|
|
Articles: Poetry | ఆ...కలి - Mr. kumar akkineni
| |
ఆకలి... ఔను ఆకలి
అదే కలి మహత్యం... ఆ..కలి
ఐదు వేళ్ళు నోట్లోకి పోని..
అభాగ్యుడికి అన్నం కోసం ఆకలి
కాలేజీకి వెళ్ళే అమ్మాయికి
ఆకర్షణ కోసం ఆకలి
ఎదుగుతున్న కుర్రకారుకు
అల్లరి ఆకలి
చీరెల కోసం నగల కోసం
గృహిణుల ఆకలి
అందే జీతం కంటే...
అందని గీతం కోసం...
లంచగొండి... ఆకలి
కోట్ల జనం కళ్ళి గప్పి...
విభేదాలు రెచ్చగొట్టి...
దొరకని పదవుల కోసం
అమాయకుల బలి.. ఆకలి
భరతమాత నా మాతృభూమి
భారతీయులంతా నా సహోదరులు
అని రోజూ వల్లె వేసే...
నోటితోనే.. నీది కాదు నాదని
తేడాలను సృష్టించే...
ఆధునిక... ఆ..కలి..కలి...
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|