|
|
Articles: TP Features | గ్రహణాన్ని చూడొచ్చు - Site Administrator
| |
ఈనెల 22వ తేదీన వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదైనది, అసాధారణమైనది. చాలా ఎక్కువసేపు ఉంటుంది. మన దేశంలోని సూరత్ లో మాత్రమే సూర్యగ్రహణాన్ని సంపూర్ణంగా చూసే అవకాశం ఉంది. ఢిల్లీలో 85 శాతం మాత్రమే చూసే అవకాశం ఉంది. గుడ్డినమ్మకాలతో గుడ్డిగా కళ్ళు మూసుకుని కూచుంటే మంచి అవకాశం చేజారి పోతుందని పిల్లలు దీన్ని తప్పకుండా చూడాలని డాక్టర్ కిశోర్ రావు అంటున్నారు. తెల్లవారు ఝామున 5.28 గంటలకు సూర్యోదయంతో పాటే ప్రారంభమయ్యే గ్రహణం ఉదయం 10.42 గంటలకు ముగుస్తుంది. ఇందులో సంపూర్ణంగా ఉండే గ్రహణం 6.26కు మొదలై 6.30 వరకు ఉంటుంది. అంటే ఆరునిమిషాల 38 సెకన్ల వరకు ఉంటుందన్నమాట. ఈ మహాద్భుతమైన దృశ్యాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో చూడవచ్చు. కాగా ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు చాలామంది సూరత్ నగరాన్ని ఎంచుకున్నారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు సూరత్ పట్టణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ నగరానికి సూర్యుడి నగరం అని పేరు ఉంది. రెండేళ్ళకొకసారి సూర్య గ్రహణం సంభవించడం విధాయకం. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం అరుదుగా వస్తుంది.
గతంలో పూర్తి సూర్యగ్రహణం 1999లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తోంది. ఇది తప్పితే తిరిగి 2132 వస్తంది. తెల్లగా వెలుగులు చిమ్ముతూ ఆకాశంలో తిరుగుతూ రోగకారకాలైన క్రిములను హతమార్చాల్సిన సూర్యుడు ఆకాశం నుంచి అదృశ్యం కావడం అశుభసూచకం అని పాతకాలం వారు విశ్వసిస్తారు. సూర్యున్ని, చంద్రున్ని రాహుకేతు గ్రహాలు మింగుతాయని అందుకే ఆకాశంలో గ్రహణాలు సంభవిస్తున్నాయని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం దేవదానవులు పాలసముద్రాన్ని మథించి అమృతం బైటికి తీశాక దాన్ని దానవులకు దక్కకుండా కాపాడుతూ దేవతలకే ధారపోసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తుతాడు. దానవుల కళ్ళుకప్పి వారిని ఆటపాటలతో ముంచెత్తి దేవతలకు అమృతం పోస్తున్న విషయాన్ని గమనించిన రాహు, కేతువు అనే ఇద్దరు రాక్షసులు దేవతలుగా మారు వేషం వేసుకుని దేవతల వరుసలో కూర్చున్నారు. మోహిని చూసుకోకుండా వారికి అమృతం ఇస్తుందేమోనని భయపడిన సూర్యుడు, చంద్రుడు కంటి సైగతో హరిని అప్రమత్తం చేశారు. కానీ అప్పటికే వారి నోట్లోకి ఒక్క చుక్క అమృతం పడనే పడింది. అయితే అది గొంతు దిగకుండా చేసేందుకు నారాయణుడు వెంటనే విష్ణుచక్రం ప్రయోగించి వారి తలలు నరికాడు. ఆ రాక్షసుల భౌతిక శరీరం నిర్జీవంగా మారినా వారి తలలు మాత్రం సజీవంగా మారాయి. తమకు చావు, బతుకు కాని దుస్థితి కలిగించిన సూర్యుడిని, చంద్రుడిని గుర్తించి వారిని మింగడం ద్వారా ఎప్పటికప్పుడు పగతీర్చుకుంటున్నారు.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|