|
|
Articles: TP Features | భవితనూ కాపాడుకోవాలి - Site Administrator
| |
(డాక్టర్ సామల రమేష్ బాబు)
దాదాపు రెండు నెలల క్రితం యశ్ పాల్ కమిషన్ నివేదిక విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులను తేదలచి తన సిఫారసులనిచ్చింది. విద్య ప్రాధాన్యతను ఎత్తిచూపుతూనే విద్యారంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా ఎజెండానిచ్చింది. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల పేర ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానం ఫలితంగా విద్యారంగంలో ప్రయివేటు భాగస్వామ్యానికి వాకిలి తెరిచినట్లయింది. క్రమంగా, గత రెండు దశాబ్దాలుగా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో ఈ రంగం కార్పొరేటీకరణ పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారీకరణకు లోనైంది. ఈ వరుసలోనే విదేశీ విద్యాసంస్థల ప్రవేశం, ప్రయివేట్ యూనివర్శిటీలు విజృంభించడం జరిగింది. ఈ క్రమం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడీ యశ్ పాల్ నివేదిక రావడం, మంత్రి కపిల్ సిబాల్ 100 రోజుల ప్రణాళికను ప్రకటించడంతో - జాతీయ స్థాయిలో పాఠశాల విద్యను స్థాయీకరించడం, మొత్తం అన్ని స్థాయిల్లో విద్యను ప్రయివేటుపరం చేయడం అనే దిశగా పాలకులు ముందుకు సాగుతున్నారు.
ఈ పరిణామంలో మనం తీవ్రంగా గమనించవలసిన అంశాల్లో ఒకటి - భారతీయ భాషలకు విద్యారంగంలో పాత్ర ఎంతవరకు ఉండబోతున్నదనేది. జాతీయ విధానాల గురించి మాట్లాడే ముందు విద్య ఉమ్మడి జాబితాలోని అంశమనే విషయాన్నీ, రాజ్యాంగంలోని భాషలకు ఆయా భాషీయుల విద్యా ప్రగతిలో తగిన చోటు కల్పించి తీరాలన్న ప్రాథమిక అంశాన్ని పట్టించుకొంటున్నారా అనేది.
ఈ అంశంపై యశ్ పాల్ కమిషన్ సిబాల్ ప్రణాళిక ఏమీ మాట్లాడలేదు. 1966లో కొఠారీ కమిషన్ జాతీయోద్యమ స్ఫూర్తితో వచ్చింది. అప్పటి సామాజిక, రాజకీయ నేపథ్యంలోని జాతీయ దృష్టి కోణం నుంచి వెలువడిన నివేదిక అది. సృజనాత్మక విద్యనూ, చైతన్యాన్నీ పెంపొందించి, విద్యారంగానికొక దిశానిర్దేశాన్ని కొఠారి కమిషన్ చేయగా, ఇప్పటి యశ్ పాల్ కమిషన్ సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు భారత విద్యారంగాన్ని దాసోహం చేసేవిధంగా సిఫారసులనిచ్చింది. అయితే, ఈ ధోరణులకు పునాదులు 1980లో అంతర్జాతీయ ద్రవ్యనిధితో మనం చేసుకొన్న ఒప్పందం నుంచీ క్రమక్రమంగా బయటపడ్డాయనీ, ఇప్పుడీ యశ్ పాల్ కమిషన్ నివేదిక వచ్చే లోపలే, కావలసిన ఏర్పాట్లన్నీ అన్నివిధాలా జరిగిపోయాయని మనం గ్రహించాలి. యశ్ పాల్ కమిషన్ నివేదిక మార్కెట్ శక్తుల ప్రయోజనాలకు కొమ్ముకాస్తూ సామాజిక ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసేట్లుగా ఉందనీ, వీటి మధ్య గల మౌలిక వైరుధ్యాన్ని పరిగణించలేదనీ వస్తున్న విమర్శను మనం గమనించాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|