|
|
Articles: TP Features | కార్పొరేట్ యోధులు - Site Administrator
| |
(యాస్మిన్ తాజ్)
సైనికాధికారి జీవితం దేశ సేవతో ప్రారంభమై దేశాన్ని రక్షించడంతో ముగుస్తుందని అంటుంటారు. కాని చాలా సార్లు, ముఖ్యంగా సమకాలిక జీవితంలో కని విని పరిస్థితులలో తన రక్షణ కెరీర్ ను వదలుకోవాలని నిర్ణయించుకుని లేక అలా తప్పనిసరిగా చేయవలసి వచ్చి సాధారణ పౌరునిగా కార్పొరేట్ జీవితాన్ని స్వీకరిస్తున్నారు. కాని, దేశ సేవలో అన్ని సంవత్సరాలు గడిపిన అనంతరం కార్పొరేటే ప్రపంచంలో అడుగు పెట్టడం అంత తేలికేమీ కాదు. అయితే, అటువంటి వారికి బి-స్కూల్స్ ధర్మమా అని సముజ్వల భవిష్యత్తు కనిపించబోతున్నది. సివిలియన్ ఉద్యోగాలను వాంఛిస్తున్న సైనికాధికారులకు అనువైన కోర్సులను పెక్కు బి-స్కూల్స్ ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాయి.
రెండవ ఇన్నింగ్స్
ఎస్ వికెఎంకు చెందిన ఎన్ఎంఐఎంఎస్ విశ్వవిద్యాలయం విద్యా విభాగం ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.సి. అగర్వాల్ ఇలా తెలియజేస్తున్నారు: 'ముందుగా రిటైర్ కావడం వల్ల లేదా షార్ట్ కమిషన్ వల్ల సైన్యంలో నుంచి బయటకు రాగోరుతున్న ఆఫీసర్లకు వారి రెండవ కెరీర్లలో చేయూత ఇచ్చేందుకు న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వశాఖలోని పునరావాస విభాగం డైరెక్టరేట్ ఒక పథకాన్నిప్రారంభించింది. శిక్షణ పొందవలసి ఉన్న ఈ ఆఫీసర్లను డైరెక్టరేట్ ఎంపిక చేసి వివిధ మేనేజ్ మెంట్ విద్యా సంస్థలకు పంపుతుంది. డైరెక్టరేట్ మూడు సంవత్సరాల క్రితం మాతో మాట్లాడి ఈ ఆఫీసర్ల కోసం ఒక మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ కు రూపకల్పన చేయవలసిందిగా విజ్ఞప్తి చేసింది. మేము వెంటనే ఈ విజ్ఞప్తికి అంగీకరించి ఈ ఆఫీసర్ల కోసం ఈ ప్రోగ్రామ్ కు రూపకల్పన చేశాం'. 'పోస్ట్ - గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్ మెంట్' అనే పేరు గల ఈ ప్రోగ్రామ్ వ్యవధి ఆరు నెలలు. ఇది ఫుల్ టైమ్ కోర్సు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|