Discussion on Education in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Education
తెలుగులో వ్యాసరచనపోటీ
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
విజయవాడ టౌన్ వైజ్ మెన్స్ క్లబ్ మరియు నవ్యసాహితీ సమితి విజయవాడశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 24-2-2013 ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యనారయణపురంలో క్లబ్ కార్యాలయమందు మాతృభాషాదినోత్సవం సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షతవహించిన క్లబ్ అధ్యక్షులు కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి సభికులకు స్వాగతం పలుకుతూ తెలుగుభాష నేటియువతరం, ముందుతరం విస్మరించకుండ వుండాలంటే వారికి తెలుగులో వ్రాయడం చదవడం తప్పనిసరిగా వచ్చివుండాలని, అందుకు ఇంట్లో తల్లి తండ్రులు బడిలో ఉపాధ్యాయులు ఎంతైనా కృషిచేయవలసిన ఆవశ్యకత వుందని వక్కాణించారు. ఇందుకుగాను తమ సంస్థలు తెలుగులో పద్యపఠణ, తెలుగు వ్యాసరచనలలో పోటీలు నిర్వహించ తలపెట్టాయని ఉద్ఘాటించారు. గతనెల 26 వతేదీని 10 సంవత్సరాల్లోపు బాలబాలికలకు తెలుగు పద్యాలు చూసి చదివే పోటీ నిర్వహించి ప్రోత్సాహక సూచికంగా బహుమతులు ఇచ్చామని, క్రితం ఆదివారం అమ్మ అమ్మభాష అనే అంశంపై తెలుగులో నిర్వహించిన వ్యాసరచనపోటీలో విజేతలకు బహుమతి ప్రదానం నేడు జరుపుతున్నామని తెలియబరిచారు. అనంతరం తెలుగులో వ్యాసరచన పోటీలో విజేతలైన వివేకానంద ఉన్నత అపాఠశాల తొమ్మిదవతరగతి విధ్యార్ధిని కుమారి ఎం హేమలతకు ప్రధమ బహుమతి, కుమారి ఎస్ లావణ్య కు ద్వితీయ బహుమతి, కె సాయికుమార్ కు తృతీయబహుమతి ప్రదానం చేసారు. ఇదేవిధంగా సాధ్యమైనంతవరకు ప్రతినెల తెలుగుభాష గురించి పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం క్లబ్ కోశాధికారి వేదాంతం రామకృష్ణమాచార్యులు, క్లబ్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి జయశ్రీ విజేతలను అభినందించారు. అనంతరం శ్రీమతి లక్కరాజు వాణీసరోజిని, శ్రీయుతులు కె.వి.రమణ, గోపినాధ్ ప్రభుతులు తెలుగుభాష విశిష్టతగురించి స్వీయకవితాగానం చేసారు క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి కాజ వందన, వందనసమర్పణతో సమావేశం ముగిసింది. తొలుత 9-30 గంటలకు విచ్చేసిన అతిథులు అల్పాహారం సేవించారు.

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 24, Feb 2013 11:42:24 PM IST
మాతృభాషా దినోత్సవ సభ విజయవాడటౌన్ వైజ్ మెన్స్ క్లబ్ మరియు నవ్యసాహితీసమితి విజయవాడశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 24-2-2013 ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ సత్యనారాయణపురం మారుతీవ్యాయామశాల సమీపాన గాయత్రీవైద్యశాల మేడమీద మాతృభాషా దినోత్సవ సభ నిర్వహించబడును. 17-2-2013 ఆదివారం తెలుగులో అమ్మ అమ్మభాష అనే అంశంపై నిర్వహించిన vyaasarachana పోటీలో గెలుపొందిన ఈక్రిందివారికి బహుమతి ప్రదానం జరుపబడును. 1. కుమారి ఎం. హేమలత 2. కుమారి ఎస్ లావణ్య 3. కె.సాయికుమార్ 4. కుమారి డి.ఎస్ జాహ్నవి సాహితీ అభిమానులందరూ తప్పక విచ్చేసి సభను జయప్రదం చేయప్రార్ధన వివరములకు కాలనాధభట్టవీరభద్రశాస్త్రి, అధ్యక్షుడు, 9849104811 కి సంప్రదించగలరు ఊదయం 9-30 గంటలకు అల్పాహారం

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 23, Feb 2013 7:08:58 PM IST
తెలుగుభాషోద్యమ స్ఫూర్తితో రాబోయే మాతృదినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 17, 2013 వతేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ సత్యనారాయణపురం మారుతీవ్యాయామశాల సమీపాన గాయత్రీవైద్యశాల మేడమీద విజయవాడ టౌన్ వైజ్ మెన్స్ క్లబ్ మరియు నవ్యసాహితీ సమితి విజయవాడ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సత్యనారాయణపురం,ముత్యాలంపాడు సింగునగర్ పరిధిలోగల ఉన్నతపాఠశాలలో చదువుతున్న పదవతరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు తెలుగులో వ్యాసరచనపోటీ నిర్వహింపబడును. విషయము: అమ్మ - అమ్మ భాష వ్యాసము ఫుల్ స్కేప్ సైజు కాగితము రెండువైపులకు మించకూడదు దస్తూరీ శైలి మరియు భావ వ్యక్తీకరణ యిత్యాదులు పరిగణింపబడును కాగితము నిర్వాహకులే యిచ్చెదరు అయిదుగురు విజేతలకు చెరివక రెండువందలరూపాయలు బహుమతిగా ఫిబ్రవరి 24, 2013 వతేదీ ఆదివారం సాయంత్రం జరుగు సభలో ఇవ్వబడును నేటి యువతరానికి తెలుగులిపి వ్రాయడం చదవడం లో ఉత్సాహం కలిగించాలని ఆవిధంగా ముందు ముందు తెలుగు భాష మనుగడకు ప్రమాదం వుండదనే ఆశయంతోనే మాయీచిరుప్రయత్నం కనుక, పైన తెలిపిన ఫరిధిలోగల ఉన్నతపాఠశాల యాజమాన్యం దయతో తమ తమ పాఠశాలలనుండి అయిదుగురు తెలుగులో వ్రాయగల పదవతరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులను ఎంపికచేసి ధృవీకరణ పత్రములతో 17/2/2013 ఉదయం 9 గంటలకు పంపించి మేము తలపెట్టిన ఈ కార్యక్రమమును జయప్రదం చేయప్రార్ధించుచున్నాము స్థానిక దినపత్రిక, ప్రసారమాధ్యమాధికారులు పోటీ జరిగేనాడుకన్నా ముందే ఈపోటీకి ఇతోధిక ప్రచారమునీయగోరుచున్నాము వివరములకు క్లబ్ కార్యాలయమునందు ఆదివారం మినహా ప్రతిదినము ఉదయం 9 నుండి 11.30 గంటల సమయంలో సంప్రతించగలరు. లేదా 0866-2531766 కుగాని, 9849104811, 9441134394 నెంబర్లకు గాని ఫోన్ చేయగలరు భవదీయుడు, కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి అధ్యక్షుడు

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 6, Feb 2013 7:35:43 AM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.