
|
|

General Forum: Education | pEdamahiLalaku kaMpyUTarulO uchita SixaNa | |
| అంతర్జాతీయ వైజ్ మెన్స్ సంస్థ విజయవాడ టౌన్ క్లబ్ ఆధ్వర్యంలో 2007 సంవత్సరం అక్టోబరు నెలనుంచి విజయవాడ సత్యనారాయణపురం మరుతీ వ్యాయామశాల సమీపానగల క్లబ్ సేవాకేంద్రమందు ఆర్ధికంగా వెనుకబడ్డ మహిళలకు , బాలికలకు ఉచితంగా కంప్యూటరులోను, కూట్టుమిషనులోను రెండునెలల స్వల్పకాల శిక్షణ ఇవ్వబడుతోంది. కంప్యూటరులో ఎం ఎస్ ఆఫీసు, డిటిపి తెలుగు లిపితోసహా నేర్పబడుతోంది. ఇప్పటికి 27 బ్యాచిలలో 901 మంది కంప్యూటరు, మరియు కుట్టుమిషను నేర్చుకున్నారు.
అయితే ఈ ఉచిత శిక్షణకార్యక్రమం కరెంటుకోత బారినిపడి కంప్యూటరు శిక్షణకు అంతరాయఒ ఏర్పడుతోంది. 2013 ఏప్రియల్ 1వతేదీనుంచి 28 వబ్యాచి ప్రారంభం కానున్న తరుణంలో కాలేజీకి, హైస్కూలుకు శలవలు కావడంతో చాలామంది విద్యార్ధినులు కంప్యూటరు నేర్చుకోవడానికి గత అయిదు సంవత్సరాలలాగే వస్తారు. కాని ప్రకటిత, అప్రకటిత కరెంటుకోతలవల్ల కంప్యూటరు నేర్చుకోవడానికి ఆటంకం ఏర్పడవచ్చు.
ప్రస్తుతం ఆరు కంప్యూటర్లు శిక్షణ కొరకు ఉపయోగిస్తున్నాము. కరెంటు లేకపోయినా ఇన్వర్టెర్ల సాయంతో కంప్యూటర్లు పనిచేయవచ్చు. ఇందుకు సుమారు 45 వేలు అవసరం.
పేద మహిళలు, బాలికలు ఈ అవకాశం ఆటంకం లేకుండా వినియోగించుకునేందుకు దాతలు మాకు రెండు ఇన్వెర్టర్లు కొరకు (నలభై అయిదు వేల రూపాయలు) విరాళం ఇచ్చి సాయపడగలందులకు ప్రార్ధిస్తున్నాము.
ఈవిరాళం విజయవాడలో చెల్లుబడి అయ్యేటట్తు డిడి రూపంలోగాని చెక్కురూపంలోగాని Y's Men's Club of Vijayawada Town పేర వ్రాసి ఈక్రింది చిరునామాకు పంపించగలరు.
భవదీయుడు
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి
అధ్యక్షుడు
43-140-25 ఎ పైపులరోడ్
సింగునగరు, విజయవాడ 520015
0866-2400485/2531766/9849104811
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 13, Mar 2013 2:56:40 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|