Discussion on Anything on Cinema in Cinema Special at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
Cinema Special: Anything on Cinema
naakeMduku nachchiMdaMTE.......(kaT chEstE....)
  Page: 1 of 2   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Posted by: Mr. see nu At: 5, Aug 2011 8:09:20 PM IST kareshTE poTTanEdi mI okkarikE parimitamaina okE oka avayavaM kadoo....kaanI tippalu maatraM aMdarikI uMTAyaMDI...kaasta manOLLu mana pOsT kOsaM edurusUttU uMTAranE chinni adEdO signifiken~sO marEdO aMTAru kadaa aduMDAli maashTAroo....aay oTTu...(amaaSakI punnaanikI raaTam renDO mUDO padaalu jallaDaM maLLI maayaM....idi maatraM sogataM)

Posted by: Mrs. Padma Sreeram V. At: 7, Aug 2011 12:39:45 PM IST
Em chEstaam padmaajee.. poTTa tippalu :(

Posted by: Mr. see nu At: 5, Aug 2011 8:09:20 PM IST
ishTamunnachOTa elaa EmiTI eMdukU anE praSnaludayiMchavugaa.... mIlaaMTi bijI parsan~s kilaaMTivannI haay aMD bai aBiruchulu. maalaaMTOLLakivE panI paaTA.....adI mETar. mIkerika lEka kaadu kaanI mIku daa samayamilla...adi daa mETaroo....chevulu mUsukOMDOch

Posted by: Mrs. Padma Sreeram V. At: 15, Jul 2011 2:38:46 PM IST
chaalaa teleeni vishayaalu cheppaaru devadaasu gurinchi ... elaalu telustaayO meeku ivannee ! naaku nachchina sinimaa aakali raajyam. deeni gurinchi Opaali raayaali samayam dorikinappuDu.. meeru inta baagaa raasEstaaru.. maaku bhaashaa raadu innEsi vishayaalu kUDaa teleevu. Enu maaDabEku?

Posted by: Mr. see nu At: 10, Jul 2011 11:31:49 AM IST
అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన అలనాటి చిత్రం దేవదాసు. ఈ చిత్రం 26.6.1953లో విడుదలైంది. సరిగ్గా మొన్నటికి 56 వసంతాలు పూర్తయ్యాయి. తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌నాడే పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసు విడుదలైంది. ఆ ప్రభావం తెలుగుపై పడకపోవడంతో మరింత విజయం సాధించింది. 1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు విజయవాడకు చెందిన ద్రణావధ్యుల లక్ష్మీనారాయణ ముందుకొచ్చారు. అనంతరం ముగ్గురు భాగస్తులు కూడా కలిశారు. కానీ ప్రారంభానికి ముందే దేవదాసు సినిమా తీస్తే నువ్వుకూడా దేవదాసు అయిపోతావ్, నష్టపోతావ్ అని లక్ష్మీనారాయణను మిగిలిన ఇద్దరు భాగస్తులు భయపెట్టారు. చివరికి భాగస్తులకు వారి వారి వాటాలిచ్చి దేవదాసు చిత్రం నిర్మాణం నుంచి తప్పించారు. మొండి ధైర్యంతో ద్రణావధ్యుల లక్ష్మీనారాయణ ఒక్కరే ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఆయనకు ధైర్యాన్ని నూరిపోశారు. అలా మొదలై కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని విడుదల తర్వాత దేవదాసు చిత్రం సక్సెస్ అయింది. ఇంకా ఈ చిత్రానికి సీనియర్ సముద్రాల మాటలు, పాటలు హైలైట్‌గా నిలిచాయి. 11 పాటలుండటమే ఈ సినిమా గొప్ప. ఈ మఝ్య సినిమాల్లో వైవిధ్యమంటుంటారు. కానీ అసలు వైవిధ్యం ఈ చిత్రంలోని ఒక్కోపాట. "పల్లెకుపోదాం.. పారును చూద్దాం చలోచలో..", "అంతా భ్రాంతియేనా జీవితాన వెలిగింతేనా...", "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...", "జగమే మాయ బ్రతుకే మాయ.." ఇలా వేటికవే ప్రత్యేకతే. కానీ జగమేమాయ పాట రికార్డింగునాటికి బాణీలు కట్టిన సుబ్బరామన్ చనిపోయారు. అందువల్ల ఆయన శిష్యుడు ఎం.ఎస్. విశ్వనాథన్ దాన్ని రికార్డింగ్ చేశారుయ పాట రికార్డింగ్ చేసే సమయంలో విశ్వనాథన్ నిజంగానే ఏడ్చేశారు. శరత్ సృష్టించిన గొప్ప పాత్ర నాగేశ్వరరావు చెయ్యడమా? పైగా సావిత్రి పార్వతి పాత్రా? రాఘవయ్య దర్శకుడా? శరత్ నవలలు ఎవరికీ అర్థంకావు. వాటిని సినిమాగా తీయడమేమిటని అలనాడే మేథావులు విమర్శలు ముందుంచారు. అందుకే ఇప్పటికే నాగేశ్వర రావు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. పట్టుదల, మొండితనం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయన్నారు. అందుకే దేవదాసు ఘన విజయం సాధించిందంటున్నారాయన. ఒక పార్వతి పాత్రకు మొదట షావుకారు జానకిని ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో "శాంతి" చిత్రంలో చిన్న పాత్రవేసిన సావిత్రిని ఎంపిక చేశారు. ఈ చిత్రం గురించి అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో చర్చ జరిగింది. "ది హాలీవుడ్ రీసెర్చ్ సెంటర్" దేవదాసును పరిశోధించి తనతంటూ చరిత్ర సృష్టించిన పాత్రలలో మొదటిస్థానం "సిండ్రెల్లా"ది. రెండో స్థానం "జేమ్స్‌బాండ్"ది అయితే, మూడోది దేవదాసు పాత్రదని స్పష్టం చేసింది. ఇకపోతే.. దేవదాసు చిత్రం 14 సెంటర్లలో రిలీజ్ అయి 7 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని బెంగాలీలో పి.సి. భారువా తీశారు. తర్వాత హిందీలో కె. ఎల్. సైగల్‌తో తీశారు. ఆ తర్వాత తెలుగులో అక్కినేనితో తెరకెక్కింది. మళ్లీ దిలీప్‌కుమార్‌తో హిందీలో నిర్మాణమైంది. కృష్ణతో విజయనిర్మల నిర్మించారు. తదనంతరం షారూఖ్ ఖానుతో మళ్లీ హిందీలో నిర్మించారు.

Posted by: Mrs. Padma Sreeram V. At: 29, Jun 2011 5:21:28 PM IST
ee kalars EnTO. eesT man , gEvaa lavakuSa anTE naaku O rakamaina visugu anDee.. ekkaDa chUsina avE paaTalu konni samvatsaraalu andukE EmO...aa raamakadhanu vinaranDee paaTaitE enni vEla saarlu vinunTaamO aandhradESamlO andaram.. chUDalEdu asalu aa sinimaa.. aa pillalu kUDaa baagunnaarani anipinchalEdu chaalaa banDagaa anipinchaaru pOsTars lO..kaanee naaku anjali gaaranTE chaalaa ishTam anDee. enta saatvikam gaa unTaarO aaviDa.

Posted by: Mr. see nu At: 13, May 2011 10:05:09 PM IST
Posted by: Mr. see nu At: 11, May 2011 5:20:01 PM IST raama raama....idE mari raama charita kanna rivyU baaguMdaTa.adi mana vyU lO uMTuMdi maashTArU...( maa chevilO kaaliflavars chEti flavarsU kanipistunnaayO EmO.....idi swa....gataM....vui(ka)napaDadokaLLaki) mI kaaMplimeMT ki dhanyavaadaalu . gEvaa kalar aMTE itamiddhaMgaa naakU aMta karekT gaa teliyadu. kaanI aar jI bI ki muMdunna mOnOkrOm teknaalajI anukuMTunnaanu

Posted by: Mrs. Padma Sreeram V. At: 12, May 2011 12:55:26 PM IST
lava kuSa Emo kaanee mee rivyU maatram adbhutamgaa undi padmaa jee.. gEvaa kalar anTE EnTanDee?

Posted by: Mr. see nu At: 11, May 2011 5:20:01 PM IST
"లవకుశ" మొదట రిలీజైన గేవా కలర్ మూవీ... అప్పటికీ ఇప్పటికి ఎప్పటికీ చెక్కు చెదరని రికార్డ్ సృష్టించిన ఏకైక చిత్రరాజం.ఘంటసాలవారి స్వీయ సంగీత సారథ్యంలో ఈ చిత్ర గీతాలన్నీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.రాముడైనా కృష్ణుడైనా రావణుడైనా ఎంటీ ఆర్ లో చూసుకొనే ప్రేక్షకుల కొరకు ఉత్తరరామ చరిత్రను లవకుశగా మలచి 1963లో విడుదల చేసిన మొట్టమొదటి పూర్తి నిడివి రంగుల తెలుగుచిత్రం. (అంతకు ముందు ఒకటీ, రెండూ సీనులు రంగుల్లో తీస్తుండేవారు - ఖర్చు తగ్గించడానికి). ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, ఒక యజ్ఞంలాగా ఈ సినిమా తీశారు. అసలే ఈ కధ ఎంతో హృద్యమైనది. ఆపైన పౌరాణికాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యంతో ఇది మనోహరమైన దృశ్యకావ్యముగా రూపు దిద్దుకుంది. అద్భుతమైన విజయం సాధించింది. రామాయణం ఉత్తరకాండము ఈ సినిమా కధాంశము. సీతపై నిందలు విని రాజధర్మమునకు అనుగుణముగా ఆమెను రాముడు అవులకు పంపాడు. సీతమ్మ అప్పుడు వాల్మీకి ముని ఆశ్రమంలో కవలలను కంటుంది. వారు అసహాయ శూరులైన బాలురు. గానవిశారదులు. వాల్మీకి నేర్పిన రామాయణాన్ని రాముని కొలువులో గానం చేశారు. లొక కళ్యాణం కొరకు రాముడు అశ్వమేధ యాగం చేయతలపెడతాడు.లవకుశులు యాగాశ్వాన్ని నిలువరించి తండ్రితో యుద్దానికి తలపడ్డారు. అప్పుడు సీతమ్మ రామునకు కొడుకులనప్పగించి తాను భూప్రవేశం చేస్తుంది. మొట్టమొదట ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ బానర్ పై దేవకీబోస్ దీనిని బెంగాలీలో తీశారు. అదే స్క్రిప్టుతో ఆ కంపెనీవారే తెలుగులో తీసే బాధ్యత సి.పుల్లయ్య కు అప్పగించారు. అప్పటి డ్రామా నటులైన పారుపల్లి సుబ్బారావు రామునిగా, శ్రీరంజని సీతగా 1934లో "లవకుశ" తెలుగు తెరకెక్కింది (నలుపు-తెలుపులో). బాగా విజయవంతమైనది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత, 1958లో "లలితాశివజ్యోతి" బ్యానర్ పై ఇదే కధను, ఈ సారి రంగుల్లో చిత్రీకరించడం ప్రారంభించారు. దీనిని "గేవా కలర్" లో తీశారు.తమిళంలోనూ, తెలుగులోనూ "లవకుశ" సినిమాను ఒకేసారి తీశారు. కాకపోతే తెలుగు సినిమాలో పాటలెక్కువ. దాదాపు మూడొంతులు అయిన తరువాత సినిమా నిర్మాణం ఆగిపోయింది. నిర్మాతకున్న ఆర్ధిక సమస్యలవల్లా, ఆర్టిస్టుల ఇతర ఒప్పందాల వల్లానూ. ఎంతో ధైర్యంతో శంకరరెడ్డి ధనం జమ చేసుకొని మళ్ళా సిద్ధమయ్యేసరికి నాలుగేళ్ళు పట్టింది. అప్పటికి సి.పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. ఆప్పుడు డిస్ట్రిబ్యూటర్ సుందర్ లాల్ నహతా, ప్రసిద్ధ దర్శకుడు బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టారు. అప్పటికి లవకుశులుగా వేసిన పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారు. సీనులు కలపడం చాలా ఇబ్బంది అయ్యింది. తమిళంలోనూ ఇదే పరిస్థితి. ఎలాగో శ్రమించి సినిమా పూర్తి చేసి 1963 లో విడుదల చేశారు. ఆ తరువాత అది పెద్ద హిట్. ఇప్పటికీ అది ఒక కళాఖండంగా నిలిచిపోయింది. 1934లో వచ్చిన లవకుశ 365 రోజులు ఆడగా ఈ లవకుశ 500 రోజులపాటు ప్రదర్శింపబడింది. పూర్తి రంగుల చిత్రంగా లలితాశివజ్యోతి వారి 'లవకుశ' విడుదలై నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సంచలన విజయం సాధించింది. తొలి విడతలో 26 ప్రింట్లతో విడుదలై, 26 కేంద్రాలలోనూ 150 రోజుల వరకు ప్రదర్శితమై, 14 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని, తొలిసారిగా 250 రోజులకు నాందీ పలికి, 470 రోజులు వరకు ప్రదర్శితమైంది 'లవకుశ'. పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రకెక్కి వందరోజులకు రూ. 25 లక్షలు పోగుచేసి, 365 రోజులకు కోటి రూపాయలను నాటి 25 పైసలు, రూపాయి టిక్కెట్లపై వసూలు చేసింది. ఆ నాటి రూపాయి విలువ నేటికి ఎన్నో రెట్లు పెరిగింది. ఆ కొలమానంలో చూసుకుంటే ఈ చిత్రం వసూళ్ళు నేటికీ రికార్డుగా నిలిచాయనే చెప్పాలి. అంతకు ముందున్న రికార్డుల కంటే ఈ చిత్రం మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఆ నాడు మన రాష్ట్ర జనాభా 3 కోట్లు మాత్రమే, అయితే ఈ సినిమాను నూరు కేంద్రాలలో 1.98 కోట్ల మంది ప్రజలు ఆదరించినట్లు ఆ నాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. అంటే ప్రతి కేంద్రంలోనూ ఆ యా కేంద్రాల జనాభా కంటే నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడై అప్పటికీ ఇప్పటికీ కనివినీ ఎరుగని చరిత్రను సొంతం చేసుకుందీ చిత్రం. (ఉదాహరణకు 1-1-1964 తేదీన వరంగల్ రాజరాజేశ్వరి థియేటర్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో ఆ చిత్రాన్ని 4, 34, 800 మంది చూసినట్లు ఆధారం ఉంది. ఆ నాటి వరంగల్ జనాభా ఒక లక్ష మాత్రమే). అలాగే ఆ తరువాత కూడా ఈ చిత్రం అప్రతిహతంగా నడచి అన్ని కేంద్రాలలో సంయుక్తంగా అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలిచింది "ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ "అనే పాట సినిమాలోనే కాదు మన నిత్య జీవితంలో కూడా సెంటిమెంటల్ గానూ, ఎమోషనల్ గానూ బాగా వర్కవుటయినట్లు నా పర్సనల్ ఎక్స్పీరియెన్స్. పొద్దు పొద్దున్నే పొరపాటున ఈ పాట వింటే నా లైఫ్ లో అన్ వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి కూడా. మా ఆఫీస్ లో ఫైనాన్స్ మేనేజర్ కూడా ఎప్పుడైనా పొరపాటున నా సిస్టం లో ఈ పాట వినిపిస్తే "బాబోయ్ మేడం ఆఫ్ చేయండి నాకు భయం" అంటారు (నిజమే సత్యానికి దూరంగా బ్రతకడం అలవాటైపోయిన సగటు జీవులమేమో మేం....) ఇంకా పద్యాలూ, పాటలూ. పాటల్లాగే ఈ సినిమాలో డైలాగులు ఎంతో సున్నితంగా ఉండి ప్రేక్షకులకు గుర్తుంటాయి. ముఖ్యంగా సీతమ్మ తల్లిగా అంజలీదేవి నటన అద్భుతం. రామభద్రుడు రాజ ధర్మమ్ కోసం నిన్ను పరిత్యజించాడు తల్లీ అని లక్ష్మణుడుచెప్పగానే సగటు మహిళలా విలపించినా న్యాయం అడిగే తీరు లోకాభిరాముడైనా శ్రీరామచంద్రుడు తనపట్ల చేసినది అన్యాయమని చెప్పకనే చెప్పిన తీరు ఎంతటి కఠిన హృదయాన్నైనా చెమరింపజేస్తుంది." మీ అన్నగారూ మహారాజైతే నే మహారాణిని కానా ? రాజ వంశపు పరువు ప్రతిశ్టల కొరకు అని నాతో ఒక్క మాట చెప్పి ఉండకూడదా" అని సీతమ్మ పాత్రలో అంజలీదేవి అడిగిన తీరుకి ఇప్పటికి (150 టైమ్స్ చూసి ఉంటాను లవకుశ) నాకు కంటనీరు తెప్పిస్తుంది. నాకైతే ఇక్కడ సీతమ్మ పాత్రలో అంజలీదేవి ఒదగలేదు .అంజలీదేవి తనలోనే సీతమ్మ పాత్ర ను పొదిగింది అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలోని ప్రతి పాటా ఆణిముత్యమే. లీల, సుశీల గార్లు ప్రతి పాటకూ ముందు అమృతం తాగి దాన్ని పాటగా మలచి మనకు వినిపించారా అనిపిస్తుంది.ప్రతీ పద్యమూ వీనులవిందుగానే అనిపిస్తుంది. అందుకే అలనాటి "లవకుశ" ఏనాటికి చెక్కు చెదరని "చిత్రరాజమే" aMdukE naakishTaM appuDU............ ippuDU....................... eppuDU..............

Posted by: Mrs. Padma Sreeram V. At: 10, May 2011 5:26:45 PM IST
ippaTiki 25 Taim~s lavakuSa privyU vraasaa kaanI hyaaMg ayipOtOMdi. naa chaaT bhaarataM I (daaraaniki )raamaayaNa gaadhaki nachchalEdO EmO ? ippuDu aa raamuDikE morapeTTukOvaalEmO....:((

Posted by: Mrs. Padma Sreeram V. At: 5, May 2011 6:01:18 PM IST
  Page: 1 of 2   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.