|
|
Articles: TP Features | భాష ఓ సరికొత్త మందుగుండు - Site Administrator
| |
(ఆచార్య జయధీర్ తిరుమలరావు)
తెలుగు సీమలో జీవించే వారంతా తెలుగువారు కాదు. ఇక్కడ నానా రకాల జాతుల వారు నివసిస్తున్నారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఆయా రాష్ట్రాలకు చెందిన జాతుల వారు, పర భాషీయులు తెలుగు నేలలో అనేక మంది జీవిస్తున్నారు. వీరంతా జాతి పరంగా తెలుగు లేదా ఆంధ్ర జాతికి సంబంధించిన వారు కాదు. కానీ వీరంతా తెలుగు భాషీయులు కావడానికి ఆస్కారం ఉంది. నిజానికి వీరి మాతృభాష తమిళమో, కన్నడమో, మరాఠీయో, ఒరియా లేదా మరేదైనా కానీయండి. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ నేల మీద జన్మించారు. అలా ఇక్కడ ఉన్న వాళ్ళు తమని తాము ఏమని భావిస్తారు.
వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులా? ఆంధ్ర జాతీయులా లేదా భాషా పరంగా తెలుగువారా? తెలుగు భాషా సమాజంలో జీవిస్తున్నందువల్ల తెలుగు భాషీయులా? ఈ సమస్య పర రాష్ట్ర సరిహద్దులకీవలా, ఆవలకీ సంబంధించిన విషయం.
నిజమే...
మరి మన రాష్ట్రంలో ఎంతో కాలంగా నివసిస్తున్న మహ్మదీయులు, సిక్కులు, ఉత్తర భారత దేశీయులు ఎంతో మంది ఉన్నారు. వీరు తమని తాము ఏమని భావిస్తారు. ఒక రాష్ట్రంలో ఉండే ప్రజలు తమని జాతి, భాష ద్వారానే గుర్తింపు పొందుతారా. పొందితే ఎలా. పొందకపోతే ఏమని తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|