|
|
Articles: TP Features | తెలుగువారికి మూడు రాష్ట్రాలు - Site Administrator
| |
రాజకీయాల పేరుతో అధికారాన్ని అనుభవిస్తున్న వర్గాలు, కులాలు ఎవరు. ఏ ప్రాంతానికి చెందిన, ఏ కులాలు రాజకీయాల వల్ల లాభపడుతున్నాయి అన్న విషయాన్ని గమనించాలి. తెలంగాణా వారు ఆ రెండు జిల్లాలు అని ఆడిపోసుకుంటున్నారు. నిజంగా ఆ రెండు జిల్లాల్లోని ప్రజలందరు చెడ్డవారేనా? కాదు కదా! ఆ జిల్లాల నుండి వచ్చిన అతి కొద్ది మంది బడా నాయకుల వల్ల ఆ జిల్లాలకు చెడ్డపేరు రావడాన్ని ఆ జిల్లాల్లోని సామాన్య జనులు ఎందుకు అర్థం చేసుకోరు. ఆ నాయకులను వారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు.
మూడు రాజధాని నగరాలు, మూడు శాసనసభలు, మూడు హై కోర్టులు ఎంత అభివృద్ధికరమైన ఆలోచన! మిడిలీస్ట్ లో మన రాష్ట్రంలోని ఒక మండలం కన్నా చిన్న దేశాలున్నాయి. యూరఫ్ లో మన జిల్లా అంతటి దేశాలు ఎన్నో ఉన్నాయి. 25 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో దాదాపు 60 రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలోనే అనంతపురం జిల్లా అంతటి విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఇంత పెద్ద రాష్ట్రం రెండు అయితే నష్టం ఏమిటి.
పరిపాలనకు, ప్రజల రాకపోకలకు రాజధాని దగ్గరలో ఉండాలన్న వీలును చూడాలి కాని, నాకు ఇబ్బంది అవుతుంది, నా కుటుంబానికి ఇబ్బంది అవుతుంది 'అనుకుని రాష్ట్ర విభజనను వద్దు అనుకోవడం కేవలం స్వార్ధపూరిత ఆలోచన తప్ప ఇంకేమీ కాదు. శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా నుండి ఒక పౌరుడు తన బదిలీ కోసం లేదా గట్టు పంచాయితీ కోసం హైదరాబాద్ రావడంలో ఎంత ఇబ్బంది ఉందో గమనించాలి. ఇదంతా స్వార్ధ నాయకుల గొడవ. వారి స్వార్ధచింతన దీనిని సాధారణ జనం అర్థం చేసుకోవాలి.'
రాష్ట్రంలో ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు రాజకీయాలలోకి రాగానే ఏడాది, రెండేళ్ళలోనే కోటీశ్వరుడు ఎలా అవుతున్నాడు. హైదరాబాద్ లో ఆస్తులు ఎలా కూడబెట్టుకుంటున్నాడు? రాష్ట్ర సంపదలో దాదాపు 50 శాతం సంపదను, ఆస్తులను రాజకీయ నాయకులు ఎలా హస్తగతం చేసుకుంటున్నారు. ఇన్నేళ్ళలో ఒక రాజకీయ నాయకుడి ఇంటి మీద కూడా ఇన్ కమ్ టాక్స్ శాఖ వారు ఎందుకని దాడి చేయలేదు. ముఖానికి రంగు పూసుకొని రాత్రి పగలు తేడా లేకుండా నటించే సినీ కళాకారుల ఇండ్లపై, ఊరుగాని ఊరు వెళ్ళి ఉద్యోగాలు చేసే అధికారులపై దాడి చేస్తున్న ఇన్ కమ్ టాక్స్ వారికి రాజకీయ నాయకుల సిరిసంపదలు కనిపించవా? సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఆస్తుల విలువ వందల కోట్లకు తక్కువగా ఉండే అవకాశమే లేదు.
| Read 9 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|