Group Home | Members | Messages | Invite .:. Active Groups | Popular Groups | Recent Groups
Group Type: Open Group (Anybody can join at anytime.)
 Srinivasulu Reddy Palavalli Member |
| | 
Adminstrators | Recent Activity
 | Srinivasulu Reddy Palavalli Posted at: 29, Nov 2009 10:43 PM | నీ చూపు కిరణాలు సోకి
నింగి సరసున విరిసె సూర్యకమలం
నీ వైపు చరణాలు సాగి
కైతలెన్నో వ్రాసె నా కలం
నీ మోము చందాలు చూసి
మబ్బు చాటు దాగె చంద్ర వదనం
నీ ప్రేమ భారాన్ని మోసి
ఆణువణువూ పులకించే నా హృదయ సదనం
నీ చరణ మంజీర రావాన పలికే కల్యాణి రాగం
నా కవనామృతధార భావాన ఒలికే త్రివేణీ వేగం
|
|  | Srinivasulu Reddy Palavalli Posted at: 29, Nov 2009 10:42 PM | హలం దున్నితే పంట
కలం దున్నితే పాట
పంట కడుపు నింపితే
పాట మనసు నింపుతుంది
కడుపు నిండిన కన్ను కలలు కంటే
మనసు నిండిన కన్ను కళలు కంటుంది
కల కంటి పొరల్లో కరిగిపోతే
కళ గుండె పొరల్లో నిలిచిపోతుంది
కలను ఆస్వాదించు ,కళను ఆరాధించు
కలను నిజం చేసుకో ,కళను ఆ కలకు బాట చేసుకో
|
|  | Srinivasulu Reddy Palavalli Posted at: 29, Nov 2009 10:42 PM | ధాత్రి పైని తియ్యని బంధం మైత్రి
కలిమి,లేమి బేధాలెరుగని ప్రేమ బంధం చెలిమి
అది నాకందించిన ఓ మిత్రమా.....!
నీ అడుగడుగునా నేనుంటా ,నీ కడగళ్ళలో తోడుంటా
పొంగిపోయిన నాడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తా
కుంగిపోయిన నాడు చేయి పట్టి ఊతమిస్తా
అంతు తెలియని బంధంతో నను బంధించావు
అంతులేని ప్రేమను నాకందించావు
నీ ప్రతి కలకు నే ప్రతి రూపాన్నవుతా
నా చి
|
|  | Srinivasulu Reddy Palavalli Posted at: 29, Nov 2009 10:41 PM | ఒంటరైన నాకు కంటి నీరే తోడు
వెంట తోడులేని దారిలో బాటసారిని నేడు
ఎంతవరకు ఈ పయనం
ఎందుకొరకు ఈ గమనం
నా తొలి అడుగు నేడు ఒంటరే
ఆ అడుగు వెనుక రేపు ఎందరో
భావితరాల బాటలో తోడులేని నడక అలుపైనా
చివరికందేది మనకి గెలుపే
అంతవరకూ నా పయనం
అందుకొరకే న గమనం
|
|  | Srinivasulu Reddy Palavalli Posted at: 29, Nov 2009 10:40 PM | వేదమంటి నా హృదయ వేదన వింటావా
పాదమంటు కన్నీటి రోదన కంటావా
కంటి నిండా నీటితో ,ఒంటినిండా విషముతో
క్షణము క్షణము నా కణము కణము కృశించిపోతున్నవి
గుండె నిండా నీవుతో ,బండబారిన నేనుతో
వ్రణము ఘనమై నా కణము కణము శిలలౌతున్నవి
కంటి ముంగిట కలలతో , ఇంటి ముంగిట కళలతో
దినము దినము నా కణము కణము నీకై వేచి చూస్తున్నవి
చంటి పాప పాలవాసనలా ,చెరకువింటి ķ
|
| Login to Join Groups and Create your own Groups!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|