షూటింగ్ పూర్తయింది.
ఫ్లోర్ నుంచి ఎక్స్ ట్రా నటులంతా బైటకొచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ రమేష్ అప్పుడే టాక్సీలోంచి దిగేసి తలా ఓ బిర్యాని పాకెట్ ఇచ్చేసి ఫ్లోర్లోకి వెల్లిపోయాడు.
పాకేట్లని ఆబగా అందుకుని తినడంలో నిమగ్నమైపోయారు రోజువారి కూలిలుగా పనిచేసే ఎక్స్ ట్రా నటులు.
వాళ్ళవైపోసారి సాలోచనగా చూస్తే జాలేస్తుంది ఎవరికైనా. ఎందుకంటె ఎంతో ఆశగా వస్తారు గొప్పయాక్టర్లమైపోతామని. కాని అవకాశాలు రాక అలా రోజువారి కూలీలుగా మిగిలిఫోతారు.
రోజూ ఎంతో కష్టపడి ఎండలో ఫ్లడ్ లైట్ల కాంతుల్లో గ్రూప్ సాంగ్ లో అందర్లో ఏకతాళంగా డ్యాన్స్ చేయడం, చేసిందే చేయడం విసుగనిపిస్తుంది చేసేవారికి, చూసేవారికిని. కాని తను అనుకున్నట్టుగా వచ్చేంతవరకూ వదలడు డైరెక్టర్. నడుము టింగు మంటుంది పాపం కూలీ నటులకి. పొట్టతిప్పలు తప్పదు రోజు అదేవరుస.
ఈ మధ్య అదేగ్రూప్ లో రూప అనే అమ్మాయి చేరింది. చక్కగా నాట్యం చేస్తుంది. అవయవ పొందిక, అందంగాను వుండటంతో డ్యాన్స్ మాస్టర్లు కెమేరామెన్లు ఆమెను హీరోహిరోయిన్ల దగ్గర వుంచి తమకనుకూలంగా షూటింగ్ జరుపుతున్నారు. రూప మాత్రం తనదైన రీతిలో నటించడం, డ్యాన్స్ చేయడం చేస్తోంది. నిజం చెప్పొద్దు గాని కొన్ని సీన్లలో హిరోయిన్ ని డామినేట్ చేసే లెవల్లో అభినయిస్తుంది, డ్యాన్స్ చేస్తుంది రూప. ఆమె నటన, డ్యాన్స్ చూసి డైరెక్టర్లు అబ్బురపడిపోసాగారు. ఇదేమీ పట్టించుకోని రూప తనకి చెప్పిన రీతిలో తనూ చేసుకూపోతుంది.
ఒకరోజు దాదాపు నూటయాభై డ్యాన్సర్లతో గ్రూప్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఫ్లోర్ అంతా హడావుడిగా వుంది. దాదాపు పదిమంది కెమెరామెన్లు, డ్యాన్స్ మాస్టర్లు, లైట్ బాయ్ లు మ్యూజిక్ డైరేక్టర్, అంతా కోలాహలంగా వుంది.
ఆ సందడి చూసి రూప అబ్బురపడిపోయింది. హీరోయిన్ పక్కనే స్ఠానం కల్పించాడు డైరెక్టర్ . రిహార్సల్స్ మొదలయ్యాయి. బాగా రావడంతో రియల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు డ్యాన్స్ మాస్టర్.
|