమో అది చూస్తాడు.గీత రెండవ అధ్యాయములో
55వ శ్లోకమున మనసులో విషయ సంకల్పములను ప్రయత్న పూర్వకముగా విడచినవాడే బ్రహ్మ వేత్త అని భగవద్
వాణి.తదుపరి సిధ్ధావస్త పొందిన జీవునికి "ధర్మా విరుధ్ధో భూతేషు కామే2అస్మి భరతర్షభ
"సాత్త్వికులధర్మవిరుధ్ధముకాని కామము నేనే అని 7వ అధ్యాయము 11వ శ్లోకమున వివరించుట
జరిగినది.ధర్మబధ్ధమైన కోరికలు సాత్త్విక భావాలు తనకు సమాజానికి ఉపయోగపడే కోరికలు మంచివే -వాటిని
భగవానుడు సఫలీకృతము చేయును.
జైబాబా
బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా విందత్యాత్మని య స్సుఖ మ్
స బ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖమక్షయ మస్నుతే
బాహ్య విషయములు అనగా లౌకిక వాంఛలందు ఆసక్తి లేనివాడై నిరతము ఆత్మానందమనుభవించు బ్రహ్మవేత్త
నాశ రహితమైన బ్రహ్మపదమును పొందును.ఆ బ్రహ్మ పదమునందు "నతద్భాసయతే సూర్యో న శశాంకో నపావకః
ఆ పరమపదమును సూర్యుడు గాని, చంద్రుడుగాని అగ్ని గాని ప్రకాశింప జేయలేవు"అని తదుపరి 15 వ
అధ్యాయములో బ్రహ్మపదవిశిష్టత వివరించుట జరిగినది.బాహ్య విషయములతో సంబంధం కలిగించేవి
కండ్లు,చెవులు,నోరు,కాళ్ళు చేతులు,శిరసు-వీటివలనే లౌకిక విషయములందు ఆశక్తి కలుగుతుంది,హృదయమునకు
అనగా ఆత్మకు వీటితో సంబంధము ప్రత్యక్షముగా యుండదు,అందువలన బాహ్య విష్యములందు అసక్తత మనసును
ఆత్మయందు లగ్నము చేసిన వానికి అనగా బ్రహ్మ తత్త్వమును గురించి విచారించేవానికి యుండదుమనసు
ఆత్మయందు లగ్నము చేయుట యు ఆత్మ బ్రమ్హ భావనయందు లగ్నమగుట -ఈ రెండు ప్రక్రియలు
ఒకటే.మనసును ఆత్మయందు లగ్నముచేయుట ధ్యాన యోగము వలన మాత్రమే సాధ్యమని
పెద్దలందురు..అట్టివానిని బ్రహ్మ యోగ యుక్తాత్మా అనెదరు.అటువంటి యుక్తాత్ముడు శాశ్వతమైన
నిత్యానందమునిచ్చు పరమ పదము పొందుటకు ప్రయత్నించును కాని అల్ప సౌఖ్యము క్షణికములగు భోగములకు
ఆసక్తి చూపడు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 13, Sep 2011 9:51:12 PM IST జైబాబా
గీతానామ సహస్రం
మట్టి తో కప్పబడిన యంత్రమును శుభ్రము చేసిన చో ప్రకాశించినట్లు ఆత్మ తత్త్వమెరిగిన జీవుడు కూడా ప్రకాశించి భగవత్ తత్త్వాన్ని సాక్షాత్కరించుకొని శోక రహితుడగునని శ్వేతాశ్వతరోపనిషత్ తెలుపుచున్నది. ఆభగవత్ తత్త్వమును విష్ణు సహస్రనామావళి వివరించినది.
భగవానుడు జీవ రాశులలో అంతర్యామి ఇతడు లోన బయట నుండును,జీవరాశులు లయమైన వెనుకగల అంతర్యామిగా నున్న వానికి లోపల బయట అన్న బేధములేదు,లోకమున క్షరుడని అక్షరుడని ఇరువురు పురుషులు కలరు .జీవరాసుల శరీరములు క్షరమనియు, ఇంద్రియాలకు శరీరమునకు అతీతమగు ఆత్మ కూటస్తుడనియు,క్షరాక్షరులకన్న వేరగు ఉత్తమ పురుషుని పరమాత్మ యని పిలచెదరని గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున తెలిపెను.ఆ పురుషోత్తముడు కాలతీతుడని,అతడే గణిత శాస్త్రములో లెక్కించుటకు ఏర్పరచిన కాలమను కొలమానము తానేనని,ప్రాణవాయువునందించే పవనుడనని భగవానుడు గీతలో చెప్పినది విష్ణు సహస్రనామావళినందు భూత భవ్య భవన్నాధః పవనః,పావనః అనలః అని కీర్తించునపుడు స్మరణీయము.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 7, Jul 2011 11:46:51 AM IST జైబాబా
గీతానామసహస్రం
వేదాలలో విహిత కర్మలున్నవి,నిషిధ్ధ కర్మలున్నవి.సమభావన అనగా ఈ రెండు రకాలవాటిని సమ భావముతో చూడమని కాదు.విహిత కర్మలలో మనకు ఆచరణ యుక్తమైనవి ఆచరించుట,నిషిధ్ధకర్మలలో మనకు అలవాటైనవి మానకుండుట అనే బేధ భావము వదలమని ఇందలి అంతరార్ధమని పండితులు వ్యాఖ్యానించిరి.
పొగ వచ్చుచున్న గదిలో నున్న వానికి ఆ పొగ బాధ తగిలినట్లే ప్రకృతిలో మానవుడు బాధలు భరించక తప్పదు.పొగ నివారణకు చేయు ప్రయత్నము మాదిరిగానే జననమరణ బాధలనివారణకు ఆత్మఙ్ఞాన సంపార్జన ఒక సాధనము .ఆత్మఙ్ఞానాము లభించినప్పుడు ఆతడు ఉన్నత శిఖరముమీద యున్నవానితో సమానమేకాని చిన్న ఇరుకు గదిలో యున్నవానిగా భావించరాదు.ఈజనన మరణ చక్రములో తిరుగుచూ పడే సంసారిక బాధలన్నిఆత్మఙ్ఞానము లభించని వారికే.
య ఇమం మధ్వదం వేద
ఆత్మానం జీవ మంతికాత్
ఈశానం భూతభవ్యస్య నతతో
విజుగుప్సతే ఏతద్ వైతద్
ఎవరు ఈ తేనెను (కర్మఫలము మధువు లాంటిది)ఆస్వాదిస్తున్న,జీవితాన్ని పోషిస్తున్న ఆత్మను
దగ్గరనుండి తెలుసుకుంటాడో ఆతడు తన్ను తాను దాచుకో గోరడు-ఎవరికీభయపడడు.భూత భవిష్యత్ లకు ప్రభువైన పరమాత్మను పూర్తిగా తెలుసుకొనును.
విష్ణుసహస్రనామావళిలో
భూత భవ్య భవన్నాధః పవనః పావనో అనలః
కామహా కామకృత్ కాంతః కామః కామ ప్రదఃప్రభుః
పరమాత్మ అన్ని జీవులకు అన్నివేళల ప్రభువు-కాలదేవతనేజయించినవాడు-అందుకే ఈశానాం భూత
భవ్యస్య-అని కఠోపనిషత్ చతుర్ధవల్లి లో రెండు మార్లు స్తుతించినది
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 28, Jun 2011 7:08:43 PM IST జైబాబా
గీతానామ సహస్రం
సమత్వభావన అనగా అనిత్యవస్తువులలో నిత్య వస్తువగు ఆత్మయు చైతన్య వంతమైన వాని లోని చైతన్యము ఒక్కటే అని భావించుట. అనిత్య వస్తువులలో నిత్య వస్తువునకు ఉదాహరణగా సినిమా తెరకు దాని మీద కనిపించే బొమ్మలు.సినిమా తెర మారదు,మారేవి బొమ్మలు మాత్రమే.
"ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం యే అనుపస్యంతి ధీరా"-అనేకుల కోర్కెలను నెరవేర్చే పరమాత్మ తనయందే యున్నాడని తలచే వాడు తన కోర్కెలు తీర్చుకొనుట కితరప్రయత్నాలు చేయవలసిన పనిలేదు.కోరికలు లేనివానికే సమత్వ భుధ్ధి యుండును.చలములో నీరు దానంతటదే ఉద్భవించినట్లు కర్మఫలాలు ఆతనికి సహజముగానే లభించును. శాశ్వతమైన శాంతి పొందును-అట్టివానినే జీవన్ముక్తుడనెదరు.
ఇహైవతైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః
ఎవరి మనస్సు సమత్వభావమున స్థిరముగ నుండునో వారు ఈ జన్మమునందే జీవన్ముక్తులు,బ్రహ్మము దోషరహితమైనది,సమమైనది,బ్రహ్మ నిష్టులు సమత్వభావము కలవారే కనుక బ్రహ్మమునందు వారు ను సదా స్థిరభావమున నుందురు. .
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 27, Jun 2011 9:46:46 AM IST జైబాబా
గీతానామ సహస్రం
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః
ఆత్మ ఙ్ఞానము పొందిన వానికి బ్రహ్మఙ్ఞానిని నందలి ఆత్మ జ్యోతిని,గోవునందలి పవిత్రాత్మని,పెద్దకాయముతో తిరుగాడు ఏనుగును,నీచముగా ప్రవ్తించు కుక్కనందలి చలన శక్తిని
కలిగించు ఆత్మను,చండాల వృత్తిలోని మానవుని ఆత్మను ,సమస్త భూతములందు అంతర్గతముగానునున్న ఆత్మను సమదృష్టి తో దర్శించును.బాహ్య దృశ్యము అందరికి కానవచ్చును,అత్మఙ్ఞానికి చర్మ చక్షులకు కానరాని ఆత్మ జ్యోతి సర్వత్రా తన మనో క్షేత్రమున దర్శన
మిచ్చుచుండును.అటువంటి ఆత్మఙ్ఞానము కలిగినపుడు మాత్రమే
ఓం సహనావవతు ,సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై-కలసి సహవాసము చేద్దాము,కలసి అనుభవిద్దాము,కలసి శ్రమిద్దాం, కలసి తేజోవంతులమగుదాము,ఒకరినొకరి ద్వేషించు కొనము అనే శాంతి మంత్రార్ధము ఆచరణలో పెట్టగలరు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 22, Jun 2011 11:33:05 PM IST జైబాబా
గీతానామసహస్రం
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే
సర్వభూతాలను తనలో దర్శించును,సర్వభూతాలలోను యున్నది తానేననని తలచే వానికి ద్వేషముండదు."తత్రకోమోహః శోక ఏకత్వ మనుపశ్యతః"-అతనికి మోహమెక్కడ శోకమెక్కడ?అతడు అన్నింటిని ఏకముగా చూచువాడు కదా!
"తద్బుధ్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః
గచ్చంత్య పునరావృత్తిం ఙ్ఞాన నిర్ధూత కల్మషాః !!
అట్టి ఆత్మ ఙ్ఞాని పవిత్రమైన బుధ్ధిచే విచారించి సదాబ్రహ్మ ఙ్ఞాన నిష్టుడై బ్రహ్మానందానుభూతి పొందుచుండును.ఆతని పూర్వజన్మ పాపములుసమస్తము నశించును.దేహానంతరము పునర్జన్మ యుండదు,మోక్షము పొందును.ఇందుకు కావాలి సదానిష్ట,సదా పరతత్వ చింతన-ఈ స్థితిలోనుండుటే తపస్సు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 14, Jun 2011 1:10:22 PM IST chaalaa baagaa vraasaaru baabaa gaaru
Posted by: Mr. Bhaskar At: 9, Jun 2011 11:33:22 PM IST జైబాబా
గీతానామసహస్రం
ఙ్ఞానము రెండు రకములు అందు ఆత్మతత్త్వము తెలుపు ఙ్ఞానమొకటి లౌకిక
ఙ్ఞానము తెలుపునది మరొకటి.సూర్యునివలె పరమాత్మను ప్రకాశింపజేయునది ఆత్మఙ్ఞానము.సూర్యుడు ఉదయించువరకు చీకటులున్నట్లు ఆత్మ ఙ్ఞానము కలుగు వరకు జీవుని అఙ్ఞానపు పొరలు కప్పియుంచును- జీవాత్మ సంసార బంధమున తగులుకొనిపలు కర్మలు నిరంతరము చేయుచు జనన మరణ చక్రబంధమున చిక్కుకొని యుండును.
సంసార సాగరములో మునిగితేలుచున్న వానికి ఆత్మ ఙ్ఞానము పూర్వజన్మ వాసనలచే కప్పి వేయబడి మశిబట్టిన లాంతరుగ్లాసునుండి వచ్చు మసకబారిన వెలుగువలె యుండును,అట్టి కనబడీ కనభడని వెలుగు లో వస్తువులు గుర్తించుట కష్టము,కనుక అతని ఙ్ఞానము పరిమితులకు లోబడియుండును.ఆత్మ ఙ్ఞాని సూర్య కాంతి తో వస్తువులు కనుగొనిన విధముగా పరతత్త్వమును తన లోను,బాహ్యముగాను,సకల జీవరాశులలోను,ప్రకృతి నందు దర్శించగలడు .ఇచట సూర్యుని ఆత్మ ఙ్ఞానము తోను అతని ప్రకాశమును పరతత్త్వముగాను సూచించటమైనది.బంధకారణం అఙ్ఞానమునకు సూచన,ఆ బంధ నాశనము మోక్షము- ఆత్మ దర్శనమే మోక్షప్రాప్తి.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 9, Jun 2011 3:46:18 PM IST జైబాబా
గీతానామసహస్రం
తన తత్త్వమును వివరించిన పరమాత్మ ఆత్మఙ్ఞానము పొందిన జీవ తత్త్వమును వివరించుచున్నాడు .
ఙ్ఞానేనతు తదఙ్ఞానం ఏషాం నాశిత మాత్మనః
తేషా మాదిత్యవద్ ఙ్ఞానం ప్రకాశయతి తత్పరం!!
ఎవరి అఙ్ఞానము ఆత్మ ఙ్ఞానము చే నశించినదో అట్టివారి ఙ్ఞానము చీకటిని పోగొట్టిన సూర్యుని విధముగా ప్రకాశించును.
అసూర్యా నామతే లోకా అంధేన తమసా22వృతా-సూర్యుడు లేని లోకాలు
అంధకారబంధురాలు అని ఈశావాస్యోపనిషత్ చెప్పుచున్నది.ఆ లోకాలెక్కడొ లేవు .అవి మనలోనే ఉన్నవి.వాటిని ఆత్మఙ్ఞానమనే సూర్యుని తో ప్రకాశింప జేయాలి. సకల పదార్ధాల అంతరం లో ప్రాణ రూపముగానున్న ఆత్మ ఏకం-ఒక్కటే-నద్వితీయం -రెండోది లేదు అనే ఙ్ఞానం కలవాడు
యస్తు సర్వాణిభూతాన్యాత్మన్యేవాను పశ్యతి-సర్వ భూతాలను తనలో దర్శించును కనుక ఆతనికి బాహ్యాంతరాలలో చీకటి యుండదు..వీరి మనుగడకు సత్య ధర్మ పరాక్రముడైన విష్ణువే ఆధారము.ఆత్మ ఙ్ఞానులు సత్య ధర్మ పరాయణులై జీవితయాత్ర భగవద్ చింతనతోసాగించెదరు.వీరి మనుగడకు సత్య ధర్మ పరాక్రముడైన విష్ణువే ఆధారము
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 8, Jun 2011 11:46:14 AM IST జైబాబా
గీతానామసహస్రం
భగవంతుడు తనకునచ్చినవానిచేత సత్కర్మలు చేయించి మోక్షము కలుగజేయునని,కొంతమందిని దుష్కర్మలు చేయునట్లు జేసి వారిని నాశనము చేయుననే భ్రమను ఈ శ్లోకమున భగవానుడు తొలగించెను.
నాదత్తే కశ్య చిత్పాపం నచైవ సుకృతం విభుః
అఙ్ఞానే నావృతం ఙ్ఞానంతేన ముహ్యంతి జంతవః
పరమేశ్వరుడు ఎవరి పాపపుణ్యములు స్వీకరించడు.ఆత్మ ఙ్ఞానము అఙ్ఞానముచే ఆవరింపబడుట చే వివేకము లేని జీవులు జంతువులవలె ప్రకృతి వ్యామోహము చెందుచున్నారు.మనసును భక్తి ఙ్ఞానమనే ముద్గర(సుత్తి) తో తొలగించుకోవాలని శ్రి శంకరులు భజ గోవింద శ్లోకాలలో వివరించారు .ఆత్మఙ్ఞానము పొందకపోవుటే వివేకము లేకుండుట.జన్మలు సంసార బంధనాలు అఙ్ఞామువలన అవిద్యవలన వచ్చినవి.ఈ బంధనాలు తొలగే దాకా జీవులు జంతువులనే పండితుల అభిప్రాయము.ఈ బంధనాలు తొలగటాని కే జపము చేయాలని భిష్మా చార్యుని ధర్మరాజు అడుగుటవిష్ణుసహస్రనామ పూర్వ పీఠికలో మనకు తెలియును.
జగత్ సేతువు అని విష్ణు నామావళిలో ఒక నామము. జలప్రవాహము దాటుటకు సేతువు అనగా వంతెన ఉపయోగించెదము.సంసార సాగరము దాటుటకు భగవత్ చింతనే సేతువు.సేతువు అనగా కూర్పు అని అర్ధమున్నది-అకాశములోని నక్షత్రాలనుమన శరీరములలోని అవయవములను,సకల జీవకోటి శరీరాంగములను ఒక పద్ధతిలో అమర్చినవాడు పరమాత్మ.తస్మాద్వా ఏతం సేతుం-ఈ ఆత్మ సేతువగుచున్నది అని చాందోగ్య ఉపనిషత్ వాణి.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 3, Jun 2011 11:13:03 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|