
|
|

General Forum: Poetry | నిస్వార్ధ తత్వం | |
| తన కోసమే జీవించు వాడు అధముడు
తన పరివారం కోసం జీవించువాడు మధ్యముడు
తనకు నీడ నిచ్చిన సమాజం కోసం జీవించువాడు ఉత్తముడు
అమూల్యమైన మానవ జన్మ లభించినందుకు కృతజ్ఞతతో
ఉత్తమమైన జీవితం గడపడం మనందరి కర్తవ్యం
మన కోసమే కాక పరుల కోసం పాటు పడదాం
సర్వే జన : సుఖినోభవంతు అను రీతిన
అందరం హాయిగా, ఆనందం గా వుండాలని ఆశిద్దాం
మన తోటి వారి అభివృద్ధిని , శ్రేయస్సును
మనస్పూర్తిగా కాంక్షిస్తూ , అందరం కృషి సల్పుతూ
మనకున్న దానిలో కొంత భాగం లేని వారి కోసం వెచ్చించి
బడుగు వర్గాల అభివృద్ధికి చేయి చేయి కలిపి
మనమూ ఎదుగుతూ వారిని కూడా ఎదగనిద్దాం
Posted by: Ms. Sai Manaswitha At: 29, Jan 2010 3:11:03 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|