
|
|

General Forum: My Motherland | టీవి సీరియల్సులో ప్రకటనలు | |
| టీవి సీరియల్సులో ప్రకటనలు
రెండురోజులక్రితం ట్రాయ్ టీవి చానళ్ళలో ప్రకటనలపై గంటకు 12 నిముషాల కాలవ్యవధిని నిర్దేశించడంపై భారత ప్రసారసంస్థల సమాఖ్య ఆంధోళణ వ్యక్తంచేసినట్టు ఈవేళ (27-3-2013) ఈనాడు దినపత్రికలో చూసాను. తమపరిశ్రమ ఆర్ధిక మనుగడ ప్రధానంగా ప్రకటనలపై వచ్చే ఆదాయంపైనే ఆధారపడివుంటోందనిపేర్కొని కనుక సదరునోటీసు వుపసంహరించుకోవాలని కోరింది.
ట్రాయ్ విధించిన నిబంధన ప్రెక్షకులకు ఎంతో వుపసమనంగావుంది. కాలక్షేపంకోసం చూసే ఈసీరియల్సులో అరగంట సీరియల్లో ఎక్కువసేపు ప్రకటనలేవుండడంతో చూడడానికి ఇబ్బందిగా వుంటోంది.
ఈ 12 నిముషాల ప్రకటనల ట్రాయ్ నిబంధనను అమలుపరుస్తూ చిన్న చిన్న సీరియల్సు తీయవచ్చుగదా! ఈప్పటికే చాలా సీరియల్సు నెలలేగాక సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. ఒక నటుడు గాని నటి గాని ఒక మాట మాట్లాడ్డం, వినే మిగిలిన పాత్రల క్లోజప్ చూపించడం కధకూడా తరతరాలకు సాగతీయదం దీనివల్ల విసుగు కలుగోందేగాని, ఆనందం కలగడంలేదని చాలా మంది విమర్శిస్తున్నారుకూడా.
ఈసందర్భంగా టీవి సీరియల్సు తీరు తెన్ను అనే అంశంపై మాక్లబ్ తరఫున గతసంవత్సరం రెండుసార్లు సదస్సులుకూడా నిర్వహించాం.
ట్రాయ్ తమనిబంధన వుపసంహరించకుండా వుండాలని వ్యక్తిగతంగా భావిస్తున్నాను. మీరేం అంటారు?
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 28, Mar 2013 1:36:24 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|