కావలసిన పదార్థాలు :
బియ్యం : రెండు గ్లాసులు
నీళ్లు : నాలుగు గ్లాసులు
మామిడి కాయ : ఒకటి
వేరుశనగపప్పు : చిన్నకప్పు
జీడిపప్పు : పది
నూనె : తగినంత
కరివేపాకు : 5 రెమ్మలు
ఉప్పు : సరిపడ
పచ్చిమిర్చి : ఎనిమిది
పసుపు : ఒక టీ స్పూన్
ఆవాలు : ఒక స్పూన్
ఎండుమిర్చి : రెండు
మినపప్పు : ఒక స్పూన్
శెనగపప్పు : రెండు స్పూన్స్
ఇంగువ : చిటికెడు
తయారు చేయు విధానం : ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించిన అన్నాన్ని ఒక బేసిన్ లో ఆరబెట్టుకోవాలి. దీనికి కొంచెం నూనె, పసుపు వేసి కలబెట్టుకోవాలి. మామిడి కాయను తురిమి తర్వాత పసుపు, ఉప్పు వేసి అన్నంలో కలపాలి. తర్వాత బాణలిలో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, వేరుశెనగపప్పు, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువను వేయాలి. ఈ తాలింపును మామిడికాయ తురుమును కలిపిన అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే నోరూరించే మామిడి కాయ పులిహోర రెడీ.
|