Discussion on Literature in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Literature
వినదగు నెవ్వరు జెప్పిన .....
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Chala baaga rasaru. Kani ikkada kontha mandi telugulo rasinavi kanipinchatamledu. What to do for that?

Posted by: Geeta S At: 7, Oct 2011 3:34:57 PM IST
chaala baagunnai ! spoorti nichhe vaakyaalu !

Posted by: Mr. Imrankhan Patan At: 7, Oct 2011 1:42:31 AM IST
,,,,,,,,,,,

Posted by: priyanka varma At: 21, Jan 2011 2:55:26 AM IST
1. కర్మ సిద్ధాంతం చుట్టూనే మానవ జీవితం పరిభ్రమిస్తుంటుంది. నాటిన విత్తనాల పంటే చేతికి వస్తుంది. ఆముదం మొక్క విత్తనాన్ని నాటి తులసి మొక్క రాలేదని బాధపడడం అవివేకం.మన కర్మలు, చేతలు, ఆలోచనలు ఆశావహ ధృక్పధంతో కూడినవిగా వుండేలా చూసుకునే బాధ్యత మనదే. 2. మన కోపమే మనకు బద్ధ శత్రువు. మన కోపం కోసం మనం శిక్షింపబడం. కోపం చేతనే శిక్షింపబడతాం. కోపాన్ని జయించాలంటే ధ్యానం, యోగం ఇత్యాది సాధనలు అత్యావశ్యకం.కోపాన్ని జయించినవారికే సర్వ సుఖాలు ప్రాప్తం. 3. నీ మానసిక ప్రశాంతతను త్యజించి ఎన్ని భోగ భాగ్యాలను సమకూర్చుకున్నా అవన్నీ వ్యర్ధం.ఎప్పటికీ నీకు సరైన ఆనందాన్ని ఇవ్వలేవు. మానసిక ప్రశాంతతను అన్నింటికంటే విలువైనదిగా గుర్తెరిగి దానికే అగ్ర తాంబూలం ఇవ్వడం అత్యావశ్యకం.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 17, Aug 2010 3:54:20 PM IST
che^takaakapo^te aDukkonainaa bratakaali kaani tanani nammina vyaktulanu mo^sam cheyyaku^Dadu

Posted by: Mr. Bhaskar At: 28, Jul 2010 9:41:14 PM IST
1. ఎంతో చిన్నదైన మన జీవితం లో ప్రతీ క్షణం అమూల్యమైనది.వాటిని ప్రేమించడానికే వెచ్చించాలి. ఒకరిని ద్వేషించి మన కాలాన్ని వృధా చేసుకోరాదు.ప్రేమను మించిన సక్తివంతమైన ఆయుధం మరొకటి ఈ సృష్టిలో లేనే లేదు. 2.విజేతలు జవాబులో భాగమై వుండగా పరాజితులు సమస్యలో భాగమై వుంటారు.విజేతలు " ఈ పని కాస్త కష్టమే కాని అసంభవం కాదు" అని అంటే పరాజితులు " ఈ పని సంభవమే కాని చాలా కష్టం" అని అంటారు. 3.మన మెదడు ఒక ఆలోచనల కర్మాగారం. అందులో అనేక విధాలైన ఆలోచనల ఉత్పత్తికి అవకాశం వుంటుంది.వాటిని నియంత్రించే కంట్రోల్ పరికరాలు కూడా మన చేతుల్లోనే వుంటాయి. సానుకూల ధృక్పధాన్ని ప్రతిబింబిస్తూ మంచి ఆలోచనలనే ఉత్పత్తి చేయగలిగిన నాడు మనకు అంతటా విజయమే ఎదురౌతుంది.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 27, Jul 2010 1:01:38 PM IST
prataap` gaaru manchi vishayaalu po^shTu che^Saaru

Posted by: Mr. Bhaskar At: 23, Jul 2010 11:40:13 PM IST
1. ఓటమి అనే పదాన్ని కలలో నైనా తలచవద్దు.ఓటమి అంత పిరికిపంద ఈ సృష్టిలో మరొకటి లేదు. ధైర్యంతో ముందుకు దుసుకువెళ్ళితే తోక ముడుచుకొని ఆమడ దూరం పారిపోతుంది.ఓటమినే ఓడించగల గుండె ధైర్యాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి. 2. ధనం, ఐశ్వర్యం, భోగ భాగ్యాలు కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఆశను కోల్పోతే మాత్రం ఎన్నటికీ తిరిగి సంపాదించుకోలేము.మృత్యు ముఖం లో వున్నవారికి సైతం జీవితానిచ్చేది ఆశ మాత్రమే. మానవులకు ప్రాణవాయువు వలె అతి ముఖ్యమైనది ఆశ. నిరాశావాదులకు ఇహం లోనూ, పరం లోనూ దక్కేది శూన్యం. 3. ఓటమి ఎదురైనప్పుడు గుండెల నిండా గాలి పీల్చుకొని చెయ్యగలను లేదా సాధించగలను అని దృఢంగా అనుకోండి. మీ జీవితం లో అద్భుతాలు జరుగుతాయి.ఓటమి ఓడిపోయి దూరంగా పారిపోతుంది.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 21, Jul 2010 1:15:02 PM IST
1. ప్రేమ లేని పదవి చాలా ప్రమాదకరం మరియు మానవాళి వినాశనానికే దారి తీస్తుంది.పదవి లేని ప్రేమ మనిషిని సెంటిమెంటల్ ఫూల్ ను మరియు మానసిక దుర్భలుడిగా చేస్తుంది. 2. ఎక్కడునా అనుక్షణం సత్కార్యాలకే నీ శక్తి యుక్తులను వినియోగించు.ఈ చిన్న చిన్న మంచి పనులే నీకు ఇహం లోనూ పరం లోనూ శ్రేయస్సును చేకూరుస్తాయి. 3. కష్టాల కడలిలో కూరుకుపోయిన వారికి ఇకింత ఓదార్పు, కాస్తంత సాయం, అవకాస్దం వున్నంత మేరకు వెన్నంటి నిలువగలిగితే ఆ సృష్టి కర్త తప్పక అనుపలభ్యమైన కరుణా కటాక్షాలను తప్పక నీపై ప్రసరింపజేస్తాడు. 4 ఉన్నత ఆశయాలను ఏర్పరుచుకోవడం మంచిదే, కాని ఆ ఆశయ సాధనకు ప్రణాళికలను రచించుకొని కార్య సాధన నిమిత్తం కర్తవ్యన్ముఖులై తొలి అడుగు వేయని నాడు ఏర్పరచుకున్న ఆశయాలన్నీ వ్యర్ధం. 5. సమస్యల సుడి గుండంలో చిక్కుకున్నాక సమస్యను, విధినీ తిట్టుకుంటూ కూర్చునేవాడు అధముడు.సమస్య నుండి ఎలా బయట పడాలా అని ఆలోచన మాత్రం చేసేవాడు మధ్యముడు. సమస్య పరిష్కారం నిమిత్తం తొలి అడుగు వేసేవాడు ఉత్తముడు.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 20, Jul 2010 12:33:16 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.